మండల పరిధిలోని కొండాపురం గ్రామం వద్ద నిలిచిపోయిన రైల్వే నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. బుధవారం పనులను మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి నిలిపి వేశారని సంబందిత కాంట్రాక్టర్ ఆరోపించిన విషయం తెలిసిందే.
ధరూరు, న్యూస్‌లైన్ : మండల పరిధిలోని కొండాపురం గ్రామం వద్ద నిలిచిపోయిన రైల్వే నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. బుధవారం పనులను మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి నిలిపి వేశారని సంబందిత కాంట్రాక్టర్ ఆరోపించిన విషయం తెలిసిందే.
అభివృద్ది పనులను అడ్డుకోవడం మంచి పద్దతి కాదంటూ వాటిని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కృష్ణమోహన్‌రెడ్డి దగ్గరుండి చేయించారు. కాంట్రాక్టర్‌కు అండగా ఉండి పనులను ఆయన రైతులతో కలిసి ప్రారంభించారు. పనులు ప్రారంభం కావడంతో రైతులు, ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలోనే మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి అదే మార్గంలో వెళ్లి ఈర్లబండ గ్రామానికి వెళ్లే నెట్టెంపాడు కాలువను పరిశీలించి తిరిగి వచ్చారు.