railway group d exam
-
మోదీ సర్కారుకు మరోసారి ప్రశ్నాస్త్రాలు
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి మోదీ సర్కారుపై ప్రశ్నాస్త్రాలు ఎక్కుపెట్టారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, వారు ఎంతకాలం ఎదురు చూడాలని ప్రశ్నించారు. ‘ప్రభుత్వ ఉద్యోగాలే లేవు. ఒకవేళ అవకాశం వస్తే పేపర్ లీక్ అవడం, ఎగ్జామ్ పెట్టినా ఫలితాలు ప్రకటించకపోవడం, లేదంటే ఏదో స్కామ్ కారణంగా క్యాన్సిల్ కావడం జరుగుతోంది. 1.25 కోట్ల మంది యువకులు రైల్వే గ్రూప్ డి ఉద్యోగ ఫలితాల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ విషయంలోనూ అదే పరిస్థితి. భారతదేశంలోని యువత ఎప్పటి వరకు ఓపిక పట్టాలి?’ అని వరుణ్ గాంధీ ట్విటర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు. ఆర్థిక, ఉపాధి సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (UPTET)ని రద్దు చేస్తూ గత నెలలో యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వరుణ్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్ లీక్ అయినట్టు వార్తలు రావడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. (చదవండి: మేము లేకుండా బీజేపీని ఓడించలేరు) ‘యూపీ టెట్ పరీక్ష పేపర్ లీక్ అనేది లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆడుకోవడం లాంటిది. కిందిస్థాయి అధికారులపై చర్య తీసుకోవడం ద్వారా దీనిని అడ్డుకోలేము. విద్యా మాఫియా, వారిని పోషిస్తున్న రాజకీయ నాయకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. చాలా విద్యాసంస్థలు రాజకీయ పలుకుబడి కలిగిన వారి ఆజమాయిషిలో ఉన్నాయి. వాటిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు?’ అని వరుణ్ గాంధీ ప్రశ్నించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా కూడా ఆయన గళం వినిపించిన సంగతి తెలిసిందే. (చదవండి: గులాం నబీ అజాద్ సంచలన వ్యాఖ్యలు.. ఆ పరిస్థితి కనించటం లేదు) -
పేపర్ల లీకేజి వెనుక మశ్చేందర్?
ఆర్ఆర్బీ గ్రూప్-డి పరీక్ష పత్రాల లీకేజి వ్యవహారం వెనక మశ్చేందర్ అనే రైల్వే ఉద్యోగి పాత్ర ఉన్నట్లు తెలుస్తోందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు. లీకేజి ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. రైల్వే సిబ్బంది పాత్ర ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిగిలిన సెంటర్లలో పరీక్షలు ప్రశాంతంగా సాగాయని ఆయన అన్నారు. కాపీయింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై పదిమందిని పోలీసులు విచారిస్తున్నారని సాంబశివరావు అన్నారు. పరీక్ష రద్దు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తదని ఆయన చెప్పారు. పోలీసులు అందించిన వివరాలను రైల్వే బోర్డుకు నివేదిస్తామని, రైల్వే బోర్డు ఆదేశాల మేరకు నడుకుంటామని అన్నారు. మొత్తం 3.19 లక్షల మంది ఈ పరీక్షలు రాసినట్లు సాంబశివరావు చెప్పారు. -
పరీక్షను రద్దు చేయడం కుదరదు: రైల్వేశాఖ
హైదరాబాద్ : రైల్వే రిక్రూట్మెంట్ సెల్ గ్రూప్-డి పరీక్ష సందర్భంగా జరిగిన హైటెక్ కాపీయింగ్ సంఘటనపై రైల్వేశాఖ స్పందించింది. పరీక్షను రద్దు చేయడం కుదరదని, మాస్ కాపీయింగ్ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని రైల్వే సీపీఆర్వో సాంబశివరావు సోమవారమిక్కడ తెలిపారు. దీనిపై నివేదిక వచ్చిన తర్వాత బాధ్యలపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆర్ఆర్సీ పరీక్ష మాస్ కాపీయింగ్‌కు సంబంధించి ప్రధాన సూత్రధారి మచ్చేందర్, మరొక రైల్వే ఉద్యోగి కోసం ప్రత్యేక బృందం..గాలిస్తోంది. నాందేడ్‌లో కూడా ఇలాంటి హైటెక్ మాస్ కాపీయింగ్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
మాస్ కాపీయింగ్ ప్రధాన సూత్రధారి కోసం గాలింపు
హైదరాబాద్:రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బి) గ్రూప్-బి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు కారణమైన ప్రధాన సూత్రధారి మశ్చేందర్ కోసం స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్ఓ) పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతనితో పాటు ఈ ఉదంతానికి సహకరించిన ఓ రైల్వే ఉద్యోగి కోసం కూడా ప్రత్యేక బలగాలు గాలింపు చేపట్టాయి. మౌలాలీ రైల్వే క్వార్టర్స్‌లో ఈ ముఠా ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక కంట్రోల్ రూంపై ఎస్వోటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు ఉమేందర్, పుష్పన్‌కుమార్ ఆదివారం దాడి చేసి 20 మందిని పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడ, తిరుపతిలోని 10 పరీక్ష కేంద్రాలపై ఏకకాలంలో దాడులు చేసి 10 మంది అభ్యర్థులను అరెస్టు చేశారు. అయితే నాందేడ్ కూడా మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. నిందితులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రాలుగా ఎంచుకుని మాస్ కాపీయింగ్ దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
రైల్వే గ్రూప్-డీ పరీక్షలో మాస్‌కాపీయింగ్
* ‘వాట్స్‌యాప్’ సాయంతో ప్రశ్నపత్రం లీక్ * బ్లూటూత్ ద్వారా సమాధానాల చేరవేత * గుట్టురట్టు చేసిన ఎస్వోటీ పోలీసులు * 20 మంది ముఠా సభ్యులు..10 మంది అభ్యర్థుల అరెస్టు * పరారీలో కీలక సూత్రధారి హైదరాబాద్: రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ) గ్రూప్-డీ పరీక్షను హైటెక్ పద్ధతిలో మా స్ కాపీయింగ్ చేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్వోటీ) పోలీ సులు రట్టు చేశారు. మౌలాలీ రైల్వే క్వార్టర్స్‌లో ఈ ముఠా ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక కంట్రోల్ రూంపై ఎస్వోటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు ఉమేందర్, పుష్పన్‌కుమార్ ఆదివారం దాడి చేసి 20 మందిని పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడ, తిరుపతిలోని 10 పరీక్ష కేంద్రాలపై ఏకకాలంలో దాడులు చేసి 10 మంది అభ్యర్థులను అరెస్టు చేశారు. నిందితులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించినట్లు తేలింది. ‘తాయత్తు’లో సమాధానాలు.. ఆర్ఆర్సీ పరీక్ష మాస్‌కాపీయింగ్‌లో రైల్వే ఉద్యోగి మచ్చేందర్ కీలక సూత్రధారని పోలీసు లు గుర్తించారు. పరీక్ష రాసే అభ్యర్థులకు సమాధానాలు చేరవేస్తానని ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 లక్షలు వసూలు చేశాడు. ఇందుకోసం 20 మంది సభ్యులతో ముఠాను ఏర్పాటు చేశాడు. మౌలాలి ఉప్పరిగూడలోని రైల్వే క్వార్టర్స్‌లోని నీళ్లట్యాంక్ సమీపంలో ఒక తాత్కాలిక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశాడు. అక్కడ ల్యాప్‌టాప్‌లు, బ్యాటరీలు, సెల్ఫోన్లు, బ్లూటూత్‌ల ఆధారంగా పరీక్షహాల్లో ఉండే అభ్యర్థులకు సమాధానాలు చేరవేసేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ముఠాలో కీలక సభ్యుడు వరుణ్ పరీక్ష హాల్లో అభ్యర్థిగా వెళ్లిపోయాడు. ఆదివారం నిర్వహించిన ఆర్ఆర్సీ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని తన సెల్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్(మొబైల్ అప్లికేషన్) ద్వారా ముఠాకు చేరవేశాడు. ముఠాలోని మరో వ్యక్తి ఇలియాస్ జవాబులను నిపుణులైన గిరిధర్, వెంకటేశ్, అశోక్, శ్రీనివాస్(ముఠాసభ్యులే)తో తయారు చేయించాడు. తర్వాత ముఠా సభ్యులు జవాబులను తమ అభ్యర్థులకు హైటెక్ పద్ధతిలో చేరవేశారు. ఇందుకోసం మెడలో తా యత్తులా కనిపించే పరికరాన్ని(అందులో సిమ్‌కార్డు ఉంది) అభ్యర్థులకు ఇచ్చారు. దానితో పాటు జవాబులు వినిపించడానికి వైర్లెస్ ఇయర్‌ఫోన్ అందజేశారు. ఈ ముఠాపై విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్వోటీ సిబ్బంది ఉప్పరిగూడ వద్ద ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా నగరంలోని దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్లో పరీక్ష రాస్తున్న సరిత, పరమేశ్, శ్యాంలను అరెస్టు చేశారు. అలాగే, అర్చన కాంప్లెక్స్‌లోని చైతన్య జూనియర్ కళాశాలలో ఇద్దరు, తిరుమలగిరిలోని గౌతమ్ మోడల్ స్కూల్లో ఐదుగురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ముఠాసభ్యులు, అభ్యర్థుల నుం చి 13 సిమ్ కార్డులు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్, 9 ఇయర్ ఫోన్స్, 27 సెల్ఫోన్లు, 17బైక్‌లు, 3 డేటా కార్డులను స్వాధీనం చేసుకున్నా రు. నేరెడ్‌మెట్‌లోని డీఏవీ పాఠశాల, సమార్టిన్ పాఠశాల, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజీ, పద్మావతి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, విజయవాడలోని సెయింట్ రిటా హైస్కూల్, రవీంద్రభారతి పబ్లిక్ స్కూల్, గౌతం డిగ్రీ కాలేజీ, మియాపూర్‌లోని సెయింట్ రిటా హైస్కూల్లో మరికొందరు విద్యార్థులు హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడి ఉంటారని పోలీ సులు అనుమానిస్తున్నారు. కీలక సభ్యుడు మచ్చేందర్ పరారీలో ఉన్నట్లు అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. పోలీసుల నివేదిక ఆధారంగా చర్యలు ఆర్ఆర్సీ గ్రూప్ డీ పరీక్షల్లో హైటెక్ మాస్‌కాపీయింగ్ జరగడంతో పరీక్షలు మళ్లీ నిర్వహిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై రైల్వే సీపీఆర్ఓ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘నాలుగు ఆదివారాలు పరీక్షలు సాఫీగానే సాగాయి. చివరి ఆదివారం మాస్‌కాపీయింగ్ విషయం బయటపడింది. పోలీసుల నివేదిక ఆధారంగా మాస్‌కాపీయింగ్ జరిగిందా లేదా..? కేవలం పది మంది అభ్యర్థులకే వీరు సమాధానాలు చేరవేశారా లేక మరింత మంది ఈ తరహా కాపీయింగ్‌కు పాల్పడ్డారా? అనేది తెలియాలి. అప్పుడే పరీక్షలు మళ్లీ నిర్వహించాలా వద్దా అనే విషయంపై స్పష్టత వస్తుంది’ అని అన్నారు.