హైదరాబాద్:రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బి) గ్రూప్-బి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు కారణమైన ప్రధాన సూత్రధారి మశ్చేందర్ కోసం స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్ఓ) పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతనితో పాటు ఈ ఉదంతానికి సహకరించిన ఓ రైల్వే ఉద్యోగి కోసం కూడా ప్రత్యేక బలగాలు గాలింపు చేపట్టాయి.
మౌలాలీ రైల్వే క్వార్టర్స్‌లో ఈ ముఠా ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక కంట్రోల్ రూంపై ఎస్‌వోటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు ఉమేందర్, పుష్పన్‌కుమార్ ఆదివారం దాడి చేసి 20 మందిని పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడ, తిరుపతిలోని 10 పరీక్ష కేంద్రాలపై ఏకకాలంలో దాడులు చేసి 10 మంది అభ్యర్థులను అరెస్టు చేశారు. అయితే నాందేడ్ కూడా మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. నిందితులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రాలుగా ఎంచుకుని మాస్ కాపీయింగ్ దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మాస్ కాపీయింగ్ ప్రధాన సూత్రధారి కోసం గాలింపు
Published Mon, Dec 1 2014 11:37 AM | Last Updated on Fri, Jul 27 2018 1:16 PM
Advertisement
Advertisement