సెప్టెంబర్ 1 నుంచి కొత్త రైల్వే టైమ్‌టేబుల్
హైదరాబాద్ : వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి కొత్త సదరన్ రైల్వే టైమ్‌టేబుల్ అమల్లోకి రానుంది. ఈ మేరకు పలు రైళ్ల వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొన్ని రైళ్ల నంబర్లలోనూ, అదనపు హాల్టింగ్ సదుపాయాలలోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలోనే కొత్త రైల్వే టైమ్‌టేబుల్‌ను ప్రవేశపెడతారు.
కానీ ఈ ఏడాది నూతన ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో ఆలస్యమైంది. ఈ టైమ్‌టేబుల్ పుస్తకంలో దక్షిణ రైల్వే, దక్షిణమధ్యరైల్వే, దక్షిణపశ్చిమ రైల్వే, కొంకణ్ రైల్వేస్‌కు సంబంధించిన రైళ్ల రాకపోకల వేళలు, నంబర్లు, రైళ్ల పొడిగింపు వంటి వివరాలుంటాయి. నాలుగు జోన్ల రైళ్ల వివరాల రూపకల్పనలో యంత్రాంగం నిమగ్నమై ఉన్నట్లు సీపీఆర్వో కె.సాంబశివరావు చెప్పారు.