సెప్టెంబర్ 1 నుంచి కొత్త రైల్వే టైమ్‌టేబుల్ | The new railway timetable from September 1 | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 1 నుంచి కొత్త రైల్వే టైమ్‌టేబుల్

Published Tue, Aug 26 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

The new railway timetable from September 1

హైదరాబాద్ : వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి కొత్త సదరన్ రైల్వే టైమ్‌టేబుల్ అమల్లోకి రానుంది. ఈ మేరకు పలు రైళ్ల వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొన్ని రైళ్ల నంబర్లలోనూ, అదనపు హాల్టింగ్ సదుపాయాలలోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలోనే కొత్త రైల్వే టైమ్‌టేబుల్‌ను ప్రవేశపెడతారు.

కానీ ఈ ఏడాది నూతన ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో ఆలస్యమైంది. ఈ టైమ్‌టేబుల్ పుస్తకంలో దక్షిణ రైల్వే, దక్షిణమధ్యరైల్వే, దక్షిణపశ్చిమ రైల్వే, కొంకణ్ రైల్వేస్‌కు సంబంధించిన  రైళ్ల రాకపోకల వేళలు, నంబర్లు, రైళ్ల పొడిగింపు వంటి వివరాలుంటాయి.  నాలుగు జోన్‌ల రైళ్ల వివరాల రూపకల్పనలో యంత్రాంగం నిమగ్నమై ఉన్నట్లు సీపీఆర్వో కె.సాంబశివరావు చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement