rajanna sircilla tour
-
‘రాజన్న సిరిసిల్ల’లో నేడు సీఎం కేసీఆర్ పర్యటన
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ప్రారంభించనున్నారు. పల్లె, పట్టణ ప్రగతి, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమావేశం కానున్నారు. తంగెళ్లపల్లి మండలంలోని మండెపల్లి గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి, వాటి పత్రాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇదే గ్రామంలో ‘టైడ్స్’ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్)ను, సిరిసిల్ల మండలంలోని సర్దాపూర్‌లో వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభించనున్నారు. సిరిసిల్ల మండలం రాగుడు గ్రామంలో మధ్యాహ్న భోజనం చేస్తారు. రోడ్డు మార్గాన జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి సాయంత్రం 4 గంటలకు రోడ్డు మార్గంలోనే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. కేసీఆర్ రాకను పురస్కరించుకొని శనివారం ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ఏర్పాట్లను సమీక్షించారు. -
సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన
రాజన్న సిరిసిల్ల: తెలంగాణాలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాను అగ్రభాగాన నిలిపేందుకే పట్టణ ఏరియా ఆసుపత్రిలో రూ. యాభై కోట్ల వ్యయంతో బ్లడ్ బ్యాంక్, డయాలసిస్ సెంటర్, పది పడకలతో ఐసీయూలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రి కేటీఆర్ మంగళవారం సిరిసల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందేందుకే ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రిల చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా నలభై సెంటర్లలో వెయ్యి డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిరిసిల్ల విద్యార్థినిల భవిష్యత్తుకై రూ. 36.5 కోట్లతో నర్సింగ్ కళాశాల, అలాగే రూ.13 కోట్లతో 50 పడకల మాతా శిశు సంక్షేమ కేంద్రానికి శంకుస్థాపన చేసుకున్నామని, వచ్చే సంవత్సరం నుంచి వీటిని ప్రారంభిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రిల ప్రత్యేక చొరవతోనే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. తెలంగాణా ఆడపడుచులకు ఇస్తున్న పావలా వడ్డీ రుణాలలో భాగంగా రూ.12 కోట్ల చెక్కును మంత్రి కేటీఆర్ అందజేశారు.