rajarao
-
కరోనాకు వేవ్‌లు లేవు... వేరియంట్లే
సాక్షి, హైదరాబాద్: ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన కరోనా మహమ్మారి ఇకపై వేవ్ రూపంలో వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, వివిధ రకాల వేరియంట్లు మాత్రం ఉంటాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫస్ట్, సెకెండ్ వేవ్‌లలో విశ్వరూపం చూపించిన కరోనా వైరస్ థర్డ్‌వేవ్ నాటికి బలహీన పడిందన్నారు. గత పాండమిక్‌లు, వైరస్ల చరిత్ర పరిశీలిస్తే మూడు వేవ్‌ల తర్వాత వైరస్లు వివిధ రకాలుగా రూపాంతరం చెంది, కొంతమేర శక్తి కోల్పోయి బలహీన పడినట్లు వైద్య నిపుణుల పరిశీలనలో తేలిందన్నారు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో ప్రాణనష్టం జరిగిందని, థర్డ్‌వేవ్‌లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత బలహీనమైనదిగా నిర్ధారణ అయిందన్నారు. వైరస్లు కొంతకాలం తర్వాత రూపాంతరం చెంది బలహీన పడతాయని, కొన్ని సందర్భాల్లో మాత్రం మరింత బలపడి విజృంభిస్తుందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ టీకా అందుబాటులోకి రావడం, వైరస్‌పై అవగాహన కలగడం, రోగనిరోధకశక్తి పెరగడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే కోవిడ్ వైరస్ తన ప్రభావాన్ని కొంతమేర కొల్పోయినట్లు భావించవచ్చన్నారు. (క్లిక్: తెలంగాణ: రానున్న 15 ఏళ్లలో భారీగా తగ్గనున్న యువత..) గాంధీ ఆస్పత్రిలో ప్రస్థుతం 31 మంది కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామని, కోవిడ్ డిశ్చార్జీలు కొనసాగుతుండగా, అడ్మిషన్ల సంఖ్య పూర్తిగా తగ్గిందన్నారు. మూడు వేవ్‌ల్లో వేలాది మంది బాధితుల ప్రాణాలను కాపాడిన ఘనత గాంధీ వైద్యులు, సిబ్బందికే దక్కుతుందన్నారు. పూర్తిస్థాయిలో కరోనా ముప్పు తొలగిపోలేదని, వేవ్ రాకున్నా, వేరియంట్లు ఉన్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. (క్లిక్: ఓయూలో అబ్బాయిల హాస్టల్.. అమ్మాయిలకు!) -
రాజారావు
ఇంగ్లిష్‌లో రాసిన తొలితరం భారతీయ రచయితల్లో ఒకరు ‘పద్మ విభూషణ్’ కె.రాజారావు (1908–2006). కర్ణాటకలో జన్మించారు. తండ్రి హైదరాబాద్‌లో కన్నడ బోధిస్తుండటం వల్ల నిజాం కాలేజీలో చదువుకున్నారు. తత్వవిచారణ మీద ఆయన రచనలు ఎక్కువ దృష్టిని సారిస్తాయి. నాలుగేళ్లప్పుడు తల్లిని కోల్పోయారు. ఆ శూన్యం ఆయన రచనల్లో ప్రతిఫలిస్తుంది. తాతయ్యతో పెరిగిన అనుభవాలు కూడా ఆయన మీద ప్రభావాన్ని చూపాయి. స్వాతంత్య్రం కోసం సాగిన అహింసా పోరాటం మీద గాంధీజీ ప్రభావాన్ని తొలి నవల ‘కాంతాపుర’ (1938)లో చిత్రించారు. ఫ్రాన్స్‌లో ఫ్రెంచ్ అభ్యసించిన రాజారావు అక్కడి ఫ్రెంచ్ వనితను పెళ్లాడారు. ఎనిమిదేళ్ల తర్వాత విడిపోయారు. ఈ నేపథ్యంలో ‘ద సర్పెంట్ అండ్ ద రోప్’ పేరుతో రాసిన ఆత్మకథాత్మక నవలలో భారతీయ, పాశ్చాత్య సంస్కృతుల మధ్య సంబంధాన్ని చిత్రించారు. సర్పెంట్ (సర్పం) భ్రాంతికీ, రోప్(తాడు) వాస్తవానికీ సంకేతాలు. అనంతరం అమెరికాలో తత్వశాస్త్ర ఆచార్యుడిగా పనిచేశారు. నేను అడవిలో ఉన్నాసరే నా కోసం రాసుకుంటాను, పదాల్లోని ఇంద్రజాలాన్ని ఆనందిస్తాను అనే రాజారావు, రచన మన నుంచి వచ్చినంత మాత్రాన అది మనది కాదని చెబుతారు. ‘ద కౌ ఆఫ్ ద బారికేడ్స్’, ‘ద పోలీస్‌మేన్ అండ్ ద రోజ్’ ఆయన కథాసంపుటాలు. -
వసతి గృహాల్లో ఏసీబీ తనిఖీలు
ఫిరంగిపురం : స్థానిక రెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో జిల్లా ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఏసీబీ డీఎస్పీ రాజారావు ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు మూడు బృందాలుగా ఏర్పడి రాత్రి 6.30 గంటల వరకు 23 రకాల రిజిస్టర్లను పరిశీలించారు.తనిఖీలలో సీఐలు శ్రీనివాసరావు, నరసింహారెడ్డి, యాదగిరి, సత్తెనపల్లి సాంఘిక సంక్షేమశాఖ ఏఎస్‌డబ్లు అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు. రెంటచింతలలో... ఎస్సీ బాలికల హాస్టల్లో గురువారం ఏసీబీ డీఎస్పీ రాజారావు ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆకస్మిక తనిఖీ నిర్విహ ంచారు. అకౌంట్స్ ఆఫీసర్ రామిరెడ్డి, ఏసీబీ సీఐ కె.సీతారామ్, సత్తెనపల్లి తూనికలు, కొలతల ఇన్స్పెక్టర్ ఎన్.అల్లూరయ్య, 15 మంది బృంద సభ్యులు తనిఖీలో పాల్గొన్నారు. -
కోతలకు నిరసనగా రాస్తారోకో
చిన అన్నలూరు (కలిగిరి) : విద్యుత్ కోతలను నిరసిస్తూ శనివారం చిన అన్నలూరు సబ్‌స్టేషన్ ఎదుట రైతు లు రాస్తారోకో చేపట్టారు. కృష్ణారెడ్డిపాలెం, తెల్లపాడు, చినఅన్నలూరు పంచాయతీల్లోని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన రైతుల నినాదాలు చేశారు. వ్యవసాయానికి కనీ సం రోజుకు మూడు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విష యం తెలుసుకున్న ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాసులరెడ్డి సబ్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎస్సై దాసరి రాజారా వు ఆదేశాలతో ఏఎస్సై రఘురామ య్య సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చారు. రైతులు పలు విద్యుత్ సమస్యలను ఏఈ దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఏఈ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రామతీర్థం సబ్‌స్టేషన్ ముట్టడి విడవలూరు : మండలంలోని రామతీర్థం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శనివారం వేరుశనగ రైతులు ముట్టడించారు. విద్యుత్ కోతలకు నిరసనగా రామతీర్థం, రామచంద్రాపురం, గౌరీపురం, లక్ష్మీపురం, రవీంద్రపురం తదితర గ్రామాలకు చెందిన సుమారు 100 మంది రైతులు సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని, విద్యుత్ శాఖ అధికారులు, ప్ర భుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ సబ్‌స్టేషన్ పరిధిలో సుమారు 450 ఎకరాలలో వేరుశనగ పంట సాగవుతోందన్నారు. బిందు సేద్యం ద్వారా సాగు చేసే ఈ పంటకు విద్యుత్ తప్పనిసరని చెప్పారు. ఈ సమస్యపై మూడు రోజుల క్రితం సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టినప్పుడు అధికారులు తప్పక విద్యుత్ సరఫరా చేస్తామని మాట ఇచ్చి తప్పారని ధ్వజమెత్తారు. ఒక దశలో రైతులు విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న విడవలూరు, అల్లూరు ట్రాన్స్ కో ఏఈలు మదన్మోహన్, పరిశుద్ధరావు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి ఈ పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. రైతలు జీవితాలతో ఆటలొద్దు .. బాలాయపల్లి: విద్యుత్ సరఫరాను అస్తవ్యస్తం చేసి తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడాపెడా విద్యుత్ కో తలకు నిరసనగా శనివారం వారు ఆందోళనకు దిగారు. బాలాయపల్లిలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌కు తాళం వేశారు. రైతులు మాట్లాడుతూ వారం నుంచి రోజుకు 2 గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ ఇస్తున్నారన్నారు. ఆ నీళ్లు కాలువలను కూడా దాటకపోవడంతో నిమ్మ, బత్తాయి, మామిడి, బొప్పాయి తోటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు సా గుచేస్తున్నామని, విద్యుత్ కోతల మూలంగా నష్టపోతున్నామన్నారు. సమాచారం అందుకున్న డీఈ అజయ్‌కుమార్ సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని రైతులతో చర్చించారు. పగలు 4 గంటలు, రాత్రి 3 గంటలు విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు. -
ఏసీబీ వలలో ఏఈ
కడప అర్బన్, న్యూస్‌లైన్ : అవినీతి శాఖ అధికారుల వలలో మరో చేప చిక్కింది. అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ రాజారావు నేతృత్వంలో రూరల్ వాటర్ సప్లయ్ స్కీమ్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న టి.విజయకుమార్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. చింతకొమ్మదిన్నె మండలం రసూల్పల్లెకు చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాసుల రెడ్డి రూరల్ వాటర్ సప్లయ్ స్కీమ్ కింద రూ. 1.20 లక్షల విలువైన పనులు చేశాడు . బిల్లు మంజూరు కోసం ఎంబుక్‌ను కూడా తయారు చేశారు. రూ. 5 వేలు ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానని ఏఈ విజయకుమార్ మెలిక పెట్టాడు. దీంతో శ్రీనివాసులురెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏఈ విజయకుమార్‌కు శ్రీనివాసులరెడ్డి సోమవారం ఉదయం 11 గంటలకు లంచం ఇస్తుండగా డీఎస్పీ రాజారావు ఆధ్వర్యంలో అవినీతి శాఖ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వివరాలను డీఎస్పీ మీడియాకు తెలియజేశారు. దాడి చేసిన వారిలో డీఎస్పీతోపాటు సీఐలు పార్థసారథిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామకిశోర్రెడ్డి ఉన్నారు. ఏఈ విజయకుమార్‌పై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నారు.