చిన అన్నలూరు (కలిగిరి) : విద్యుత్ కోతలను నిరసిస్తూ శనివారం చిన అన్నలూరు సబ్‌స్టేషన్ ఎదుట రైతు లు రాస్తారోకో చేపట్టారు. కృష్ణారెడ్డిపాలెం, తెల్లపాడు, చినఅన్నలూరు పంచాయతీల్లోని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన రైతుల నినాదాలు చేశారు. వ్యవసాయానికి కనీ సం రోజుకు మూడు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విష యం తెలుసుకున్న ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాసులరెడ్డి సబ్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎస్సై దాసరి రాజారా వు ఆదేశాలతో ఏఎస్సై రఘురామ య్య సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చారు. రైతులు పలు విద్యుత్ సమస్యలను ఏఈ దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఏఈ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
రామతీర్థం సబ్‌స్టేషన్ ముట్టడి
విడవలూరు : మండలంలోని రామతీర్థం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శనివారం వేరుశనగ రైతులు ముట్టడించారు. విద్యుత్ కోతలకు నిరసనగా రామతీర్థం, రామచంద్రాపురం, గౌరీపురం, లక్ష్మీపురం, రవీంద్రపురం తదితర గ్రామాలకు చెందిన సుమారు 100 మంది రైతులు సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని, విద్యుత్ శాఖ అధికారులు, ప్ర భుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ సబ్‌స్టేషన్ పరిధిలో సుమారు 450 ఎకరాలలో వేరుశనగ పంట సాగవుతోందన్నారు.
బిందు సేద్యం ద్వారా సాగు చేసే ఈ పంటకు విద్యుత్ తప్పనిసరని చెప్పారు. ఈ సమస్యపై మూడు రోజుల క్రితం సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టినప్పుడు అధికారులు తప్పక విద్యుత్ సరఫరా చేస్తామని మాట ఇచ్చి తప్పారని ధ్వజమెత్తారు. ఒక దశలో రైతులు విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న విడవలూరు, అల్లూరు ట్రాన్స్ కో ఏఈలు మదన్‌మోహన్, పరిశుద్ధరావు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి ఈ పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు.
రైతలు జీవితాలతో ఆటలొద్దు ..
బాలాయపల్లి: విద్యుత్ సరఫరాను అస్తవ్యస్తం చేసి తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడాపెడా విద్యుత్ కో తలకు నిరసనగా శనివారం వారు ఆందోళనకు దిగారు. బాలాయపల్లిలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌కు తాళం వేశారు. రైతులు మాట్లాడుతూ వారం నుంచి రోజుకు 2 గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ ఇస్తున్నారన్నారు. ఆ నీళ్లు కాలువలను కూడా దాటకపోవడంతో నిమ్మ, బత్తాయి, మామిడి, బొప్పాయి తోటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు సా గుచేస్తున్నామని, విద్యుత్ కోతల మూలంగా నష్టపోతున్నామన్నారు. సమాచారం అందుకున్న డీఈ అజయ్‌కుమార్ సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని రైతులతో చర్చించారు. పగలు 4 గంటలు, రాత్రి 3 గంటలు విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు.
కోతలకు నిరసనగా రాస్తారోకో
Published Sun, Jul 6 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM
Advertisement
Advertisement