హా...క్వా!
ఓ వైపు ప్రతికూల వాతావరణం, విద్యుత్ కోతలు.. మరోవైపు పెరిగిన పెట్టుబడులు,
రొయ్యల ధరల పతనంతో జిల్లాలోని ఆక్వా రంగం కుదేలైంది. ఫలితంగా రొయ్య
లను సాగు చేస్తున్న రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కష్టాల వలలో
చిక్కుకుని విల విల్లాడుతున్నారు.
పిట్టలవానిపాలెం : బాపట్ల నియోజకవర్గ పరిధిలోని సుమారు 5 వేల ఎకరాల్లో ఉన్న చెరువుల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ప్రధానంగా అల్లూరు, అలకాపురం, ఖాజీపాలెం, పోతనకట్టవారిపాలెం, పిట్టలవానిపాలెం, కర్లపాలెం, బుద్దాం, యాజలి, పెదపులుగువారిపాలెం, గణపవరం, నర్రావారిపాలెం, పేరలి, తుమ్మలపల్లి, పేరలిపాడు, పాండురంగాపురం, దేవినూతల తదితర గ్రామాలకు చెందిన రైతులు రొయ్యలను సాగు చేస్తున్నారు. ఇక్కడి రొయ్యలు పశ్చిమ గోదావరి జిల్లాలోని కైకలూరు, భీమవరం, ఏలూరు ప్రాంతాలకు.. కేరళ,తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నారుు.
పెరిగిన పెట్టుబడులతో సతమతం
రొయ్యల సాగుకు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోవటంతో రైతులు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం ఎకరం కౌలు రేటు రూ.40 వేల నుంచి 50 వేల రూపాయలకు పెరిగిపోరుుంది. ఎకరం చెరువులో ఆక్సిజన్ బ్యాలెన్స్ కోసం కనీసం రెండు ఏరియేటర్లు తిప్పాలి. గతంలో రూ.25 వేలు ఉన్న ఏరియేటర్ ధర ప్రస్తుతం రూ.45 వేలకు చేరింది. టన్ను రొయ్యల ఉత్పత్తికి టన్ను మేత అవసరం. ప్రస్తుతం టన్ను మేత ధర 75 వేల రూపాయలకు చేరింది. ఫలితంగా టన్ను రొయ్యల ఉత్పత్తికి అదనంగా 40 వేల రూపాయలు ఖర్చు చేయూల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
పడిపోరుున రొయ్యల ధరలు
ఆరుగాలం కష్టపడి పెంచుతున్న రొయ్యల ధరలు గణనీయంగా పడిపోవటంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. గతంలో రొయ్య పిల్లను 40 పైసలకు విక్రరుుంచేవారు. ప్రస్తుతం ఇది 8 పైసలకు పడిపోరుుంది. కౌంట్ ప్రకారం విక్రరుుంచే రొయ్యల ధరలు కూడా పడిపోవటం ఆందోళన కలిగిస్తోంది.
వేధిస్తున్న లూజ్ షెల్ వ్యాధి
వీటికితోడు రొయ్య పిల్లలకు లూజ్ షెల్ వ్యాధి సోకుతుండటంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పిల్లల బరువు పది గ్రాములకు చేరిన సమయంలో ఈ వ్యాధి సోకుతుంది. దీంతో పిల్లలు తెల్లగా మారి చనిపోతారుు. ప్రస్తుతం హెక్టారు చెరువులో 4 లక్షల పిల్లలను వేస్తున్నారు. సాధారణంగా ఇందులో సగం పిల్లలు సాగు సమయంలో చనిపోతారుు. లూజ్‌షెల్ వ్యాధి సోకితే నష్టం భారీగా ఉంటుందని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు నాణ్యత లేని పిల్లలను అంటగడుతుండటం వల్లే వ్యాధిబారిన పడుతున్నాయని చెబుతున్నారు.
కరెంటు కోతలతో నష్టాల వాత
ప్రస్తుతం వాతావరణంలో ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో చెరువుల్లోని రొయ్యలకు ఆక్సిజన్ సరిపోవటం లేదు. దీంతో ఊపిరి ఆడక మరణిస్తున్నారుు. చెరువులో ఆక్సిజన్‌ను బ్యాలెన్స్ చేసేందుకు ఏరియేటర్లు తిప్పుదామంటే విద్యుత్ సరఫరా సరిగా ఉండటం లేదు. ఆయిల్ ఇంజిన్లతో ఏరియేటర్లను తిప్పడం అదనపు భారంగా మారింది. ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోయే పరిస్థితి వస్తుండటంతో మధ్యలోనే వాటిని పట్టుబడి పడుతున్నారు. దీంతో సరైన ధర లభించటం లేదు. దీనికితోడు విద్యుత్ కోతల కారణంగా తగినంత ఐస్ లభించటం లేదు. దీంతో సరుకు నిల్వ చేయటం కష్టమవుతోంది. ఫలితంగా దళారీలు చెప్పిన ధరలకే రొయ్యలను విక్రరుుంచి రైతులు నష్టపోతున్నారు.