rajashaker reddy
-
వైఎస్ పథకాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం
తొర్రూరు టౌన్, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణాంతరం ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామ శివారు మంగ్యా, కేష్య తండా వాసులు శనివారం ఆయన సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్ ఆశయసాధన వైఎస్సార్ సీపీతోనే సాధ్యమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ పథకంలో తొలగించిన 133 వ్యాధులను తిరిగి జాబితాలో చేరుస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడంతోపాటు రైతుల అభ్యున్నతికి రూ.మూడు వేల కోట్లు కేటారుుస్తామన్నారు. వైఎస్సార్ సీపీలో చేరిన వారిలో జాటోతు ధర్మానాయక్, జాటోతు భద్రునాయక్, లింగ్యానాయక్, వాల్యనాయక్, యాకుబ్‌నాయక్, రాందాస్, టకూర్నాయక్, దౌడానాయక్, బుండానాయక్, దేవానాయక్, సోమ్లానాయక్ ఉన్నారు. స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కందాడి అచ్చిరెడ్డి, ల్యాండ్ అసైన్మెంట్ సభ్యులు కొటగిరి సదర్శన్గౌడ్, యూత్ మండల అధ్యక్షుడు దికొండ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు జూకంటి వెంకన్న, మధూసూదన్‌రెడ్డి, రాంచంద్రయ్య పాల్గొన్నారు. -
ప్రియుడే ప్రాణం తీశాడు !
మహిళ హత్య కేసులో నిందితుడు పోస్టుమాస్టర్ ? ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం మరొకరితో చనువుగా ఉండటంతో అఘాయిత్యం పోలీసుల అదుపులో నిందితుడు వత్సవాయి, న్యూస్‌లైన్ :వివాహిత దారుణహత్య కేసులో నింది తుడు ఆమె ప్రియుడేనని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. పోస్టుమాస్టర్ అయిన అతడిని ఘటన జరిగిన రోజు అర్ధరాత్రే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతమైన వత్సవాయి శివారులో గుర్తుతెలియని మహిళ దారుణహత్యకు గురైన ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సేకరించిన సమాచారం ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడు గ్రామానికి చెందిన యరమల రాజశేఖరరెడ్డి అదే జిల్లా బోనకల్లు మండలం చిరునోములలో పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. మధిర మండలం మడుపల్లి గ్రామానికి చెందిన వివాహిత యరమల వెంకట్రావమ్మతో అతడికి వివాహేతర సంబంధం ఉం ది. ఆమె ఇటీవల మరొకరితో కూడా చను వు గా ఉండటాన్ని గమనించి ప్రవర్తన మార్చుకోవాలని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదా లు నెలకొన్నాయి. రాజశేఖరరెడ్డి ఇటీవల తీర్థయాత్రకు వెళ్లివచ్చాడు. వెంకట్రావమ్మ ప్రవర్తనలో మార్పు రాకపోవడం, తనను పట్టించుకోకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యం లో మరలా ఆమెకు నమ్మకంగా దగ్గరయ్యాడు. సోమవారం సాయంత్రం తన ద్విచక్రవాహనంపై వత్స వాయి-బోనకల్లు మధ్య డొంకరోడ్డులోకి తీసుకెళ్లాడు. అక్కడ అతిగా మద్యం తాగి లైంగికదాడి చేశాడు. అనంతరం బండరాయి తో ఆమె తలపై బలంగా మోదాడు. చనిపోయిందని నిర్ధారించుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. మంగళవారం ఈ ఘటన వెలుగులోకి రాగా, వత్సవాయి పోలీసులు విచారణ చేపట్టారు. వంగవీడు గ్రామానికి వెళ్లి రాజశేఖరరెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యా ప్తు జరుగుతోంది. వెంకట్రావమ్మను ప్రియు డు ఒక్కడే చంపాడా? లేక ఎవరైనా సహకరించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న ట్లు జగ్గయ్యపేట ఇన్చార్జి సీఐ భాస్కరరావు తెలిపారు. -
జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతర పోరాటం
తిరుపతి, న్యూస్‌లైన్: జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీయూడబ్ల్యూజే రాజీలేని పోరాటాలు సాగిస్తుందని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డీ.సోమసుందర్ అన్నారు. ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా శాఖ ముద్రించిన 2014-క్యాలెండర్‌ను ఆదివారం సాయంత్రం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన సోమసుందర్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మంది సభ్యులను కలిగి గుర్తింపు పొందిన యూనియన్‌గా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల సంక్షేమానికి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. విశ్వసనీయత, ఉన్నత ప్రమాణాలను విస్మరించకుండా జర్నలిజాన్ని పరిరక్షించుకుంటూ తమ యూనియన్ ప్రణాలికబద్ధంగా ముందుకు వెళ్తోందన్నారు. ప్రజలను చైతన్య పరిచే వార్తాకథనాలు రాసి జర్నలిజంపై విశ్వసనీయతను మరింతగా పెంచాలని డీసీసీబీ అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డి సూచించారు. జర్నలిస్టులు వారి హ క్కులకోసం జరిపే పోరాటాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. దేశ రక్షణకు సైనికులు ఎంత అవసరమో సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి జర్నలిస్టులు అంతే అవసరమని ప్రముఖ కంటి వైద ్య నిఫుణురాలు డాక్టర్ ఆర్.సుధారాణి అన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డీ.శ్రీహరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహయాదవ్, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖరనాయుడు, జనార్ధన్, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, దినేష్‌కుమార్ పాల్గొన్నారు.