తిరుపతి, న్యూస్‌లైన్: జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీయూడబ్ల్యూజే రాజీలేని పోరాటాలు సాగిస్తుందని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డీ.సోమసుందర్ అన్నారు. ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా శాఖ ముద్రించిన 2014-క్యాలెండర్‌ను ఆదివారం సాయంత్రం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన సోమసుందర్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మంది సభ్యులను కలిగి గుర్తింపు పొందిన యూనియన్‌గా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల సంక్షేమానికి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
విశ్వసనీయత, ఉన్నత ప్రమాణాలను విస్మరించకుండా జర్నలిజాన్ని పరిరక్షించుకుంటూ తమ యూనియన్ ప్రణాలికబద్ధంగా ముందుకు వెళ్తోందన్నారు. ప్రజలను చైతన్య పరిచే వార్తాకథనాలు రాసి జర్నలిజంపై విశ్వసనీయతను మరింతగా పెంచాలని డీసీసీబీ అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డి సూచించారు. జర్నలిస్టులు వారి హ క్కులకోసం జరిపే పోరాటాలకు తమ మద్దతు ఉంటుందన్నారు.
దేశ రక్షణకు సైనికులు ఎంత అవసరమో సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి జర్నలిస్టులు అంతే అవసరమని ప్రముఖ కంటి వైద ్య నిఫుణురాలు డాక్టర్ ఆర్.సుధారాణి అన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డీ.శ్రీహరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహయాదవ్, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖరనాయుడు, జనార్ధన్, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, దినేష్‌కుమార్ పాల్గొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతర పోరాటం
Published Mon, Jan 13 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement