- మహిళ హత్య కేసులో నిందితుడు పోస్టుమాస్టర్ ?
- ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం
- మరొకరితో చనువుగా ఉండటంతో అఘాయిత్యం
- పోలీసుల అదుపులో నిందితుడు
వత్సవాయి, న్యూస్‌లైన్ :వివాహిత దారుణహత్య కేసులో నింది తుడు ఆమె ప్రియుడేనని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. పోస్టుమాస్టర్ అయిన అతడిని ఘటన జరిగిన రోజు అర్ధరాత్రే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతమైన వత్సవాయి శివారులో గుర్తుతెలియని మహిళ దారుణహత్యకు గురైన ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సేకరించిన సమాచారం ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడు గ్రామానికి చెందిన యరమల రాజశేఖరరెడ్డి అదే జిల్లా బోనకల్లు మండలం చిరునోములలో పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నాడు.
మధిర మండలం మడుపల్లి గ్రామానికి చెందిన వివాహిత యరమల వెంకట్రావమ్మతో అతడికి వివాహేతర సంబంధం ఉం ది. ఆమె ఇటీవల మరొకరితో కూడా చను వు గా ఉండటాన్ని గమనించి ప్రవర్తన మార్చుకోవాలని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదా లు నెలకొన్నాయి. రాజశేఖరరెడ్డి ఇటీవల తీర్థయాత్రకు వెళ్లివచ్చాడు. వెంకట్రావమ్మ ప్రవర్తనలో మార్పు రాకపోవడం, తనను పట్టించుకోకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నేపథ్యం లో మరలా ఆమెకు నమ్మకంగా దగ్గరయ్యాడు. సోమవారం సాయంత్రం తన ద్విచక్రవాహనంపై వత్స వాయి-బోనకల్లు మధ్య డొంకరోడ్డులోకి తీసుకెళ్లాడు. అక్కడ అతిగా మద్యం తాగి లైంగికదాడి చేశాడు. అనంతరం బండరాయి తో ఆమె తలపై బలంగా మోదాడు. చనిపోయిందని నిర్ధారించుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. మంగళవారం ఈ ఘటన వెలుగులోకి రాగా, వత్సవాయి పోలీసులు విచారణ చేపట్టారు.
వంగవీడు గ్రామానికి వెళ్లి రాజశేఖరరెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యా ప్తు జరుగుతోంది. వెంకట్రావమ్మను ప్రియు డు ఒక్కడే చంపాడా? లేక ఎవరైనా సహకరించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న ట్లు జగ్గయ్యపేట ఇన్చార్జి సీఐ భాస్కరరావు తెలిపారు.