mahila murder
-
కాపలాదారే హంతకుడు
నగల కోసమే దారుణం మహిళ హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు మెహిదీపట్నం, న్యూస్‌లైన్: మహిళ అదృశ్యం...హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. అపార్ట్మెంటు వాచ్‌మన్‌ను హంతకుడిగా తేల్చారు. బుధవారం వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని రోలుగుంటకు చెందిన దుర్గాలమ్మ(58) మధురానగర్ ఎఫ్-బ్లాక్‌లోని సమ్రీనాహైస్ అపార్ట్మెంట్ ఉంటూ.. జీటీఎస్ కాలనీలోని ఏపీసీపీడీసీఎల్ ట్రైనింగ్ సెంటర్లో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఆమె రోజూ మెడలో నగలు ధరించి విధులకు వెళ్తుంటుంది. దుర్గాలమ్మ నివాసముండే అపార్ట్మెంటు వద్ద విశాఖ జిల్లాకు చెందిన పి.సన్యాసిరావు(32) వాచ్‌మన్‌గా పని చేస్తున్నారు. ఇతనికి ఇటీవల సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన వచ్చింది. ఈనెల 6న ఉదయం 11 గంటలకు దుర్గాలమ్మ విధులు ముగించుకొని తానుండే అపార్ట్మెంటు వద్దకు వచ్చింది. మొదటి అంతస్తుకు వెళ్లేందుకు ఆమె లిఫ్ట్‌లోకి వెళ్లగా.. సన్యాసిరావు కూడా వెళ్లాడు. ఆమెను మాటల్లో పెట్టి లిఫ్ట్ 3వ అంతస్తు బటన్ నొక్కాడు. 3వ అంతస్తుకు వెళ్లగానే ఆమె చీరతోనే నొరు నొక్కి.. అదే అంతస్తులో ఖాళీ ఉన్న 301 ఫ్లాట్‌లోకి తీసుకెళ్లాడు. ఒంటిపై ఉన్న 12 తులాల బంగారు నగలు లాక్కొని.. ఆ తర్వాత చీరతో గొంతు బిగించి చంపేశాడు. మృతదేహాన్ని అదే ఫ్లాట్‌లోని బాత్రూంలో దాచాడు. తర్వాత కిందకు వెళ్లి వాచ్‌మన్ విధులు నిర్వహించాడు. విధులకు వెళ్లిన దుర్గాలమ్మ రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుమారు నూకరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది గమనించిన నిందితుడు సన్యాసిరావు అర్ధరాత్రి 1 గంటకు దుర్గాలమ్మ మృతదేహాన్ని లిఫ్ట్‌లో 3వ అంతస్తు నుంచి తీసుకెళ్లి అపార్ట్మెంటు వెనుక గేటు వద్ద వేశారు. బుధవారం ఉదయం 5.30కి దుర్గాలమ్మ మృతదేహం వెనుక గేటు వద్ద ఉందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాచ్‌మన్ సన్యాసిరావుపై అనుమానం వచ్చి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నగలను స్వాధీనం చేసుకొని, అతడిని రిమాండ్‌కు తరలించామన్నారు. -
ఉన్మాది చేతిలో మహిళ దారుణ హత్య
మూడేళ్ల క్రితం కన్నకూతురిని చంపిన సైకో సదానందం అప్పట్లో పోలీసులకు సాక్ష్యం చెప్పారని.. దారుణం వెంకటాపురం, న్యూస్‌లైన్ : మూడేళ్ల క్రితం కన్నకూతురిని దారుణంగా హత్య చేసిన ఓ ఉన్మాది.. అందుకు సాక్షిగా నిలిచిన మరో మహిళను బలిగొన్నాడు. పోలీసులకు తన గురించి సమాచారం ఇచ్చారనే నెపంతో దారుణాని కి ఒడిగట్టాడు. ఈ ఘటన మండలంలోని బూర్గుపేటలో శనివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జగ్గు సదానందం, అరుణ దంపతులకు మూడేళ్ల క్రితం కూతురు జన్మించింది. ఆ పాప తనకు పుట్టలేదంటూ ఉన్మాదిగా ప్రవర్తించిన సదానందం అప్పట్లోనే ఆ పాపను గడ్డపారతో పొడిచి చంపేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన శ్యామల జయపాల్‌రెడ్డి సాక్షిగా ఉన్నాడు. కాగా మూడేళ్లుగా సదానందం భార్య అరుణ నల్లబెల్లి మండలం రామతీర్థం గ్రామంలోని తన పుట్టింట్లో ఉంటోంది. ఇటీవల జైలు నుంచి విడుదలైన అతడు గ్రామంలో రెండు రోజులుగా కత్తి పట్టుకుని తిరుగుతూ తన భార్యను బూర్గుపేటకు తీసుకురావాలని అరుస్తూ హంగామా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు సైకోగా ప్రవర్తిస్తూ పాప హత్య కేసులో సాక్షిగా ఉన్న శ్యామల జయపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లాడు. ఇంటి ఎదుట నిల్చు న్న జయపాల్‌రెడ్డి భార్య స్వరూప(32)ను కత్తితో కడుపులో రెండుసార్లు పొడిచాడు. ఆమె కేకలు వేయగానే పారిపోయాడు. గమనించిన స్థానికులు లక్ష్మిదేవిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎస్సై యాసీన్ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడే ప్రాణం తీశాడు !
మహిళ హత్య కేసులో నిందితుడు పోస్టుమాస్టర్ ? ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం మరొకరితో చనువుగా ఉండటంతో అఘాయిత్యం పోలీసుల అదుపులో నిందితుడు వత్సవాయి, న్యూస్‌లైన్ :వివాహిత దారుణహత్య కేసులో నింది తుడు ఆమె ప్రియుడేనని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. పోస్టుమాస్టర్ అయిన అతడిని ఘటన జరిగిన రోజు అర్ధరాత్రే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతమైన వత్సవాయి శివారులో గుర్తుతెలియని మహిళ దారుణహత్యకు గురైన ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సేకరించిన సమాచారం ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడు గ్రామానికి చెందిన యరమల రాజశేఖరరెడ్డి అదే జిల్లా బోనకల్లు మండలం చిరునోములలో పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. మధిర మండలం మడుపల్లి గ్రామానికి చెందిన వివాహిత యరమల వెంకట్రావమ్మతో అతడికి వివాహేతర సంబంధం ఉం ది. ఆమె ఇటీవల మరొకరితో కూడా చను వు గా ఉండటాన్ని గమనించి ప్రవర్తన మార్చుకోవాలని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదా లు నెలకొన్నాయి. రాజశేఖరరెడ్డి ఇటీవల తీర్థయాత్రకు వెళ్లివచ్చాడు. వెంకట్రావమ్మ ప్రవర్తనలో మార్పు రాకపోవడం, తనను పట్టించుకోకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యం లో మరలా ఆమెకు నమ్మకంగా దగ్గరయ్యాడు. సోమవారం సాయంత్రం తన ద్విచక్రవాహనంపై వత్స వాయి-బోనకల్లు మధ్య డొంకరోడ్డులోకి తీసుకెళ్లాడు. అక్కడ అతిగా మద్యం తాగి లైంగికదాడి చేశాడు. అనంతరం బండరాయి తో ఆమె తలపై బలంగా మోదాడు. చనిపోయిందని నిర్ధారించుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. మంగళవారం ఈ ఘటన వెలుగులోకి రాగా, వత్సవాయి పోలీసులు విచారణ చేపట్టారు. వంగవీడు గ్రామానికి వెళ్లి రాజశేఖరరెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యా ప్తు జరుగుతోంది. వెంకట్రావమ్మను ప్రియు డు ఒక్కడే చంపాడా? లేక ఎవరైనా సహకరించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న ట్లు జగ్గయ్యపేట ఇన్చార్జి సీఐ భాస్కరరావు తెలిపారు.