Rajasthan polls
-
‘అది 440 వోల్ట్ల కరెంట్.. కాంగ్రెస్‌కే షాకిస్తుంది’
జైపూర్: రాజస్థాన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 135 సీట్లు గెలుచుకుంటుందని, రాష్ట్రంలో ఇది అతిపెద్ద విజయాలలో ఒకటిగా ఉంటుందని బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర సింగ్ రాథోడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా "అండర్ కరెంట్" (లోలోపల అనుకూలత) ఉందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై రాజేంద్ర సింగ్ రాథోడ్ వ్యంగ్యంగా స్పందించారు. "అండర్ కరెంట్ ఉందని గెహ్లాట్ సాబ్ చెప్పింది నిజమే. అది 440 వోల్ట్లు. ఆయన చెబుతున్న అండర్ కరెంట్ కాంగ్రెస్‌కే షాక్ ఇస్తుంది" అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలను ఆకట్టుకోలేదని, రాష్ట్రంలో ఆ పార్టీని గద్దె దించేందుకే ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ‘కాంగ్రెస్ అవమానకరమైన పరాజయం దిశగా అడుగులు వేస్తోంది. గ్రౌండ్ రిపోర్ట్‌ల ప్రకారం.. ఈ ఎన్నికల్లో బీజేపీ 135 సీట్లకు పైగా సాధిస్తుంది. ఇది అతిపెద్ద ఎన్నికల విజయాలలో ఒకటి’ అని రాథోడ్ పేర్కొన్నారు. నవంబర్ 25న రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 200 స్థానాలకు గాను 199 స్థానాల్లో పోలింగ్ జరిగింది. మరో నాలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. -
ఆ ఆరు జిల్లాల్లో అధిక ఓటింగ్.. పార్టీల్లో దడ!
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ముగిశాయి. మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 74.96 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇది గత 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే 1 శాతం ఎక్కువ. ఇక రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. దీంతో ప్రధాన పార్టీల్లో దడ మొదలైంది. కౌంటింగ్ రోజున ఫలితం గురించి భయం నెలకొంది. 80 శాతానికి పైగా ఓటింగ్ రాజస్థాన్‌లోని ఆరు జిల్లాల్లో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని బన్స్వారా, జైసల్మేర్, చిత్తోర్‌గఢ్, హనుమాన్‌గఢ్, ఝలావర్, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా 83 శాతం ఓటింగ్‌తో బన్స్వారా జిల్లా టాప్‌లో ఉండగా 80.41 శాతంతో చిత్తోర్‌గఢ్, 82.52 శాతంతో హనుమాన్‌గఢ్, 82.32 శాతంతో జైసల్మేర్ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలవారీగా.. రాష్ట్రంలోనే అత్యధికంగా 88.13 శాతం ఓటింగ్‌తో కుషాల్‌ఘర్ అసెంబ్లీ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉంది. 87.79 శాతంతో పోఖ్రాన్ అసెంబ్లీ సెగ్మెంట్ రెండో స్థానంలో ఉండగా, 86.11 శాతంతో తిజారా, 85.58 శాతంతో నింబహెరా, 85.35 శాతంతో ఘటోల్, 84.22 శాతంతో బారీ, 84.12 శాతంతో మనోహర్తన నియోజకవర్గాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
అభ్యర్థుల ఖరారుపై చర్చ.. సచిన్ పైలెట్‌కు అందని ఆహ్వానం
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుంటున్నట్లు కనిపిస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్‌ను ఆహ్వానించలేదు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ రాంధావా, రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గోవింద్ దోతస్రా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాజస్థాన్ స్క్రీనింగ్ కమిటీ చీఫ్ గౌరవ్ గొగోయ్ తదితరులను ఆహ్వానించారు. సచిన్ పైలెట్, రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషిల పేర్లు ఇందులో లేవు. बचत, राहत, बढ़त, हिफ़ाज़त और उत्थान, कांग्रेस के सुशासन से ऐसे बदला राजस्थान ! भरोसा है हमें कि जनता फ़िर से देगी आशीर्वाद। आज राजस्थान के परिप्रेक्ष्य में केंद्रीय चुनाव समिति की महत्वपूर्ण बैठक हुई। pic.twitter.com/ygR5auUdUf — Mallikarjun Kharge (@kharge) October 18, 2023 రాజస్థాన్‌లో మరోసారి అధికారంలోకి వస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. పొదుపు, ఉపషమణం, వృద్ధి, రక్షణలతో కాంగ్రెస్ గుడ్ గవర్నెన్స్ రాజస్థాన్‌లో సమూల మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. ప్రజలు మరోసారి దీవిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ముఖ్యమైన సమావేశం ఉందని ట్విట్టర్(ఎక్స్) వేదికగా ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) అక్టోబర్ 13 ఢిల్లీలో ఇప్పటికే సమావేశమైన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: నోరు నొక్కేందుకే ఈ కుట్ర: భయపడుతూ కూచుంటే ఎలా? -
వసుంధర రాజేకు షాకిచ్చిన బీజేపీ
జైపూర్: త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ రాజస్థాన్‌లో వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. ఎన్నికలకు సన్నాహకంగా ఏర్పాటు చేయనున్న రెండు కమిటీ సభ్యులను ప్రకటించింది. కానీ ఈ కమిటీల్లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే పేరు లేకపోవడం విశేషం. రాజస్థాన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ ఆ రాష్ట్రంలో సంకల్ప్ మ్యానిఫెస్టో కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ పేరిట రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. 21 మంది సభ్యుల ఎన్నికల నిర్వహణ కమిటీకి మాజీ ఎంపీ నారాయణ్ లాల్ పంచారియా నేతృత్వం వహిస్తుండగా 25 మంది సభ్యుల సంకల్ప్ కమిటీకి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నాయకత్వం వహించనున్నారు. ఈ కమిటీల్లో ఎంపీ కిరోడీ లాల్ మీనా, మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లకు చోటు లభించగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తోపాటు రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్ ల పేర్లను ఈ కమిటీ జాబితాల్లో చేర్చకపోవడం చర్చనీయాంశమంది. గత కొన్నాళ్లుగా వీరంతా రాష్ట్రంలో బీజేపీ ప్రచార బాధ్యతలను భుజాన మోస్తున్నారు. మాజీ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాజీ రాష్ర అధ్యక్షుడు సతీష్ పూనియాలకి కూడా ఈ కమిటీల్లో చోటు దక్కలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి తోపాటు మహిళలపై జరుగుతున్న అరాచకాలనే ప్రధానాస్త్రాలుగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మహిళా మోర్చా అయితే మరో అడుగు ముందుకేసి 'నహీ సహేగా రాజస్థాన్' పేరిట పేపర్ లీకేజీ, రైతు సమస్యలపై నిరసన తెలుపుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎలా చూసినా గెహ్లాట్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలను తిప్పికొట్టడమే బీజేపీకి పెను సవాలుగా మారింది. కాంట్రాక్టు ఉద్యోగుల బిల్లు, ఆరోగ్య హక్కు బిల్లు వంటి ప్రజాహితమైన పథకాలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊతంగా నిలవనున్నాయి. కర్ణాటకలో కూడా ఇదే విధంగా ఐదు గ్యారెంటీలతో రూపందించిన పథకాలు అక్కడ ఆ పార్టీ అధికారంలో రావడానికి దోహద పడ్డాయి. రాజస్థాన్‌లో కూడా అదే పాచిక పారుతుందని కాంగ్రెస్ గట్టి నమ్మకంతో ఉండగా బీజేపీ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది. అందుకోసమే కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది కూడా చదవండి: కొడుకు చేసిన పనికి తండ్రికి శిక్ష.. పార్టీ సభ్యత్వం రద్దు.. -
గెహ్లాట్, పైలట్ మధ్య రాజీ కుదిరినట్టేనా..!
-
రాజస్థాన్‌లోనూ రికార్డే
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం ఆదివారంతో ముగిసింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, బీజేపీ నేత వసుంధర రాజె సహా 2087 మంది అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. చత్తీస్‌గఢ్ మాదిరిగానే ఇక్కడా రికార్డ్ స్థాయి పోలింగ్ జరగడం విశేషం. 199 స్థానాలకు జరిగినఎన్నికల్లో 74.38 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2003, 2008 ఎన్నికల్లో వరుసగా 68.18 శాతం, 66.49 శాతం ఓటింగ్ మాత్రమే జరిగింది. బీఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో చురు స్థానంలో ఓటింగ్‌ను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు. చెదురుముదురు హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఈసీ తెలిపింది. దౌసా జిల్లాలోని సలీంపూర్‌లో పోలింగ్‌ను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. సికర్ జిల్లాలోని ఫతేపూర్‌లో సిబ్బందికోసం వినియోగించిన ఒక వ్యాన్‌ను దుండగులు తగలబెట్టారు. భరత్పూర్ జిల్లాలోని రూప్వాస్ ప్రాంతంలో పోలింగ్‌బూత్‌ను ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నించడంతో పోలింగ్‌ను కాసేపు నిలిపేశారు. ప్రజలు ఎన్నికలను బహిష్కరించడంతో దుగ్ నియోజకవర్గం పరిధిలోని ఒక బూత్‌లో ఒక్క ఓటు కూడా పడకపోవడం విశేషం. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో రూ. 12.89 కోట్ల నగదును, రూ. 29.1 కోట్ల విలువైన మద్యాన్ని, రూ. 5.49 కోట్ల విలువైన నార్కొటిక్ డ్రగ్స్‌ను, రూ. 5.68 కోట్ల విలువైన చీరలు తదితర బహుమతులను స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. 31 పెయిడ్ న్యూస్ కేసులను నమోదు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది.