జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ముగిశాయి. మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 74.96 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇది గత 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే 1 శాతం ఎక్కువ. ఇక రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. దీంతో ప్రధాన పార్టీల్లో దడ మొదలైంది. కౌంటింగ్ రోజున ఫలితం గురించి భయం నెలకొంది.
80 శాతానికి పైగా ఓటింగ్
రాజస్థాన్‌లోని ఆరు జిల్లాల్లో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని బన్స్వారా, జైసల్మేర్, చిత్తోర్‌గఢ్, హనుమాన్‌గఢ్, ఝలావర్, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా 83 శాతం ఓటింగ్‌తో బన్స్వారా జిల్లా టాప్‌లో ఉండగా 80.41 శాతంతో చిత్తోర్‌గఢ్, 82.52 శాతంతో హనుమాన్‌గఢ్, 82.32 శాతంతో జైసల్మేర్ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అసెంబ్లీ స్థానాలవారీగా..
రాష్ట్రంలోనే అత్యధికంగా 88.13 శాతం ఓటింగ్‌తో కుషాల్‌ఘర్ అసెంబ్లీ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉంది. 87.79 శాతంతో పోఖ్రాన్ అసెంబ్లీ సెగ్మెంట్ రెండో స్థానంలో ఉండగా, 86.11 శాతంతో తిజారా, 85.58 శాతంతో నింబహెరా, 85.35 శాతంతో ఘటోల్, 84.22 శాతంతో బారీ, 84.12 శాతంతో మనోహర్తన నియోజకవర్గాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment