rajaya sabha
-
బీపీసీఎల్ 'ఫర్ సేల్' ..కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!
నిర్ణీత సమయంలో పరిస్థితిని సమీక్షించిన తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) వాటా విక్రయ ప్రక్రియను తిరిగి ప్రారంభించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కిషన్రావ్ కరాద్ లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి, ఇంధన ధరల అనిశ్చితి, భౌగోళిక–రాజకీయ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలను ప్రభావితం చేశాయని మంత్రి పేర్కొంటూ, ఇందులో చమురు, గ్యాస్ పరిశ్రమ ప్రధానమైనదని తెలిపారు. ఆ పరిస్థితుల ప్రభావంతోనే బీపీసీఎల్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ (మెజారిటీ వాటా) కోసం ప్రస్తుత ఈఓఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) ప్రక్రియను నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బీపీసీఎల్‌లో 52.98 శాతం వాటాలను విక్రయించడానికి సంబంధించిన ఆఫర్‌ను ప్రభుత్వం మేలో ఉపసంహరించింది. బీపీసీఎల్ వ్యూహాత్మక వాటా విక్రయానికి 2020లో బిడ్డర్ల నుంచి ఈఓఐలను ఆహ్వానించడం జరిగింది. 2020 నవంబర్ నాటికి మూడు బిడ్స్ దాఖలయ్యాయి. ఇంధన ధరలపై అస్పష్టత తత్సంబంధ అంశాల నేపథ్యంలో తదనంతరం ఇరువురు బిడ్స్ ఉపసంహరించుకున్నారు. దీనితో మొత్తం బిడ్డింగ్ పక్రియను కేంద్రం వెనక్కు తీసుకుంది. అప్పట్లో బిడ్స్ వేసిన సంస్థల్లో మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్, యుఎస్ వెంచర్ ఫండ్స్ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఇంక్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఉన్నాయి. -
ప్రభుత్వ సంస్థ అమ్మకంపై కేంద్రం యూటర్న్, ఆర్థికశాఖ సహాయ మంత్రి కీలక ప్రకటన!
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ)ని ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కే కరాద్ రాజ్యసభలో తెలిపారు. 2021 మార్చి 31వ తేదీ నాటికి ఎల్ఐసీ, జీఐసీ మొత్తం ఆస్తుల విలువ వరుసగా రూ. 38.04 లక్షల కోట్లు, రూ. 1.35 లక్షల కోట్లుగా ఉన్నాయని కరాద్ స్పష్టం చేశారు. బ్యాంకుల్లో డిపాజిటర్లకు ఎక్కువ రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో డీఐసీజీసీ కింద బ్యాంకులలో డిపాజిటర్లకు బీమా కవర్ పరిమితిని ఒక్కో డిపాజిటర్‌కు రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచడం జరిగిందని మంత్రి వివరించారు. 2020 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ అన్ని ‘బీమా చేయబడిన’ బ్యాంకులు, వాటి డిపాజిటర్లకు ఒకే విధంగా వర్తిస్తుందని ఆయన చెప్పారు. ‘‘దీనితోపాటు డిపాజిట్ ఇన్సూరెన్స్– క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (సవరణ) చట్టం, 2021 గత ఏడాది ఆగస్టు 13వ తేదీన రాష్ట్రపతి ఆమోదాన్ని పొందింది. అదే ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ప్రకారం బ్యాంకులపై ఆంక్షలు విధించిన సందర్భాల్లో డీఐసీజీసీ మధ్యంతర చెల్లింపుల ద్వారా డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ మేరకు డిపాజిటర్లు తమ డిపాజిట్లను సులభంగా, తగిన కాలపరిమితితో పొందేందుకు ఈ సవరణలు వీలు కల్పిస్తున్నాయి’’ అని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. -
ఆంధ్రప్రదేశ్ కోణంలో ఇది చెత్త బడ్జెట్: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కోణంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. చెత్త బడ్జెట్ అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో బుధవారం కేంద్ర బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. చర్చలో పాల్గొన్న ఎంపీ వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశ పరిచిందని అన్నారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకూ అవసరమేనని తెలిపారు. సెస్‌లు, సర్ఛార్జ్ల పేరుతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గించారని తెలిపారు. పెట్రోల్ విషయంలో ట్యాక్స్ వాటా 40 శాతం తగ్గిందని చెప్పారు. 2010-2015 మధ్య ఏపీ షేర్ 6.9 శాతం కాగా, 2015-2020 నాటికి ఏపీ పన్నుల వాటా 4.3 శాతానికి పడిపోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వ్యవసాయంపై ఏపీ ప్రభుత్వం 5.9 శాతం నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. కానీ, కేంద్రం వెచ్చిస్తోంది 3.9 శాతం మాత్రమేనని చెప్పారు. విద్య కోసం ఏపీ 11.8 శాతం ఖర్చుచేస్తుంటే కేంద్రం 2.6 శాతం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ కేంద్రం కంటే రాష్ట్రామే ఎక్కువ ఖర్చు చేస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. -
రాజ్యసభ సాక్షిగా బయటపడిన చంద్రబాబు హోదా డ్రామ
-
మధ్యప్రదేశ్ నుంచి పెద్దల సభకు జవదేకర్
బాబు ప్రమాణ స్వీకారం తర్వాత నిర్మలా సీతారామన్ పేరు ప్రకటన న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ, సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు రాజ్యసభకు పంపనున్న ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం ప్రకటించింది. మధ్యప్రదేశ్ నుంచి జవదేకర్, కర్ణాటక నుంచి ప్రభాకర్ కోరేలను పెద్దల సభకు పంపనుంది. కేంద్ర మంత్రి జవదేకర్ ప్రస్తుతానికి ఉభయసభల్లో దేనిలోనూ సభ్యుడిగా లేరు. మహారాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన జవదేకర్ పదవీ కాలపరిమితి ఏప్రిల్ 2తో ముగిసింది. అప్పటి నుంచి లోక్‌సభ, రాజ్యసభలో సభ్యత్వంలేని జవదేకర్‌కు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో స్థానం దక్కిన విషయం విదితమే. దీంతో ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి ఆరు నెలల్లోపు ఆయన ఉభయ సభల్లో ఏదో ఒకదానిలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఈ నెల 19న జరగనుంది. కాగా లోక్‌సభ, రాజ్యసభలో సభ్యత్వంలేని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలనే ప్రతిపాదన ఉంది. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక సీతారామన్ పేరును నామినేట్ చేయాలని బీజేపీ యోచిస్తోంది.