Rajdev Ranjan murder case
-
ఆ జర్నలిస్టు హత్యకేసును త్వరగా విచారించండి!
బిహార్ : జర్నలిస్టు రాజ్దేవ్ రంజన్ హత్యకేసులో దర్యాప్తును మూడు నెలలో పూర్తిచేయాలని సీబీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మర్డరు కేసులో చార్జ్‌షీటు దాఖలు చేయనంత వరకు నిందితులు బెయిల్ కోరే అవకాశముండదని కోర్టు తేల్చిచెప్పింది. హిందీ దినపత్రిక హిందూస్తాన్లో పనిచేసే రాజ్దేవ్ రంజన్‌ను ఈ ఏడాది మే13న గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు.కాగ శివాన్ చిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న శక్తులపై రాజ్దేవ్ రంజన్ వరుస కథనాలు రాశారు. ఆ నేపథ్యంలోనే ఆయన హత్య జరిగింది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన షార్ప్ షూటర్ మహ్మద్ కైఫ్ గత నెల 21న శివాన్ కోర్టులో లొంగిపోయాడు.అనంతరం ఇతన్ని జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. మరో నిందితుడు మహ్మద్ జావేద్ కోసం పోలీసులు ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. ఈ కేసు విచారణపై సీఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ నిపుణుల టీమ్ త్వరలోనే శివాన్ వచ్చి దీనిపై విచారణ కొనసాగించనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గుర్తుతెలియని దుండగులు రాజ్దేవ్ రంజన్‌ను హత్య చేశారని సెప్టెంబర్ 15న సీబీఐ ఈ కేసును నమోదుచేసింది. -
లాలూ కుమారుడికి కోర్టు ఝలక్
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కోర్టు షాక్ ఇచ్చింది. శివాన్ జర్నలిస్ట్ రాజదేవ్ రంజన్ హత్య కేసులో లాలూ కుమారుడు, బిహార్ ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఆయనతో పాటు ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహబుద్దీన్ కు కూడా నోటీసు ఇచ్చింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఇరువురిని ఆదేశించింది. ఇదే కేసులో షహబుద్దీన్ అనుచరుడు షార్ప్ షూటర్ మహ్మద్ కైఫ్ బుధవారం శివాన్ కోర్టులో లొంగిపోయాడు. అతడికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. జంట హత్యల కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న షహబుద్దీన్ ఇటీవల బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యారు. షహబుద్దీన్ విడుదల బిహార్ లో రాజకీయంగా దుమారం రేగింది. ఆయన బయటకు రావడంపై బాధితులు ఆందోళన చెందుతున్నారు.