ఆ జర్నలిస్టు హత్యకేసును త్వరగా విచారించండి! | Bihar: SC asks CBI to conclude probe into journalist Rajdev Ranjan murder case | Sakshi
Sakshi News home page

ఆ జర్నలిస్టు హత్యకేసును త్వరగా విచారించండి!

Published Mon, Oct 17 2016 2:21 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

Bihar: SC asks CBI to conclude probe into journalist Rajdev Ranjan murder case

బిహార్ : జర్నలిస్టు రాజ్దేవ్ రంజన్ హత్యకేసులో దర్యాప్తును మూడు నెలలో పూర్తిచేయాలని సీబీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మర్డరు కేసులో చార్జ్షీటు దాఖలు చేయనంత వరకు నిందితులు బెయిల్ కోరే అవకాశముండదని కోర్టు తేల్చిచెప్పింది. హిందీ దినపత్రిక హిందూస్తాన్లో పనిచేసే రాజ్దేవ్ రంజన్ను ఈ ఏడాది మే13న గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు.కాగ శివాన్ చిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న శక్తులపై రాజ్దేవ్ రంజన్ వరుస కథనాలు రాశారు. ఆ  నేపథ్యంలోనే ఆయన హత్య జరిగింది.
 
ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన షార్ప్ షూటర్ మహ్మద్ కైఫ్ గత నెల 21న శివాన్ కోర్టులో లొంగిపోయాడు.అనంతరం ఇతన్ని జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. మరో నిందితుడు మహ్మద్ జావేద్ కోసం పోలీసులు ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. ఈ కేసు విచారణపై సీఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ నిపుణుల టీమ్ త్వరలోనే శివాన్ వచ్చి దీనిపై విచారణ కొనసాగించనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గుర్తుతెలియని దుండగులు రాజ్దేవ్ రంజన్ను హత్య చేశారని సెప్టెంబర్ 15న సీబీఐ ఈ కేసును నమోదుచేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement