Rajeev gandhi jayanti
-
21 ఏళ్లకే చట్టసభల్లో పోటీచేసే అవకాశం కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 21 ఏళ్లకు ఐఏఎస్‌లు, ఐపీఎస్ లు అవుతున్నప్పుడు అదే వయసుకే చట్టసభ లకు పోటీ చేసే అవకాశం కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేసే విషయాన్ని సోనియాగాంధీతో చర్చిస్తామని తెలిపారు. నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఐటీ ఉద్యోగులను ఎగుమతి చేసే దేశంగా ఎదగడానికి రాజీవ్ గాంధీనే కారణమన్నారు. అనంతరం ప్రకాశం హాల్లో రాజీవ్ గాంధీ మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దేహ దారుఢ్య పోటీలోను, వివిధ విభాగాల్లోను గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు అభిజీత్ యాదవ్ ఆధ్వర్యంలో ఇందిరా భవన్లో రక్తదాన శిబిరం ప్రారంభించారు. -
రాజీవ్‌కు ప్రధాని మోదీ, సోనియా నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని రాజీవ్ సమాధి వీర్‌భూమిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నివాళి అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విటర్ వేదికగా ఆయనను స్మరించుకున్నారు. దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో రాజీవ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ జయంతిని ఘనంగా నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు గాంధీ భవన్లో రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమజిగూడలో ఆయన విగ్రహానికి పూలవేసి నివాళులు అర్పిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు -
ఘనంగా రాజీవ్‌గాంధీ జయంతి
గోదావరిఖని (కరీంనగర్): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని సోమవారం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీనగర్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి శాప్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్, టీపీసీసీ సెక్రటరీ బడికెల రాజలింగం రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. రాజీవ్‌గాంధీ ప్రధాని సమయంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు రూపొందించి, పంచాయతీ రాజ్ చట్టాన్ని ప్రారంభించారని తెలిపారు. 2019 ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బొంతల రాజేష్ ఆధ్వర్యంలో నాయకులు ఎం.రవికుమార్, ఎండీ ముస్తాఫా, శ్రీనివాసరావు, రాజేష్, యుగేంధర్, ఫకృద్దీన్, మధు, శ్రీనివాస్, లక్ష్మణ్, శేఖర్, నజీమొద్దీన్, ఎండీ రహీం, మహేష్, ఫయాజ్ అలీ, సర్వర్, శ్రీనివాస్, విజయ్, సూరి, సుల్తాన్‌కుమార్, సతీష్ పాల్గొన్నారు. రామగుండంలో.. రామగుండం: రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వాజీద్‌ఖాన్ రాజీవ్‌గాంధీ ప్రధాని హయంలో దేశానికి చేసిన సేవలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మైనార్టీ పట్టణ అధ్యక్షుడు రఫీఉద్దీన్, యాసిన్‌బేగ్, గౌస్‌బాబా, అజీంపాషా, నరేష్, యాదగిరి, జావీద్‌ఖాన్ తదితరులున్నారు. అంతర్గాం మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు సత్తయ్యగౌడ్, రాజేంద్రప్రసాద్, రాజేందర్, శ్రీనివాస్, శ్రీనివాస్, పోశం, శ్రీనివాస్‌రెడ్డి, రత్నాకర్‌రెడ్డి, హన్మాన్‌రెడ్డిలున్నారు. ఎన్టీపీసీలో రాజీవ్ సద్భావనదివస్ ప్రతిజ్ఞ జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు పరిపాలనా భవనంలో సద్భావన దివస్ ప్రతిజ్ఞ చేశారు. సోమవారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సద్భావన దివస్‌లో భాగంగా హిందీ, ఇంగ్లిష్ భాషలలో ఎగ్జిక్యూటివ్ రవీంద్ర సద్భావనా ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి సంవత్సరం ఆగష్టు–20 న ప్రతిజ్ఞ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు జాతీయ సమైక్యత, శాంతి, జాతీయ సమగ్రత, ప్రేమ కలిగి ఉం డాలన్నారు. జనరల్ మేనేజర్లు‡ బాబ్జి, యం.ఎస్.రమేశ్‌తో పాటు అధికారులున్నారు. ఇందిరమ్మకాలనీలో... పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ చీప్ ఆర్గనైజర్ గోలివాడ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ ఇందిరమ్మకాలనీలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం చిన్నారులతో కేక్ కట్ చేసి మిఠాయిలను పంచి పెట్టారు. అంగన్వాడీ కేంద్రం విద్యార్థులకు పలకలను అందజేశారు. సేవాదళ్ నాయకులు బొద్దున రాజేశం, జబ్బార్, శ్రీశైలం, చంద్రయ్య, చిలుక రాంమూర్తి, శ్రావణ్, లింగయ్య, కళ్యాణ్, కుమార్ నాయక్, సంపత్‌రావు, కల్వల రాజు, సత్యనారాయణ, సదయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. -
ఆహార బిల్లుకు బ్రేక్!
సాక్షి, న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ జయంతి రోజు ప్రతిష్టాత్మక ఆహార భద్రత బిల్లును ఆమోదింపజేసుకుందామనుకున్న పాలకపక్షం ఆశలకు ప్రతిపక్షాలు గండికొట్టాయి. అవసరమైతే సొంత పార్టీ ఎంపీలను సైతం సస్పెండ్ చేసి బిల్లును గట్టెక్కించుకోవాలని భావించిన కాంగ్రెస్‌కు చుక్కెదురైంది. మంగళవారం రాష్ట్ర విభజనతోపాటు బొగ్గు స్కాం, చుక్కలంటిన ఉల్లి ధరలు, శ్రీలంకలో తమిళుల సమస్య.. తదితర అంశాలతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లడంతో ఆహార భద్రత బిల్లు చర్చకు నోచుకోలేదు. బొగ్గు గనుల కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు గల్లంతవడంపై బీజేపీ లోక్‌సభ, రాజ్యసభల్లో గందరగోళం సృష్టించింది. దీనిపై ప్రధాని మన్మోహన్సింగ్ స్వయంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సభా కార్యకలాపాలను స్తంభింపజేసింది. దీనిపై రభస కొనసాగుతుండగానే ఉల్లి ధరలపై అన్నా డీఎంకే, లెఫ్ట్ పార్టీలు, శ్రీలంకలో తమిళుల ఊచకోతకు నిరసనగా కొలంబోలో జరగనున్న కామన్వెల్త్ దేశాధినేతల శిఖరాగ్ర సభను బహిష్కరించాలన్న డిమాండ్‌తో డీఎంకే సభ్యులు గందరగోళం సృష్టించడంతో ఉభయసభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. గందరగోళ పరిస్థితుల మధ్యే బొగ్గు మంత్రిత్వశాఖలో ఫైళ్లు కనిపించకుండా పోవడంపై రాజ్యసభలో బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైశ్వాల్ ప్రకటన చేయడం, లోక్‌సభలో మూడు కొత్త బిల్లులను ప్రవేశపెట్టడం మినహా ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి. ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే ఇటీవల రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ నేత, మాజీ లోక్‌సభ సభ్యుడు లాల్‌జాన్ బాషాకు సభ నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించింది. తర్వాత స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి ఆహార భద్రత బిల్లుపై చర్చను ప్రారంభించేందుకు ఉద్యుక్తులయ్యారు. ఇదే సమయంలో నలుగురు టీడీపీ ఎంపీలు ‘ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి.. రాష్ట్రానికి న్యాయం చేయండి’ అని నినాదాలు చేస్తూ సభామధ్యలోకి వెళ్లారు. వీరికి మద్దతుగా సీమాంధ్రకు చెందిన ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలు తమ స్థానాల నుంచి ముందువరుసల్లోకి వచ్చారు. దీంతో స్పీకర్ సభను 20 నిమిషాలపాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత సీమాంధ్ర ఎంపీల నిరసనలకు తోడు సీపీఐ, సీపీఎం, డీఎంకే సభ్యులు కూడా వివిధ అంశాలపై పోడియం వద్దకు చేరారు. ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ బొగ్గు మంత్రిత్వశాఖ ఫైళ్లు గల్లంతు అంశాన్ని ప్రస్తావించడంతో గందరగోళం మరింత పెరిగింది. ఫైళ్లు మాయం కావడం సిగ్గుచేటు అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీజేపీ సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లారు. దీంతో సభ మరోసారి వాయిదా పడింది. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు, రెండు గంటలకు తిరిగి సమావేశమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో డిప్యూటీ స్పీకర్ కరియా ముండా సభను గురువారానికి వాయిదా వేసి వెళ్లిపోయారు. రాజ్యసభలో కూడా ఇవే దృశ్యాలు కనిపించాయి. నినాదాలు, ప్రతినినాదాల మధ్య మంత్రి జైశ్వాల్ బొగ్గు ఫైళ్ల అదృశ్యంపై ప్రకటన చేశారు. అయినా బీజేపీ సభ్యులు ప్రధాని సభకు రావాల్సిందేనంటూ అడ్డుకోవడంతో సభ గురువారానికి వాయిదా పడింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా బుధవారం పార్లమెంట్‌కు సెలవు ప్రకటించారు. ఏటా మూడు లక్షల శిశు మరణాలు దేశంలో ఏటా జన్మిస్తున్న చిన్నారుల్లో ఏకంగా మూడు లక్షల మందికిపైగా పుట్టిన 24 గంటల్లోనే మరణిస్తుండగా.. 56 వేల మంది తల్లులు కూడా మృతిచెందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు.. ‘స్టేట్ ఆఫ్ వరల్డ్స్ మదర్’ నివేదికను ఉటంకిస్తూ ఆయన ఈ వివరాలు తెలిపారు. మధ్యాహ్నభోజనం, అంగన్వాడీ కేంద్రాలు, పౌష్టికాహారం, మంచినీరు, పారిశుధ్యం తదితర అంశాలపై సమీక్షకు ప్రత్యేకంగా గ్రామసభలను నిర్వహించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. పిల్లల అంశాలకు సంబంధించి జూలై, ఆగస్టుల్లో.. మహిళలకు సంబంధించి అక్టోబర్, నవంబర్‌ల్లో ఈ గ్రామసభలను నిర్వహించాల్సిందిగా సూచించామని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి కిషోర్ చంద్రదేవ్ లోక్‌సభలో చెప్పారు. ఉల్లి ఎగుమతుల నియంత్రణకు చర్యలు.. ఉల్లి ధరలు చుక్కలను తాకుతుండడంతో.. ఎగుమతులను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం 13 ప్రభుత్వ సంస్థలను కెనలైజింగ్ ఏజెన్సీలు (మళ్లింపు సంస్థలు)గా నిర్ణయించింది. దాని ప్రకారం ఉల్లిని ఈ సంస్థల ఆధ్వర్యంలో విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ వివరాలను మంగళవారం కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి పురందేశ్వరి లోక్‌సభలో వెల్లడించారు. మన రాష్ట్రానికి చెందిన ‘ఏపీ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్’ కూడా ఆ జాబితాలో ఉంది. గల్లంతైన భద్రతా సిబ్బందిలో 54 మంది పాక్ జైళ్లలో! పాకిస్థాన్‌తో జరిగిన 1965, 1971 యుద్ధాల సమయంలో కనిపించకుండా పోయిన భద్రతా సిబ్బందిలో 54 మంది పాకిస్థాన్ జైళ్లలో ఉన్నట్లుగా భావిస్తున్నామని రక్షణమంత్రి ఏకే ఆంటోనీ లోక్‌సభలో చెప్పారు.