rajeswar reddy
-
ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన నాటా కమిటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఉత్సవాలకు హాజరు కావాలసిందిగా వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఆహ్వానం అందింది. 2018 జూలై 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నాటా ఉత్సహాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నాటా కమిటీ మంగళవారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కలుసుకుంది. నాటా ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా నాటా బృందం విజ్ఞప్తి చేసింది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఉత్సవాలకు ఆహ్వానించిన వారిలో నాటా అధ్యక్షులు జి.రాజేశ్వర్‌రెడ్డి, జి. రాఘవరెడ్డి (ఎలక్ట్), శ్రీదర్ కొర్రపాటి, ఆళ్ల రామిరెడ్డి, ద్వారక్ వారణాసి, ప్రతాప్, ప్రసాద్, ఎస్. నారాయణరెడ్డి, మనోహర్ తదితరులు ఉన్నారు. -
ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన నాటా కమిటీ
-
రెచ్చిపోయిన కాల్ మనీ వ్యాపారులు
కర్నూలు: ఏపీలో కాల్ మనీ వ్యాపారుల ఆగడాలు శృతి మించుతున్నాయి. అప్పుతీసుకున్న వారి ప్రాణాలు తీస్తున్నాయి. మరికొందరిపై వడ్డీ వ్యాపారులు దాడులకు దిగుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలో శుక్రవారం కాల్ మనీ వ్యాపారులు రెచ్చిపోయారు. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీకి చెందిన రాజేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి స్థానిక వడ్డీ వ్యాపారి చందు వద్ద రూ.10 వడ్డీకి రూ.4 లక్షలు రుణంగా తీసుకున్నాడు. అందుకు గాను దఫాలుగా డబ్బు చెల్లిస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు రెండుసార్లు రూ. లక్ష ఇచ్చాడు. మిగతా డబ్బును శుక్రవారం కల్లా చెల్లించాలంటూ తీవ్రంగా ఒత్తిడి తేవటంతో రాజేశ్వర్‌రెడ్డి నిస్సహాయత వ్యక్తం చేశాడు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చందూ అతడిని పిడిగుద్దులు గుద్దాడు. దీంతో కుడి భుజం కిందికి జారిపోయింది. కుటుంబసభ్యులు రాజేశ్వరరెడ్డిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు. -
ఆదివారం టీఎస్, ఏపీ సెట్ పరీక్ష
హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్) ఆది వారం జరగనుంది. ఇందుకోసం రెండు రాష్ట్రాల్లో 218 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జంటనగరా ల్లో 51 పరీక్షా కేంద్రాలున్నట్లు శుక్రవారం సభ్య కార్యదర్శి ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 9.30 నిమిషాలకు పరీక్ష ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. -
కోడ్ పరిధిలోకి డ్వాక్రా మహిళలు
సాక్షి, సంగారెడ్డి: డ్వాక్రా సంఘాలు పల్లెపల్లెకు విస్తరించాయి. స్వయం ఆలంబనతో తోటి మహిళల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అన్నీ రాజకీయ పక్షాలు స్వయం సహాయక సంఘాలను ప్రసన్నం చేసుకోడానికి శతవిధాలుగా ప్రయత్నించడం ఇప్పటి వరకు అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో సైతం అధికార పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఎస్‌హెచ్‌జీల సేవలను వినియోగించుకుంది. మండల, గ్రామ సమైక్యల ద్వారా మహిళలకు డబ్బులు, చీరలు పంచిన సంఘటనలు పరిపాటిగా మారాయి. అయితే, ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో మాత్రం ఎస్‌హెచ్‌జీలను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకోడానికి ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. జిల్లా సమైక్య, మండల, గ్రామైక్య సంఘాల ఖాతాలపై ఇప్పటికే నిఘా వేశారు. డీఆర్డీఏ, సెర్ప్ ఖాతాలు నుంచి కాక మరే ఇతర ఖాతాల నుంచి డబ్బులు బదిలీ చేస్తే గుర్తించి సమాచారాన్ని అందజేయాలని ఇప్పటికే బ్యాంకర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున.. జిల్లా, మండల, గ్రామ సమాఖ్యల సమావేశాల్లో ఎవరూ రాజకీయాలు మాట్లాడరాదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) ప్రాజెక్టు డెరైక్టర్ రాజేశ్వర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్డీఏ సిబ్బంది ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా..ఎస్‌హెచ్‌జీలను ప్రేరేపించినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సభ్యులను పదవుల నుంచి తొలగించడమే కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే గ్రామ సమన్వయకర్త, కమ్యూనిటీ సమన్వయకర్త, ఏపీఎంఎస్, ఏసీఎస్‌లను విధుల నుంచి తొలగిస్తామన్నారు. -
ఆరోగ్యవంతమైన సమాజమే ‘మార్పు’ లక్ష్యం
గజ్వేల్ రూరల్, న్యూస్‌లైన్: ఆరోగ్యవంతమైన సమాజమే ‘మార్పు’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ సిత్మా సబర్వాల్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని కోలా అభిరాం గార్డెన్స్‌లో ‘మార్పు’ కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, ‘మార్పు’ పథకం అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి గర్భిణి ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకునేలా అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు. మాత, శిశు సంరక్షణ కార్డులో పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ఉచితంగా పౌష్టికాహారం, వైద్య సేవలు, సూచనలు అందుతాయని తెలియజెప్పాలన్నారు. ఓ మహిళ గర్భం ధరించినప్పటి నుంచీ ఆమెకు అన్ని విధాలా సలహాలు, సూచనలు అందిస్తూ, ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం అయ్యే విధంగా ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి ‘మార్పు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ, కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు నెలకోసారి గ్రామంలో సమావేశం జరిగేలా చూడాలన్నారు. ప్రతి పథకాన్నీ మహిళలకు అందించడంలో చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పద్మ, డీసీహెచ్ వీణ, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, డీపీఓ జగన్నాథం, డీఈఎంఓ వసంతరావు, నియోజకవర్గంలోని ఎంపీడీఓలు, తహశీల్దార్లు, పీహెచ్సీ ైవె ద్యాధికారులు, ఐకేపీ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. -
29న యూజీసీ నెట్
హైదరాబాద్, న్యూస్‌లైన్: యూజీసీ జాతీయ అర్హత పరీక్ష (నెట్) ఈ నెల 29న జరగనున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతీయ సమన్వయకర్త ప్రొఫెసర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. నెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్‌టికెట్లు, పరీక్షా కేంద్రాల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. హాల్‌టికెట్లనుwww.apset.org,www.osmania.ac.inలో డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. పూర్తి వివరాలను 040-27097733 నంబర్‌కు ఫోన్‌చేసి లేదా apset2012@ gmail. com మెయిల్ ద్వారా తెలుసుకోవచ్చు.