Rajkamal Films International
-
అలా చేయాలంటే మేము బయటకు వెళ్లాలి: కమల్ హాసన్
Kamal Haasan About Shankar Indian 2 Says We Cant Sit With One Movie: నాలుగేళ్ల తర్వాత లోకనాయకుడు (ఉలగ నాయగన్) కమల్ హాసన్ వెండితెరపై సందడి చేశాడు. తాజాగా ఆయన నటించిన 'విక్రమ్: హిట్ లిస్ట్' మూవీ అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కమల్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో 'భారతీయుడు 2' (ఇండియన్ 2) గురించి మాట్లాడారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'భారతీయుడు 2' సినిమాపై కమల్ స్పందనను యాంకర్ కోరగా ఈ వ్యాఖ్యలు చేశాడు. భారతీయుడు 2 సినిమా ఆగిపోలేదు. తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. అయితే కరోనా, సెట్లో ప్రమాదం ఇలా రకరకాల కారణాలతో సినిమా చిత్రీకరణ ప్రారంభం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా షూటింగ్ కంటిన్యూ చేశాం. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా వాళ్లతో ఇప్పటికే మాట్లాడాం. వాళ్లు కూడా త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇంకో 40 శాతం షూటింగ్ మిగిలి ఉంది. అది కూడా త్వరలోనే చేస్తాం. ఎందుకంటే ఒక చిత్రంపైనే పదేళ్లు పని చేయలేం కదా. రాజ్ కమల్ ఫిల్మ్స్ అని నాకొక నిర్మాణ సంస్థ ఉంది. అలాగే శంకర్‌కి ఎస్. ప్రొడక్షన్స్ ఉంది. ఈ రెండు చాలా పెద్ద సంస్థలు. ఈ రెండింటిని మేమే పోషించాలి. అందుకోసం మేం బయటకు వెళ్లి పనిచేయాలి. అని కమల్ హాసన్ పేర్కొన్నారు. చదవండి: కమల్ హాసన్: ఆయనతో కలిసి నటించాలని ప్రాధేయపడ్డా.. కానీ.. కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ.. -
సరికొత్త కాంబినేషన్?
అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి ఓ సినిమా చేయబో తున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కానీ వీరిద్దరూ హీరోలుగా నటించడం లేదు. రజనీకాంత్ హీరోగా కమల్‌హాసన్ నిర్మాతగా రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కనుందని కోలీవుడ్ తాజా టాక్. ఈ వార్త నిజమైతే ఓ కొత్త కాంబినేషన్ కుదిరినట్లే. ‘మా నగరం, ఖైదీ’ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. ఇదిలా ఉంటే.. కెరీర్ ఆరంభంలో రజనీ–కమల్ కలిసి పలు సినిమాల్లో నటించారు. మరి ఇప్పుడు ఎందుకు చేయడంలేదు? అనే ప్రశ్న ఈ హీరోల ముందుంచితే– ‘‘ఇప్పుడు మా కాంబినేషన్ అంటే బడ్జెట్ భారీగా ఉండాలి. దానికంటే ముఖ్యం కథ. అప్పట్లో మా ఇద్దరి ఇమేజ్ వేరు. ఇప్పుడు ఇమేజ్ వేరు. ఇద్దరి ఇమేజ్‌కి తగ్గ కథ కుదరాలి. అందుకని కలిసి నటించడానికి కుదరకపోవచ్చేమో’’ అని చెబుతుంటారు. మరి.. హీరో–నిర్మాతగా ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా? అంటే వేచి చూడాల్సిందే. -
కమల్‌తో దోస్తీ
ఒక సంచలన కలయికకు రంగం సిద్ధం అవుతుందనే ప్రచారం కోలీవుడ్‌లో తాజాగా హల్చల్ చేస్తోంది. నటుడు కమలహాసన్ రాజకీయరంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే పార్టీ పేరు, గుర్తును వెల్లడించే అవకాశం ఉంది. దీంతో ఆయన నటిస్తున్న విశ్వరూపం-2, శభాష్‌నాయుడు చిత్రాలను తొందరలోనే విడుదల చేసే పనిలో మునిగిపోయారు. తాజాగా కమలహాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఒక క్రేజీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి రాజేశ్ సెల్వ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈయన ఇంతకు ముందు కమలహాసన్, త్రిష జంటగా నటించిన తూంగావనం చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కమల్ ఇంతకుముందు తాను నిర్మాతగా నాజర్ ప్రధాన పాత్రలో మగళీర్ మట్టుం, సత్యరాజ్ హీరోగా కడమై కన్నియం కట్టుపాటు, మాధవన్ కథానాయకుడిగా నలదమయంతి వంటి చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. త్వరలో రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించనున్న కమలహాసన్ చిత్ర పరిశ్రమకు దూరం కాకుండా మంచి చిత్రాలను నిర్మించాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా విక్రమ్ హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో ఆయన అతిథిగా మెరిసే అవకాశం లేకపోలేదు. అయితే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా!
‘‘నేను తెలుగులో స్ట్రయిట్ ఫిలిం చేస్తానని చెప్పా. ఇచ్చిన మాట ప్రకారం ఈ సినిమా చేశాను. నన్ను స్టార్ చేసిన తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమా చేశాను’’ అని కమల్‌హాసన్ అన్నారు. రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, శ్రీ గోకులం మూవీస్ సంయుక్తంగా రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో ఎస్. చంద్రహాసన్, కమల్‌హాసన్ నిర్మించిన చిత్రం ‘చీకటి రాజ్యం’. కమల్‌హాసన్, త్రిష, ప్రకాశ్‌రాజ్, మధుశాలిని ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, మేకింగ్ వీడియోను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. కమల్‌హాసన్ మాట్లాడుతూ - ‘‘నేను నేషనల్ స్టార్‌గా మొదలైంది తెలుగు సినిమాలతోనే. రికార్డ్స్ పరంగా చెప్పాలంటే తెలుగులోనే నాకు ఎక్కువ ఉన్నాయి. తమి ళ్లో కూడా అన్ని రికార్డ్స్ ఉండవు. అందుకే తెలుగులో నేను ఆర్డినరీ సినిమాలు చేయడానికి ఇష్టపడను. ‘చీకటి రాజ్యం’ ఆర్డినరీ సినిమా కాదు. దీన్ని మీరే ఎక్స్ట్రార్డినరీ ఫిలిమ్ చేయాలి. వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ ఇది మెమెరబుల్ మూవీ’’ అన్నారు. రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ - ‘‘హాలీవుడ్ శైలిలో ఒకే పాయింట్ మీద సాగే కథతో సినిమా ఉంటుంది. సినిమా మొదలైన పది నిమిషాలకు మన హార్ట్‌బీట్ కూడా పెరుగుతుంది. థ్రిల్లర్ తరహాలో ఉత్కంఠకు గురి చేస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, నటి మధుశాలిని తదితరులు పాల్గొన్నారు.