Rajsingh
-
రాజాసింగ్‌పై ఫేస్బుక్ నిషేధం
సాక్షి, హైదరాబాద్ : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫేస్బుక్ నిషేధం విధించింది. ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఫేస్బుక్ నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా నిషేదం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు ఈ- మెయిల్ ద్వారా వెల్లడించారు. హింసను ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేస్తున్న కారణంగా రాజాసింగ్ ఫేస్బుక్ అకౌంట్‌ని తొలిగిస్తున్నామంటూ ప్రకటించారు. ఇదివరకే దీనికి సంబంధించి పలుసార్లు హెచ్చరించినా ఫేస్బుక్ నియమావళిని ఉల్లంఘించారని పేర్కొన్నారు. (‘గణపతిని మావోయిస్టు పార్టీ వదులుకోదు’) మరోవైపు ఫేస్బుక్ నిషేదంపై స్పందించిన రాజాసింగ్ తనకు అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ఫేస్బుక్ అకౌంట్ లేదని, తన పేరుతో ఉన్న నకిలీ అకౌంట్లకు తాను బాధ్యుడిని కానంటూ వివరణ ఇచ్చారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఖాతాదారులున్న ఫేస్బుక్ బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను చూసీచూడనట్లుగా వదిలేస్తోందనే వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నిషేధం ప్రాధాన్యత సంతరించుకుంది. (డ్రగ్స్ వ్యవహారంతో నటికి లింకు!) -
విలువలతో కూడిన జీవన మార్గం అవసరం
అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్: దేవుని మార్గంలో విలువలతో కూడిన జీవనం సాగిస్తే సుఖశాంతులు లభిస్తాయని రెవరెండ్ ఈడీరాజాసింగ్ అన్నారు. స్థానిక సీఎస్ఐ చర్చిలో ఇండియన్ ఇవాంజికల్ మిషన్ నేతృత్వంలో మూడు రోజులుగా సాగిన 26వ రాష్ట్ర స్థాయి స్త్రీల మైత్రీ సదస్సు శుక్రవారం ఘనంగా ముగిసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన మిషనరీలు, మత ప్రబోధకులు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. బెంగళూరు నుంచి బైబిల్ ప్రసంగీకులు డాక్టర్ ఈడీ రాజాసింగ్, కర్నూలు నుంచి సిస్టర్ ఎన్జే సువర్ణ బెంజిమెన్ తదితరులు ప్రతినిత్యం బైబిల్లోని పలు ఘట్టాలను వివరించారు. దేవుని మూల స్వరూపాన్ని తెలుసుకున్ననాడు ఐహిక సుఖాల వెంటపడరని ఉద్బోదించారు. ప్రాంతీయ విబేధాలు, సంకుచిత స్వభావం వీడి సాటి మనిషి పట్ల ప్రేమను పంచేలా చేయడానికే స్త్రీల సదస్సును నిర్వహించినట్లు తెలిపారు. మతపెద్దల ప్రసంగాలను యూత్ సభ్యుడు సురేష్ అనువదించారు. సంస్థ కన్వీనర్ రెవ. ఆర్.సాలేమ్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కార్యక్రమంలో ప్రతిభ చూపినవారికి బహుమతులను అందజేశారు. రాష్ట్రం శాంతిభద్రతలతో సుభిక్షంగా ఉండాలని క్రైస్తవ మత పెద్దలు ఫీబా జయరాజ్, పలువురు సంఘ కాపారులు, మిషనరీలు సామూహిక ప్రార్థనలు చేశారు.