ఇంకా 19 ఏళ్లేనా..?
నేపాల్ క్రికెట్ కెప్టెన్ వయస్సుపై వివాదం
ఢాకా: అండర్-19 ప్రపంచకప్లో నేపాల్ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రాజు రిజాల్ వాస్తవ వయస్సుపై ముంబై ఆట గాడు కౌస్తుబ్ పవార్ వివాదం లేపాడు. తామిద్దరం కలిసి అండర్-15లో ఆడామని గుర్తు చేశాడు. వాస్తవానికి అతను 24 లేదా 25 ఏళ్లు ఉంటాడని ఫేస్బుక్లో ఆరోపించాడు. ‘అండర్-15లో మేమిద్దరం కలిసి ముంబై జట్టు తరఫున ఆడాం. అప్పుడతను రాజు శర్మగా ఆడాడు. ఇప్పుడు అతను రాజు రిజాల్ పేరిట అండర్-19 నేపాల్ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. మాతో పాటు ఇతరుల వయ స్సు 24 లేదా 25గా ఉంటుంది’ అని కౌస్తుబ్ సంచలన ఆరోపణలు చేశాడు.