Rakesh jhun
-
ఈ కోర్స్‌లకు భారీ డిమాండ్, 50 లక్షల ఉద్యోగాలు.. హాట్ హాట్‌గా!
ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా ఐటీ ఉద్యోగాలపై ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో జరిగిన ఓ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఐటీ ఉద్యోగాలతో పాటు ఇతర అంశాలపై మాట్లాడారు. ఇటీవల ట్యాగ్డ్ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ సంస్థ ఆ సర్వే ఆధారంగా.. మన దేశానికి చెందిన ఐటీ కంపెనీలు రానున్న ఐదేళ్లలో 50లక్షల మంది ఉద్యోగుల నియామాల్ని చేపడతాయని రాకేష్ ఝన్‌ఝన్‌వాలా అన్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత గాడినపడుతున్న ఎకానమీ తీరుతో నియామకాలు భారీ ఎత్తున జరుగుతాయని జోస్యం చెప్పారు. సర్వే ఏం చెబుతోంది కొద్దిరోజుల క్రితం ట్యాగ్డ్ జరిపిన ఒక సర్వేలో మహమ్మారి తర్వాత ఎకానమీ పుంజుకోవడంతో 31 శాతం నియామాకాలు పెరుగుతాయని తేలింది. ఇక ఈ ఏడాది జరిగే ఉద్యోగాలు నియామకంలో 56 శాతం కంటే ఎక్కువ శాతం 0-5 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగుల ఎంపిక అధికంగా ఉండనుంది. టాప్ స్కిల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ వంటి విభాగాలకు చెందిన ఉద్యోగాలకు హాట్ కేకుల్లా నియమకాలు జరుగుతాయని ట్యాగ్డ్ చేసిన సర్వేలో తేలింది. ఫ్రెషర్స్ కు బంపరాఫర్ రానున్న రెండేళ్లలోపు ఐటీ విభాగంగా ఫ్రెషర్స్, రెండేండ్ల లోపు అనుభవం ఉన్న వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని విప్రో చీఫ్ హ్యూమన్ రిలేషన్స్ అధికారి సౌరవ్ గొహిల్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మేము మా వర్క్-ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా నాన్-ఇంజనీర్ ఫ్రెషర్లను కూడా రెట్టింపు చేసాము. వర్క్‌ఫోర్స్‌లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, ఇందుకోసం అనేక కార్యక్రమాలను ప్రారంభించామని గోవిల్ చెప్పారు. -
ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా
ముంబై: బ్లూచిప్ స్టాక్స్‌తో పోలిస్తే రియల్టీ డెవలపర్లు తక్కువ రిటర్నులతోనే నెట్టుకొస్తున్నట్లు సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. అందుబాటు ధరల హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టే సంస్థలు మాత్రమే స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టింగ్‌కు వెళ్లగలవని అభిప్రాయపడ్డారు. ఆశించిన స్థాయిలో అమ్మకాల పరిమాణాన్ని సాధించగలగడం దీనికి కారణమని తెలియజేశారు. డీఎల్ఎఫ్, మాక్రో డెవలపర్స్ తదితర కొద్ది సంస్థలు మాత్రమే లిస్టింగ్‌ను చేపట్టినట్లు పేర్కొన్నారు. డీఎల్ఎఫ్ షేరును తీసుకుంటే ఒకప్పుడు రూ.1,300 ధర నుంచి రూ.80కు పడిపోవడాన్ని ప్రస్తావించారు. ఇది రియల్టీ విభాగంలోని రిస్కులను వెల్లడిస్తున్నట్లు తెలియజేశారు. ఆకాశ పేరుతో ఇటీవల విమానయాన కంపెనీ ఏర్పాటుకు తెరతీసిన ఝున్‌ఝున్‌వాలా.. రేర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా స్టాక్ మార్కెట్, తదితర బిజినెస్‌లలో ఇన్వెస్ట్ చేసే సంగతి తెలిసిందే. ఆధారపడలేం తాను రియల్టీ డెవలపర్‌ను అయి ఉంటే కంపెనీని లిస్టింగ్ చేయబోనంటూ రాకేష్ వ్యాఖ్యానించారు. అనిశ్చితులతో కూడిన బిజినెస్ కావడమే దీనికి కారణమని తెలియజేశారు. రియల్ఎస్టేట్ రంగంపై సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో రాకేష్ ప్రసంగించారు. బ్లూచిప్ స్టాక్స్ 18–25 శాతం లాభాలను అందిస్తున్న సమయంలో 6–7 శాతం రిటర్నులకు పరిమితమయ్యే రియల్టీని లిస్టింగ్ చేయడంలోని ఔచిత్యాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించారు. రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ)లు, కమర్షియల్ రియల్టీ పట్ల ఇన్వెస్టర్లు ఆశావహం(బుల్లిష్)గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఐటీ సర్వీసులు, ఫార్మా తదితర రంగాలు వీటికి దన్నునివ్వవచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో పెట్టుబడులు గతంలో ఐదు రియల్టీ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసినట్లు రాకేష్ వెల్లడించారు. తద్వారా లాభాలు ఆర్జించినట్లు తెలియజేశారు. ఇల్లు కొనుగోలుకి ఆసక్తి పెరుగుతున్నదని, ఇకపై రియల్టీ రంగానికి ఆశావహ పరిస్థితులు ఏర్పడనున్నట్లు అంచనా వేశారు. తాను కూడా 2006లో ఇంటి కొనుగోలు కోసం క్రిసిల్ షేర్ల విక్రయం ద్వారా రూ.20 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేశారు. అయితే ఈ వాటాను విక్రయించకుంటే ఈరోజు మరో రూ.1,000 కోట్ల సంపదను ఆర్జించేవాడినని తెలియజేశారు. కాగా.. ఆకాశ పేరుతో కొత్త విమానయాన సంస్థ ఏర్పాటుపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కంపెనీలో రూ. 275 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేశారు. పలు యూరోపియన్ ఎయిర్‌లైన్స్ సంస్థలు దెబ్బతిన్న సమయంలో ప్రారంభమైన ర్యాన్ ఎయిర్ తొలి రోజునుంచే లాభాలు ఆర్జించిన విషయాన్ని ఈ సందర్భంగా రాకేష్ ప్రస్తావించారు. స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించినట్లే ఆకాశ సంస్థను విజయవంతం చేయగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
ఝున్ఝున్వాలాఆర్థిక సూత్రాలు...
ఇన్వెస్ట్ చేయడం అన్నది ఒక కళ. అంతర్జాతీయంగా ఇన్వెస్ట్మెంట్ గురుగా పేరొందిన వారెన్ బఫెట్, దేశీయంగా రాకేశ్ ఝున్ ఝున్‌వాలా ఈ కళను ఔపోశన పట్టిన వారిలో అగ్రగణ్యులు. ఝున్‌ఝున్‌వాలాను దేశీ వారెన్ బఫెట్ అని కూడా అంటారు. అత్యధిక లాభాలు అందించగలిగే స్టాక్స్‌ను ఒడిసిపట్టుకోగలిగే నేర్పు ఆయన సొంతం. ఆయన ప్రస్తుత సంపద విలువ రూ. 6,000 కోట్ల పైచిలుకు ఉంటుంది. ఇన్వెస్టరుగా విజయాలు సాధించేందుకు ఆయన పాటించే సూత్రాలు ఇవి.. 1.ఆశావహంగా ఉండాలి. ఇన్వెస్టరుకి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన గుణం ఇదే. 2.వాస్తవిక రాబడులనే ఆశించాలి. అత్యాశకు పోవద్దు.. అలాగని అతిగా భయపడనూ కూడదు. 3.నాలుగు అక్షరాల ఇంగ్లిష్ పదం రిస్క్‌ను గుర్తుంచుకోవాలి. పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. 4.క్రమశిక్షణ ఉండాలి. ప్రణాళికంటూ ఉండాలి. 5.సందర్భాన్ని బట్టి ఊసరవెల్లిలాగా వ్యూహాన్ని మార్చుకోగలగాలి. 6.భిన్నంగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయగలగాలి. 7.ఏది కొంటున్నామన్నది ముఖ్యం. ఎంతకు కొంటున్నాం అన్నది అంతకన్నా ముఖ్యం. 8.ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నమ్మకం, ఓపిక ఉండాలి. అప్పుడే ప్రతిఫలం దక్కుతుంది. 9.సందర్భాన్ని బట్టి లాభనష్టాలు, సెంటిమెంటు నిమిత్తం లేకుండా వైదొలగాలి. 10.ఉచిత సలహాలపై ఆధారపడొద్దు. అరువు జ్ఞానంతో లాభాలు రావు. స్వయంగా అధ్యయనం చేసి ముందడుగు వేయాలి.