Rakesh Roshan (producer-director)
-
కలిసిన కాసేపటికే కార్డు ఇచ్చి రమ్మన్నాడు.. చింపి పడేశా: తాజ్ మహల్ హీరోయిన్
తెలుగు సినిమా తాజ్ మహల్‌తో వెండితెరకు పరిచయమైంది మోనికా బేడీ. ఆ తర్వాత 1995లో వచ్చిన సురక్ష చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అక్కడే సినిమాలు చేసుకుంటూ బీ టౌన్లోనే సెటిలైపోయిన మోనికా తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. 'దర్శకుడు సుభాష్ ఘై హోలీ పార్టీలో రాకేశ్ రోషన్ నా దగ్గరకు వచ్చాడు. అతడు నటుడన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే అతడు యాక్ట్ చేసిన కొన్ని సినిమాలు చూశాను. కానీ అతడు దర్శకుడు, నిర్మాత కూడా అన్న విషయం మాత్రం తెలియదు. అతడు కాసేపు మాట్లాడాక విజిటింగ్ కార్డు ఇచ్చి రేపు ఒకసారి కలువు అని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. ఇతడు నన్నెందుకు రమ్మంటున్నాడు అని అనుమానించి ఆ కార్డును ముక్కలు ముక్కలు చేసి పడేశాను. కొన్ని నెలల తర్వాత నా మేనేజర్.. ఎందుకు రాకేశ్‌ను కలవలేదు? అని అడిగాడు. అతడు కరణ్ అర్జున్ సినిమా తీస్తున్నాడు. ఇందులో నీకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలనుకున్నాడు. సల్మాన్ ఖాన్ సరసన మమత కులకర్ణి నటిస్తున్న రోల్ నువ్వు చేయాల్సింది అని చెప్పాడు. అప్పుడు కానీ నేను చేసిన తప్పు అర్థం కాలేదు. డైరెక్టర్, నటుడు మనోజ్ కుమార్ కూడా తన కొడుతో తీస్తున్న సినిమాకు నన్ను సంప్రదించాడు. నాకు చాలా సంతోషమేసింది. కానీ తన సినిమా పూర్తయ్యేవరకు మరే సినిమా చేయడానికి వీల్లేదని అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నాడు. అయితే ఆ సినిమా వర్కవుట్ కాలేదు. అసలు షూటింగే జరగలేదు. ఇది అతడి తప్పు కాదు. కొన్ని సార్లు మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరగవంతే! అయితే ఈ అగ్రిమెంట్ వల్ల నేను ఏడాదిన్నరపాటు ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాను. ఆ తర్వాత సినిమా అయ్యేలా లేదని గ్రహించిన మనోజ్ తన కాంట్రాక్ట్ నుంచి నాకు విముక్తి కల్పించాడు' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే మోనిక హిందీ బిగ్‌బాస్ రెండో సీజన్లోనూ పాల్గొంది. ఝలక్ దిక్లాజా మూడో సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది. చదవండి: నాగార్జున బ్లాక్‌బస్టర్ మూవీ.. ఆ డైరెక్టర్‌ను గుర్తుపట్టారా? -
పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు : రాకేష్ రోషన్ (దర్శక-నిర్మాత), అభినవ్ కశ్యప్ (దర్శకుడు) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధునికి సంబంధించిన సంఖ్య. పుట్టిన తేదీ 6. ఇది శుక్ర సంఖ్య. బుధ శుక్రుల కలయిక వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఈ సంవత్సరం విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కోరుకున్న ఇన్స్టిట్యూషన్లలో సీటు వస్తుంది. వ్యాపారుల సమయానుకూలంగా తగిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార వృద్ధి, కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు మంచి పనితీరు కనబరచి ప్రశంసలు అందుకుంటారు. మీరు 6వ తేదీన పుట్టినందువల్ల జీవితం ఆనందంగా, ఉత్సాహంగా, సౌఖ్యవంతంగా గడిచిపోతంంది. ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. వివాహ యత్నాలలో ఉన్న వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. స్పెక్యులేషన్ బాగా లాభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. మీడియా, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు, గుర్తింపు వస్తాయి. కోపం తగ్గించుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 5,6,9; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రీన్, శాండల్; లక్కీ డేస్: ఆది, బుధ, శుక్రవారాలు. సూచనలు: తోబుట్టువులను ఆదుకోవడం, నవగ్రహాభిషేకం చేయించుకోవడం, బీదవిద్యార్థులకు పుస్తకాలు, ఆహారం పంపిణీ చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్