ram mohan reddy
-
రైతుబంధు రాకపోతే..కాలర్ ఎగరేసి అడగండి
-
సీతక్కకు భయపడి తీసుకున్నారు
-
అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్
-
ధరణి పోర్టల్ రద్దు చేస్తాం..
-
కడపలోనే కాదు, విశాఖలోనూ స్టీల్ ప్లాంట్
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు కేవలం కడపలోనే కాదు, విశాఖలోనూ మరో స్టీల్ ప్లాంట్ ఇవ్వనుందని ఏపీ బీజేపీ నేత కందుల రాజమోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేతలు కందుల రాజమోహన్ రెడ్డి, రఘునాథ్ బాబు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఉప రాష్ట్రపతి నివాసంలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. చర్చ అనంతరం కందుల రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ విషయంలో టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2014 సంవత్సరంలో సెయిల్ ఇచ్చిన నివేదికలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పిన విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నారని, చివరి పేరాలో ప్రస్తావించిన మెకాన్ సంస్థ ప్రాథమిక నివేదిక గురించి ఉద్దేశపూర్వకంగా వదలేశారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఒత్తిడి ఉన్నా సరే విశాఖలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు కేంద్రం సిద్దపడిందని, కడపలో స్టీల్ ప్లాంట్ శంఖుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా వస్తుందన్న విషయం తెలుసుకాబట్టే టీడీపీ నేతలు స్టీల్ ప్లాంట్ కోసం దీక్షల పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే 2014లో సెయిల్ నివేదిక.. స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదన్నప్పుడే ఎందుకు ధర్నాలు, దీక్షలు చేయలేదని ప్రశ్నించారు. కడప జిల్లాలో అభివృద్ధి పనులు చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. సీఎం రమేశ్ సహా టీడీపీ నేతల దీక్షల్లో ఏమాత్రం స్వచ్ఛత, చిత్తశుద్ధి లేదని, పార్లమెంటులో 6 గంటలకే స్పృహ కోల్పోయిన నేతలు 6 రోజులుగా ఇప్పుడు ఎలా దీక్ష చేయగల్గుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారు? న్యూఢిల్లీ : చంద్రబాబు రాయలసీమ వ్యక్తి అని చెప్పుకుంటూ.. సీమకు ఏం చేశారో చెప్పాలని ఏపీ బీజేపీ నేత రఘనాధ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేతలు కందుల రాజమోహన్ రెడ్డి, రఘునాథ్ బాబు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఆయన నివాసంలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. చర్చ అనంతరం రఘునాధ బాబు మాట్లాడుతూ.. టీడీపీ దొంగ దీక్షలు కొంగ జపాలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అబద్దాలు, అసత్యాలను ప్రచారం చేస్తోందన్నారు. 300మిలియన్ టన్నుల ఐరన్ ఉత్పత్తి చేయాలని కేంద్రం భావిస్తోందని, స్టీల్ ధర పెరుగుతుంది కాబట్టి తప్పకుండా స్టీల్ ప్యాక్టరీ వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రిని ఆరా తీసిన వెంకయ్య నాయుడు న్యూఢిల్లీ : కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు. మంగళవారం కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేతలు కందుల రాజమోహన్ రెడ్డి, రఘునాథ్ బాబు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని ఇంటికి పిలిపించిన వెంకయ్య నాయుడు స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. కడప, విశాఖలో స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ తెలిపారు. -
నా ఇంటి నుంచి వెళ్లిపో..!
సోదరి డీకే అరుణపై ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం ధన్వాడ: కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, ఆమె సోదరుడు, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. తమ తండ్రి దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇంటికొచ్చిన అరుణను చూసి రామ్మోహన్‌రెడ్డి కోపోద్రిక్తుడయ్యారు. ‘‘ముందు నా ఇంటి నుంచి వెళ్లిపో’’అని అరుణనుద్దేశించి వ్యాఖ్యానించారు. మంగళవారం చిట్టెం నర్సిరెడ్డి, ఆయన తనయు డు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలంలోని నర్సిరెడ్డి ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. డీకే అరుణ కుటుంబ సభ్యులతో కలసి రామ్మోహన్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లారు. రామ్మోహన్‌రెడ్డి.. అరుణను చూసి తన ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ గొడవకు దిగారు. తన అనుమతి లేకుండా ఎవరినీ ఇంట్లోకి రానివ్వొద్దంటూ స్థానిక ఎస్ఐకి హుకుం జారీ చేయడం చర్చనీయాంశమైంది. -
గులాబీ గూటికి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిన మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లోకి మరో చేరిక జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బుధవారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సి.లక్ష్మారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజులతో కలసి సీఎం అధికారిక నివాసానికి వచ్చిన రామ్మోహన్‌రెడ్డికి... ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ సోదరుడైన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి, టీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రెండు నెలలుగా ప్రచారం జరుగుతోంది. గత నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనే ఆయనతోపాటు డీకే అరుణ కూడా చేరనున్నారని వార్తలు వెలువడ్డాయి. దీనిని డీకే అరుణ ఖండించగా... రామ్మోహన్‌రెడ్డి మాత్రం గులాబీ గూటికి చేరారు. ఇదే బాటలో మరికొందరు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరగా.. చిట్టెం చేరికతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. ఇక మహబూబ్‌నగర్ జిల్లాకే చెందిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా త్వరలోనే టీఆర్ఎస్లో చేరేందుకు ఏర్పా ట్లు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు ఇదే జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, ఓ మాజీ ఎమ్మెల్యే కూడా చేరికల వరుసలో ఉన్నట్లు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులు సైతం టీఆర్ఎస్ ప్లీనరీలోగా గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంటున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఒకరిద్దరు నేతలు కూడా టీఆర్ఎస్ గూటికి చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. ‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే’ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామి కావాలనే ఆకాంక్షతోనే టీఆర్ఎస్లో చేరినట్లు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చెప్పారు. తన నియోజకవర్గం అభివృద్ధికి కూడా సీఎం హామీ ఇచ్చారని, తన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం తనకు ప్రధానమని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజె క్టులను పూర్తి చేయడానికి సీఎం కేసీఆర్ చూపిస్తున్న చొరవ తనను ఆకర్షించిందన్నారు. తన తండ్రి నర్సిరెడ్డి కూడా నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలని కోరుకున్నారని, భీమా ప్రాజెక్టు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తన సోదరి డీకె అరుణ రాజకీయం వేరని, తన రాజకీయం వేరని వ్యాఖ్యానించారు. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
-
వైరానికి రాం..రాం!
ఉత్తర దక్షిణ ధ్రువాలు ఒక్కటయ్యాయి. కొన్నేళ్లుగా ఒకరికొకరు ఎడమొహం పెడమొహంగా ఉన్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు కలిసిపోయారు. వీరిద్దరి పేర్లలో మొదటి రెండక్షరాలను నిజం చేస్తూ.. తమ కలయికతో వర్గపోరుకు చరమగీతం పాడామనే సంకేతాన్ని పంపించారు. శనివారం మాజీ మంత్రి కమతం రాంరెడ్డి, పీసీసీ కార్యదర్శి టి.రాంమోహన్రెడ్డిల భేటీ పరిగిలో చర్చనీయాంశంగా మారింది. శనివారం పరిగిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం అనంతరం కమతం రాంరెడ్డిని తమ ఇంటికి రావాలని రామ్మోహన్‌రెడ్డి ఆహ్వానించారు. దీంతో ఆయన నేరుగా రాంమోహన్‌రెడ్డి ఇంటి వెళ్లారు. గత ఏడేళ్లుగా ఒకే పార్టీలో ఉంటూ ప్రత్యర్థులుగా వ్యవహరిస్తూ వస్తున్న వీరు ఒక్కసారిగా కలిసిపోవటం కాంగ్రెస్ కార్యకర్తల్లోనే కాకుండా నియోజకవర్గానికి చెందిన అన్ని పార్టీల నాయకుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఏ రోజూ రాంమోహన్‌రెడ్డి గడప తొక్కని రాంరెడ్డి.. ఆ వర్గానికి చెందిన కార్యకర్తలు సైతం ఆయనను అనుసరించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నప్పటికీ.. టికెట్ ఎవరికి వచ్చినా ఇద్దరం కలిసీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మిగతా పార్టీలతో పోలిస్తే అధికంగా ఉన్నప్పటికీ సొంత పార్టీలో కుమ్ములాటలు, వర్గపోరులాంటి సమస్యలతో ఇన్నాళ్లూ ఎమ్మెల్యే పదవిని ఇతరులు ఎగరేసుకుపోయారు. ఎన్నికల వేళ ఒక్కసారిగా ఇద్దరు ప్రధాన నేతలు కలవటంతో అటు కాంగ్రెస్ కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇటు ఇతర పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయితే వీరి చెలిమి ఏ మేరకు కొనసాగుతుందో వేచి చూడాల్సిందేనని గుసగుసలు మొదలయ్యాయి. -
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదు
పరిగి, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరని ప్రభుత్వ విప్ అనిల్ అన్నారు. సోమవారం ఆయన పీసీసీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డితో కలిసి పరిగిలో విలేకరులతో మాట్లాడారు. సీఎంతోపాటు సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అది సాధ్యంకాదని వెల్లడించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం మాత్రమేనని, అధిష్టానం కాదని పేర్కొన్నారు. తెలంగాణ టీడీపీ నాయకులు చంద్రబాబును వదిలించుకుని బయటపడాలని సూచించారు. తెలంగాణలో ఆ పార్టీకి నూకలు చెల్లాయని, సీమాంధ్రలోనూ ఆదరణ కరువైందని చెప్పారు. తెలంగాణ విషయంలో బాబుకు స్పష్టతలేదని, సమన్యాయం అంటే ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆరే కలిపేస్తానన్నారు.. తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ను కేసీఆరే కాంగ్రెస్‌లో కలిపేస్తానన్నారని అనిల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, పార్టీ విలీన అంశాన్ని కేసీఆర్ విజ్ఞతకే వదిలేశామని వెల్లడించారు. పరిగిలోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు. పీసీసీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియా గాంధీకి కేసీఆర్ కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకపోవటం దారుణమన్నారు. సమావేశంలో ఎన్ఆర్ఐ భరత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బి.నారాయణ్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, బిచ్చయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.