నా ఇంటి నుంచి వెళ్లిపో..! | Ram Mohan Reddy on DK Aruna | Sakshi
Sakshi News home page

నా ఇంటి నుంచి వెళ్లిపో..!

Published Wed, Aug 16 2017 1:21 AM | Last Updated on Tue, Sep 12 2017 12:09 AM

Ram Mohan Reddy on DK Aruna

సోదరి డీకే అరుణపై ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం
ధన్వాడ: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ, ఆమె సోదరుడు, మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. తమ తండ్రి దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇంటికొచ్చిన అరుణను చూసి రామ్మోహన్‌రెడ్డి కోపోద్రిక్తుడయ్యారు. ‘‘ముందు నా ఇంటి నుంచి వెళ్లిపో’’అని అరుణనుద్దేశించి వ్యాఖ్యానించారు.

మంగళవారం చిట్టెం నర్సిరెడ్డి, ఆయన తనయు డు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా ధన్వాడ మండలంలోని నర్సిరెడ్డి ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. డీకే అరుణ కుటుంబ సభ్యులతో కలసి రామ్మోహన్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లారు. రామ్మోహన్‌రెడ్డి.. అరుణను చూసి తన ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ గొడవకు దిగారు.  తన అనుమతి లేకుండా ఎవరినీ ఇంట్లోకి రానివ్వొద్దంటూ స్థానిక ఎస్‌ఐకి హుకుం జారీ చేయడం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement