శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇంటిదొంగలు అరెస్ట్
హైదరాబాద్: బంగారం స్మగ్లింగ్‌లో స్మగ్లర్లకు సహకరిస్తున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇంటిదొంగల గుట్టురట్టయింది. జీఎంఆర్ సంస్థ తరపున విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులు భాస్కరరెడ్డి, రామ్నాయుడుని డీఆర్ఐ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం వారని తమ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 8 కేజీల బంగార బిసెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు.
ఈ సందర్భంగా అతడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. విదేశాల నుంచి నగరానికి బంగారం స్మగ్లింగ్ చేసేందుకు జీఎంఆర్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు భాస్కరరెడ్డి, రామ్‌నాయుడు సహాకరిస్తున్నారని సదరు ప్రయాణికుడు ఉన్నతాధికారులకు వెల్లడించారు. అంతేకాకుండా ఇలా బంగారం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నందుకు రూ. 20 లక్షలు వివిధ రూపాలలో వారికి అందజేస్తున్నట్లు తెలిపాడు.
దాంతో వారిద్దరిపై జీఎంఆర్ సంస్థకు ఫిర్యాదు చేశారు. దీంతో భాస్కరరెడ్డి, రామానుజంపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు తమ నేరాన్ని ఒప్పుకోవడంతో వారిని అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు.