Rama chandraiah
-
చంద్రబాబు చేసేది మేడిపండు పాలన
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో మేడిపండు పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రామచంద్రయ్య విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం లగ్జరీ, ఆడంబారాలకు పోతున్నారని మండిప్డడారు. దుబారా ఖర్చులకు పోయి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తెలుగుదేశం అధికారం లోకి వచ్చిన తరువాత సుమారు లక్షాముప్పై వేల కోట్లు అప్పుచేశారని, వాటి వివరాలు కూడా ప్రజలకు ఇవ్వడం లేదని ఆయన విర్శించారు. చంద్రబాబు విచ్చలవిడిగా, విశృంఖలంగా ఖర్చు చేస్తున్నాడని, రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు, అతని కుటుంబానికేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాపట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పగలు రాత్రి అని తేడా లేకుండా ప్రజలను తాగించి తద్వారా ఆదాయాన్ని పొందుతున్నారని విమర్శించారు. అధికారం చేపట్టి నేటికి నాలుగేళ్ళు అవుతున్నా ఒక్క శ్వేత పత్రం విడుదల చేయలేదని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. -
బాబు అసమర్థత వల్లే రాష్ట్రానికి అన్యాయం
మండలిలో నిప్పులు చెరిగిన విపక్ష నేత రామచంద్రయ్య సాక్షి. హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థతే కారణమని శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య దుయ్యబట్టారు. బుధవారం మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్లో రాష్ట్రానికి న్యాయం జరగలేదని స్వయానా ముఖ్యమంత్రే వెల్లడించారని గుర్తు చేశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో కొన్ని శాఖలకు సగానికిపైగా నిధులు తగ్గించారని, ఇలా అయితే రానున్న కాలంలో రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటుందని చెబుతూ పలు పథకాలకు సంబంధించి నిధుల గణాంకాలు వివరించారు. విభజన కారణంగా తలెత్తిన అసమానతలు ఏమైనా ఉంటే వాటిని తొలగించేందుకు ఎలాంటి సవరణలు తీసుకొచ్చినా కాంగ్రెస్ మద్దతిస్తుందన్నారు. -
ఆర్డీఎస్ ఎత్తు పెంపును అడ్డుకోవాలి
కోసిగి రూరల్: రాజోలి బండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ఎత్తును పెంచకుండా రాష్ట్ర ప్రజాప్రతినిధులు అడ్డుకోవాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య కోరారు. కోసిగి మండలం అగసనూరు సమీపంలోని ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తును పెంచే పనులను కర్ణాటక ప్రభుత్వం ఇటీవల చేపట్టడంతో మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అడ్డుకున్నారు. ఆ ప్రాంతాన్ని శనివారం రామచంద్రయ్యతో పాటు సంఘం జిల్లా అధ్యక్షుడు బీజీ మాదన్న, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అజ య్ సందర్శించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం సీడబ్ల్యూసీ అనుమతి లేకుం డా ఆర్డీఎస్ ఎత్తును పెంచడానికి వీలు లేదన్నారు. ఆర్డీఎస్ ఎత్తును అర అడు గు మేరకు పెంచితే దిగువనున్న కర్నూ లు, కడప జిల్లాల రైతులకు తాగు, సా గునీటి సమస్యలు ఎదురవుతాయన్నారు. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు కలిసి ఆర్డీఎస్ ఎత్తు పెంపకంపై న్యాయమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్డీఎస్ను సందర్శించిన వారిలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గిడ్డయ్య, రైతు సంఘం ఉపాధ్యక్షుడు సత్యన్న, సీపీఐ కోసిగి మండలం నాయకులు పాల్గొన్నారు.