సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో మేడిపండు పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రామచంద్రయ్య విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం లగ్జరీ, ఆడంబారాలకు పోతున్నారని మండిప్డడారు. దుబారా ఖర్చులకు పోయి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తెలుగుదేశం అధికారం లోకి వచ్చిన తరువాత సుమారు లక్షాముప్పై వేల కోట్లు అప్పుచేశారని, వాటి వివరాలు కూడా ప్రజలకు ఇవ్వడం లేదని ఆయన విర్శించారు.
చంద్రబాబు విచ్చలవిడిగా, విశృంఖలంగా ఖర్చు చేస్తున్నాడని, రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు, అతని కుటుంబానికేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాపట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పగలు రాత్రి అని తేడా లేకుండా ప్రజలను తాగించి తద్వారా ఆదాయాన్ని పొందుతున్నారని విమర్శించారు. అధికారం చేపట్టి నేటికి నాలుగేళ్ళు అవుతున్నా ఒక్క శ్వేత పత్రం విడుదల చేయలేదని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment