Ramaiah varla
-
వర్ల రామయ్యా.. వర్గ రామయ్యా..?
ఉవల్లూరుపాలెం టీడీపీలో భగ్గుమన్న విభేదాలు రామయ్య తీరుపై నేతల ఫైర్ సీఎంకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక వల్లూరుపాలెం(తోట్లవల్లూరు) : టీడీపీలో గ్రూపులను పెంచి పోషిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు, విధానాలకు పామర్రు నియోజకవర్గం ఇన్చార్జి వర్ల రామయ్య తూట్లు పొడుస్తున్నారని ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామయ్య నుంచి పార్టీని కాపాడేందుకు, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేం దుకు అవసరమైతే సీఎంను కలవడంతోపాటు ఆందోళనకు వెనుకాడేదిలేదని వారు హెచ్చరించారు. మండలంలోని వల్లూరుపాలెంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్, మండల జన్మభూమి కమిటీ సభ్యుడు చెన్నుపాటి పూర్ణచంద్రరావు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పక్కా గృహాల మంజూరు కోసం సర్పంచ్, ఎంపీటీసీ, జన్మభూమి కమిటీ సభ్యులు, అధికారులు కలిసి జాబితా రూపొందిస్తే కాదని, ఒకే ఒక వ్యక్తి సంతకంతో ఉన్న జాబితా ఆమోదం పొందుతుండటం హాస్యాస్పదమన్నారు. గ్రామగ్రామాన రామయ్య గ్రూపులను ప్రోత్సహిస్తుండటంతో అధికారపక్షంలోనే పోరాటం చేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు చెన్నుపాటి స్వరూపరాణి మాట్లాడుతూ చంద్రబాబు స్ఫూర్తికి విరుద్ధంగా రామయ్య వ్యవహరిస్తున్నారన్నారు. పీఏసీఏస్ అధ్యక్షుడు ఆచంట కోటేశ్వరరావు(కోటిబాబు) మాట్లాడుతూ వర్ల రామయ్య కాస్తా వర్గ రామయ్యగా మారారని ఆరోపించారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు మిక్కిలినేని పాండురంగారావు, మాజీ అధ్యక్షుడు అరవపల్లి వెంకట మోహన్‌రావు, చిట్టిబొమ్మ శివరావు, చిగురుపాటి కృష్ణమూర్తి, బడుగు వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు. -
టీడీపీ జిల్లా ఇన్చార్జ్గా వర్ల రామయ్య
తిరుపతి సీటీ : చిత్తూరు జిల్లాకు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్గా కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యను నియమించారు. సోమవారం విజ యవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర టీడీపీ కార్యవర్గ సమావేశంలో నారా లోకేష్ వర్ల రామయ్యను ఇన్చార్జిగా నియమించారు. ఆయన చిత్తూరు జిల్లాతో పాటు కర్నూలు జిల్లాకూ ఇన్చార్జిగా వ్యవహరిస్తారు. ఈయన ప్రస్తుతం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. వర్ల రామయ్య 2009 ఎన్నికల సమయంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. జిల్లాపై ఆయనకు అవగాహన ఉండడంతో ఈ మేరకు నియమిం చినట్లు తెలిసింది. జిల్లాలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరును పరిశీలించనున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయాన్ని పర్యవేక్షిం చనున్నారు. -
వర్ల రామయ్యను తక్షణమే అరెస్ట్ చేయాలి
గాంధీనగర్ : టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రభుత్వాన్ని మోసగించి పేద దళితులకు కేటాయించే స్థలాన్ని అక్రమంగా పొందారని దళిత, క్రైస్తవ సంఘాల రాష్ట్ర నాయకుడు కామా దేవరాజు అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఆయన మంగళ వారం విలేకరులతో మాట్లాడారు. వర్ల రామయ్య 1983లో విజయవాడలో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేశారన్నారు. ఆ సమయంలో పేద దళితుడినని చెప్పుకుని విద్యాధరపురం ఒకటో వార్డులో ఎన్టీపీఎస్ నం. 387/23పి, ఎల్పీ నం.14/83, ప్లాట్ నం. 20 నందు 253 చదరపు గజాలు స్థలాన్ని అక్రమంగా పొందారన్నారు. తాను సమాచార హక్కు చట్టం ద్వారా సంబంధిత అధికారులను వివరాలు కోరగా, పేద దళితులకు కేటాయించే ఇంటి స్థలాన్ని 1983లో ఆయన పేరుతో పొందినట్లు అధికారులు ధ్రువీకరించి ఇచ్చారన్నారు. నిబంధనల ప్రకారం ఏ దళితుడికైనా కేవలం 90 చదరపు గజాల లోపు ఇళ్ల స్థలం కేటాయిస్తారన్నారు. రామయ్య తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని, దళితుడినని చెప్పుకుని ఇంటి స్థలం పొందడమే కాకుండా పక్కన ఉన్న పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి ఆలయం నిర్మిం చారన్నారు. తన కుమారుడి పేర ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆల యంలో వచ్చే ఆదాయాన్ని తన సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై కోర్టులో కేసు దాఖలు చేసినట్లు చెప్పారు. దీనికి స్పందించిన కోర్టు ఈనెల 13న దానిపై విచారణ చేపట్టాలని భవానీపురం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ను ఆదేశించినట్లు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 25న భవానీపురం పోలీసులు వర్ల రామయ్యపై ఎఫ్ఐఆర్ నం. 202/2015తో సెక్షన్ 405, 420 కింద కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో వర్ల రామయ్యను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోలీసులపై వత్తిడి తెచ్చి కేసును తారుమారు చేయించే అవకాశం ఉందన్నారు. త్వరలో కలెక్టర్‌ను కలిసి వర్ల రామయ్య అక్రమంగా స్థలం పొందడం గురించి వినతి పత్రం అందజేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కాలే పుల్లారావు, ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి టి.సుందర్ ప్రసాద్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కల్పనతో వర్ల వాదన
పాఠశాల భవన ప్రారంభోత్సవంలో ఘటన ప్రభుత్వ కార్యక్రమంలో మీకేం పని అని ప్రశ్నించిన ఎమ్మెల్యే మొవ్వ,(కూచిపూడి) : ప్రభుత్వ కార్యక్రమంలో టీడీపీ నేతల హల్చల్ కొనసాగుతూనే ఉంది. ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మొవ్వ జేజేనగర్లో రూ.16.70లక్షల ఎస్ఎఫ్ఏ నిధులతో నిర్మించిన పాఠశాల భవన ప్రారంభోత్సవంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ సాక్షిగా గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కల్పనతో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వర్ల రామయ్య వాగ్వాదానికి దిగారు. ఉదయం 9గంటలకు భవనాన్ని ప్రారంభించాల్సిన జెడ్పీ చైర్పర్సన్ అనూరాధ మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు. కాలాతీతంకావడంతో ముందుగా భవనాన్ని ప్రారంభించాలని అనురాధను రామయ్య కోరారు. సభా సంప్రదాయం ప్రకారం ముందుగా అతిథులను ఆహ్వానించిన అనంతరమే భవనాన్ని ప్రారంభించాలని ఎంఈవో బి. కోటేశ్వరరావుకు ఎమ్మెల్యే సూచించారు. రామయ్య కల్పించుకుని ముందుగా భవన ప్రారంభానికి ఏర్పాటు చేయాలని ఎంఈవోకు చెప్పారు. ఎమ్మెల్యే ఆగ్రహించి ప్రభుత్వ కార్యక్రమంలో ‘మీకేం సంబంధం’ అంటూ ఆయనను ప్రశ్నించారు. అతిథులు కల్పించుకుని సర్ధిచెప్పడంతో వివాదం సర్దుమణిగింది. అతిథులను ఆహ్వానించిన తర్వాతనే పాఠశాల భవనం ప్రారంభించారు. తొలుత పాఠశాల విద్యా కమిటీ అతిథులను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన బ్యానరులో వర్ల రామయ్య పేరు చేర్చటంపై ఎస్ఎంసీ చైర్మన్ పసుమర్తి కృష్ణమూర్తిపై కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించటంతో వాటి ఏర్పాటులో తమ ప్రమేయం ఏమీ లేదని ఎంపీడీవో, ఎంఈవో వివరించారు.