టీడీపీ జిల్లా ఇన్‌చార్జ్‌గా వర్ల రామయ్య | Ramaiah varla as the district is in charge of TDP | Sakshi
Sakshi News home page

టీడీపీ జిల్లా ఇన్‌చార్జ్‌గా వర్ల రామయ్య

Published Tue, Oct 27 2015 1:53 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

టీడీపీ జిల్లా ఇన్‌చార్జ్‌గా వర్ల రామయ్య - Sakshi

టీడీపీ జిల్లా ఇన్‌చార్జ్‌గా వర్ల రామయ్య

తిరుపతి సీటీ : చిత్తూరు జిల్లాకు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌గా కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యను నియమించారు. సోమవారం విజ యవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర టీడీపీ కార్యవర్గ సమావేశంలో నారా లోకేష్ వర్ల రామయ్యను ఇన్‌చార్జిగా నియమించారు. ఆయన చిత్తూరు జిల్లాతో పాటు కర్నూలు జిల్లాకూ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. ఈయన ప్రస్తుతం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు.

వర్ల రామయ్య 2009 ఎన్నికల సమయంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. జిల్లాపై ఆయనకు అవగాహన ఉండడంతో ఈ మేరకు నియమిం చినట్లు తెలిసింది. జిల్లాలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల పనితీరును పరిశీలించనున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయాన్ని పర్యవేక్షిం చనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement