ramakka
-
‘బాణీ’ అదే...‘వాణి’ వేరే..! పార్టీల ప్రచారంలో మార్మోగుతున్న ‘రామక్క పాట’
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఈ క్రమంలో అందరి దృష్టిని మాత్రం ఓ పాట ఆకర్షిస్తోంది. అన్ని పార్టీల వారికీ అదేపాట అక్కెరకొస్తోంది. ఆ పాట పల్లవి మాత్రం ఒక్కటే. కానీ సరిగ్గా వింటే అందులో ఉన్న పదాలు మాత్రం ఆయా పార్టీలకు చెందినవిగా ఉంటాయి.. శ్ఙ్రీనడువు నడువు నడవవే రామక్క.. కలిసి నడుము కట్టవే రామక్క...! శ్రీశ్రీ అంటూ హోరెత్తుతున్న ఈ పాటను మొదట గులాబీ పార్టీ బీఆర్ఎస్ రూపొందించింది. అయితే ఈ పాట జనంలోకి బాగా కనెక్ట్ కావడంతో ఇదే పల్లవి, ఇదే బాణీతో హస్తం పార్టీ, కమలం పార్టీలు కూడా ఆ చరణాలను మార్చి ఆ పాటకు తమ పార్టీలకు అనుగుణంగా పదాలను కూర్చి సరికొత్తగా పాటల్ని రూపొందించాయి. ఎన్నికల సమయం కావడంతో అన్ని పార్టీల ప్రచార రథాలలోని మైకుల్లో ఈ పాటలు మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో పార్టీల వారీగా దరువులు కొనసాగుతుండగా ఇక ఈ శ్ఙ్రీరామక్క పాటశ్రీశ్రీ వీధి వీధిలో మార్మోగిపోతోంది. ఎన్నికల ప్రచార సమయం కావడంతో ఈ పాట వినిపించగానే జాగ్రత్తగా వింటున్నారు. ఈ పాట ఏ పార్టీకి చెందినదో గుర్తిస్తున్నారు. ఆయా పార్టీల వారు కూడా తమ ప్రచార రథంలో తమ పార్టీకి బదులు ఎదుటి పార్టీ పాటను పెట్టి అవకాశం ఉండడంతో జాగ్రత్త వహిస్తున్నారు. ఆయా పార్టీలకు చెందిన హామీలు, పథకాలు, అభ్యర్థుల గుణగణాలను వర్ణిస్తూ ఇదే పల్లవితో కూడిన పాట అదే బాణీలో ప్రచారంలో అన్ని పార్టీలకు మార్మోగిపోతుండడం గమనార్హం. ఇక కొంతమంది నాయకులు అన్ని పార్టీలకు తమ గాత్రాన్ని అందిస్తుండడంతో పాటను జాగ్రత్తగా వింటే గాని ఏ పార్టీకి చెందినదో తేల్చుకోలేక పోతున్నారు. శ్రోతలైన ఓటర్లు ఇక ఆయా పార్టీల నాయకులు తమ ప్రచారం కోసం లేదా పార్టీ బహిరంగ సభలు, మీటింగ్‌ల కోసం కూలీ లెక్కన జనాన్ని తరలిస్తుండడంతో ఒకరోజు ఈ పార్టీ కండువా వేసుకొని స్టెప్పులు ఇస్తే.. మరోరోజు మరోపార్టీ పాటకి డ్యాన్సులు వేస్తున్నారు. ఇక కూలీ కూడా అధికంగా ఉండడంతో పాటు భోజన సదుపాయం కూడా ఆయా రాజకీయ పార్టీల నాయకులు అందిస్తున్నారు. సభలు, సమావేశాలు, బహిరంగ సభలకు వెళ్లే దినసరి కూలీల వారికి ఇది ఉపాధి అవకాశంగా మారిందని అంటున్నారు. ఇవి చదవండి: ఆదివాసీ బిడ్డ అశోక్‌ను ఎందుకు మార్చామంటే..? : రేవంత్‌రెడ్డి -
మనసున్న మారాజులు
గుమ్మఘట్ట: రామక్క వేదనాభరిత జీవనం చూసి చలించిన దాతలు ఆదుకునేందుకు ఆమె స్వగ్రామం కలుగోడుకు క్యూ కడుతున్నారు. మేమున్నామంటూ ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. బుధవారం అనంతపురం మునిరత్నం ట్రావెల్స్ శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్‌సెల్ నేత ఉమాపతి, సోమశేఖర్‌రెడ్డి, వీరయ్య, వీరాస్వామిలతో పాటు వాణి ట్రావెల్స్ శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, మహాలక్ష్మి టెక్స్టైల్స్, కేసరి ఎలక్ట్రికల్స్‌కు చెందిన వారంతా కలుగోడుకు చేరుకుని రామక్క కుటుంబాన్ని పరామర్శించారు. వారికి రూ.20 వేల నగదుతో పాటు ఓ టీవీ, రూ. 30 వేలు విలువ చేసే కిరాణ సరుకులు, దుస్తులు, రెండు క్వింటాళ్ల బియ్యం, చీరలు, ప్లాస్టిక్ సామాన్లు, పిల్లలకు ఉపయోగపడే బ్యాగులు, పెన్నులు, షూ అందించారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని చూసి చలించి పోయామని.. అవసరమైన ప్రతి సారీ తమకు ఫోన్ చేస్తే సహాయం చేసేందుకు ముందుంటామని భరోసా కల్పించారు. నగదును మునిరత్నం ట్రావెల్స్ శ్రీనివాసులు మిత్రుడైన ఓ తహసీల్దార్ అందించారు. మారుమూల గ్రామంలో ఆకలితో అలమటిస్తున్న ఈ పేద కుటుంబాన్ని వెలుగులోకి తెచ్చి.. వారికి అండగా నిలిచిన ‘సాక్షి’ యాజమాన్యం, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రామక్కకు అందుతున్న సహాయాన్ని చూసి గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.హిమశైల, రాయదుర్గం మార్కెట్‌యార్డ్ అధ్యక్షుడు ఎస్కే మల్లికార్జున, కార్యాలయ సిబ్బంది గంగాదేవి, కె.రామ్‌ప్రసాద్‌రావ్, రాయదుర్గం సెక్రెటరీ ఎం.ఆనంద్, రాయదుర్గం కార్యాలయ సిబ్బంది కలుగోడుకు చేరుకుని రామక్క కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రూ. 10 వేల నగదు, క్వింటా బియ్యం, చీరలు, రాగులు, జొన్నలు, చక్కెర ఇతర నిత్యవసర సరుకులు అందజేశారు. నగదు, దుస్తులు ఇతర సరుకులు అందజేస్తున్న మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు.. రామక్క దీనస్థితిని తెలుసుకునేందుకు కలెక్టర్ వీరపాండియన్, కళ్యాణదుర్గం ఆర్డీఓ ఆదేశాల మేరకు బుధవారం గుమ్మఘట్ట ఆర్ఐ విజయ్‌కుమార్, వీఆర్వోలు అనుమేష్, నాగరాజులు విచారణ చేపట్టారు. ఎలాంటి సాయం కావాలో చెప్పాలని రామక్కను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా ఆదుకునేలా ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. రామక్క పడుతున్న కష్టాలను గ్రామస్తులు.. అధికారులకు వివరించారు. ఫోన్లో ధైర్యం చెప్పిన ఎన్ఆర్ఐలు.. రామక్క దీనస్థితిని ‘సాక్షి’ కథనంతో తెలుసుకున్న మన రాష్ట్రానికి చెందిన కొందరు ఎన్ఆర్ఐలు నేరుగా రామక్కకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో ఖాతాలో నగదు జమచేస్తామని.. పిల్లల కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంతమంది తనకు అండగా నిలవడంపై రామక్క సంతోషం వ్యక్తం చేశారు. -
పేగుబంధం కలిసిన వేళ..!
ఖానాపురం: ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 30 ఏళ్ల క్రితం బిడ్డలకు దూరమైన ఓ తల్లి అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. మతిస్థిమితం సరిగ్గా లేక కనిపించకుండాపోయిన ఆ మాతృమూర్తి శుక్రవారం ఇంటికి చేరింది. ఇక ఆశలు వదులుకున్నాక.. తమ తల్లి కళ్ల ముందే కనిపించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇది కలనా.. నిజమా అని తల్లిని హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండి రామక్క, వెంకటయ్య దంపతులకు కుమార్తెలు పద్మ, యశోద, కుమారుడు బండి కృష్ణ ఉన్నారు. వారిలో పద్మ, కృష్ణ ఖానాపురంలోనే నివాసం ఉంటున్నారు. రామక్క మతిస్థిమితం కోల్పోయి ఇంటి వద్ద ఉండేది. ఈ క్రమంలో ఒకరోజు ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఇక కుటుంబ సభ్యులు కూడా ఆశలు వదులుకున్నారు. ఇలా ఆమె అదృశ్యమై ముప్పై ఏళ్లు గడిచిపోయాయి. అయితే.. రామక్క రోడ్డు పక్కన మతిస్థిమితం కోల్పోయి ఉండగా మహారాష్ట్రలోని సేవా సంకల్ ఆశ్రమ నిర్వాహకులు చేరదీశారు. ఆ తర్వాత ముంబైలోని శ్రద్ధ ఫౌండేషన్ బాధ్యులు తీసుకొచ్చి వైద్యం చేయించారు. దీంతో కోలుకున్న రామక్క వివరాలను కనుక్కునే క్రమంలో తన తల్లిగారి గ్రామం వరంగల్ జిల్లా కోరుకొండపల్లి అని చెప్పింది. దీంతో ఫౌండేషన్ ప్రతినిధులు రహెన్, సురేఖ, ప్రదీప్, నితీష్, గణేష్ ఆమెను గురువారం ఉదయం కేసముద్రం మండలం కోరుకొండపల్లికి తీసుకొచ్చారు. అయితే.. రామక్క కుటుంబ సభ్యులు వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురంలో ఉంటారని చెప్పడంతో వారు తిరిగి అంబులెన్స్‌లోనే వరంగల్‌కు వెళ్లారు. శుక్రవారం గూగుల్ మ్యాప్ సాయంతో ఖానాపురం చేరుకున్నారు. గ్రామానికి వచ్చి వివరాలు సేకరించే క్రమంలో ఆమె కుమార్తె పద్మ, కుమారుడు కృష్ణ రామక్కను గుర్తించి సంభ్రమాశ్చార్యానికి లోనై బోరున విలపించారు. ఇక లేదనుకున్న తల్లి ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో ఆమెపై పడి వారు రోదిస్తున్న తీరును చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టారు. ‘మన ఇంటికి పోదాం పద బిడ్డా..’అంటూ రామక్క వారి కన్నీళ్లను తుడిచింది. తమ తల్లిని అక్కున చేర్చుకుని, అప్పగించిన శ్రద్ధ ఫౌండేషన్ బాధ్యులకు కుటుంబ సభ్యులు చేతులెత్తి నమస్కరించారు. రామక్కతోపాటు వెంకటేశ్వరమ్మ, బిందు, లక్ష్మిలను కూడా వారివారి కుటుంబాలకు అప్పగించేందుకు వెళ్తున్నట్లు ఫౌండేషన్ బాధ్యులు వెల్లడించారు. శ్రద్ధ ఫౌండేషన్ సభ్యుల కృషిని స్థానికులు అభినందించారు. -
ఉరేసుకుని వృద్ధురాలి ఆత్మహత్య
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామక్క(60) అనే వృద్ధురాలు శుక్రవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. రామక్క తన గదిలో ఉరివేసుకుని ఉండటాన్ని కుటుంబసభ్యులు ఈ రోజు ఉదయం గమనించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేంపల్లి గ్రామస్తులపై తేనెటీగల దాడి
మంచిర్యాల మండలం వేంపల్లి గ్రామంలో తేనేటీగలు ప్రజలపై అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాయి. గ్రామానికి చెందిన రామక్క, రాయమల్లు అనే దంపతులు బంగారు పోచమ్మ తల్లికి ఆదివారం మొక్కు తీర్చుకుంటున్న సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా దాడికి దిగాయి. ఈ దాడిలో సుమారు 35 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
మూడుముళ్లు కాదని..చదువులమ్మ ఒడికి
ఫలించిన కవలల కల బాల్యవివాహానికి యత్నించిన తండ్రి పెళ్లొద్దు.. చదువుకుంటామన్న బాలికలు అధికారుల చొరవతో కళాశాలలో చేరిక వారిది నిరుపేద కుటుంబం. సంతానం ఎక్కువ. వారిలో రామక్క, లక్ష్మక్క కవల పిల్లలు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివారు. మంచి మార్కులతో పాసయ్యారు. ఉన్నత చదువులు చదవాలని ఆశపడ్డారు. కటిక పేదరికాన్ని ఈదలేని ఆ తండ్రి వారికి పెళ్లిచేసి పంపేయాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లిచూపులు కూడా జరిగాయి. వారిలో రామక్కను పెళ్లికి అంతా సిద్ధమైంది. ఇదంతా చూసిన రామక్క తన లక్ష్యం కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పెళ్లి ఇష్టం లేదని, చదువుకుంటామని తల్లిదండ్రులను ఎదిరించింది. ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. ఎట్టకేలకు ఆ కవలల కల ఫలించింది. ఈ సంఘటన బెరైడ్డిపల్లె మండలం చిన్నపురంలో ఈనెల 4న వెలుగు చూసింది. అధికారుల చొరవతో ఇద్దరికీ ప్రభుత్వ కళాశాలలో శనివారం ఇంటర్మీడియెట్‌లో ప్రవేశం దొరికింది. పలమనేరు: చిన్నపురానికి చెందిన రాజప్పది పేద కుటుంబం. ఆయనకు ఏడుగురు సంతానం. వారిలో రామక్క, లక్ష్మక్క కవల పిల్లలు. వీరు లక్కనపల్లె హైస్కూల్లో ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణులయ్యా రు. ఒకరు 8.5. మరొకరు 6.5 పాయింట్లు సాధించి ప్రతిభ చూపారు. వారు బాగా చదవడమే ఆ కుటుం బానికి శాపమైంది. పై చదువులకు ఆర్థిక స్తోమత లేక ఇరువురికీ పెళ్లిళ్లు చేసి పంపేయాలని తండ్రి భావించాడు. దీంతో పొరుగూరికి చెందిన ఓ వ్యక్తితో ఈనెల 4న పెళ్లి చూపులు జరిగాయి. ఆ ఇద్దరు కవల పిల్లల్లో రామక్కను పెళ్లి చేసుకోవడానికి లగ్నం కుదిరింది. అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు పెళ్లికి ససేమిరా ఒప్పుకోలేదు. చదువుకుంటామంటూ తల్లిదండ్రులను బతిమలాడారు. వారు కుదరదన్నారు. దీంతో రామక్క గ్రామంలోని ఓ కాయిన్ బూత్‌లో తనకు తెలిసిన వారికి ఈ విషయం గురించి ఫోన్లో చెప్పింది. ఈ విషయం ఐసీడీఎస్ సీడీపీవో రాజేశ్వరి చెవినపడింది. దీంతో ఆమె హుటాహుటిన ఆ శాఖ పీడీ ఉషాఫణికర్, ఆర్జేడీ శారదకు సమాచారమిచ్చింది. వెంటనే గ్రామంలోని డ్వాక్రా మహిళలను వారి ఇంటి వద్దకు పంపారు. 1098 చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించారు. వీరందరూ కలసి అదేరోజు రాత్రి పది గంటల ప్రాంతంలో ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామ ఎంపీటీసీ వాసు సహకారంతో పంచాయితీ పెట్టారు. అక్కడ కూడా ఆ ఇద్దరు అమ్మాయిలు తాము చదువుకుంటామంటూ విన్నవించారు. దీంతో గ్రామస్తులంతా కలసి వారు చదువుకోవాల్సిందేనంటూ నిర్ణయం తీసుకున్నారు. ఈ భారాన్ని నెత్తినేసుకున్న సీడీపీవో తమ అధికారులతో పాటు పలమనేరులోని రోప్స్ స్వచ్ఛంద సంస్థ, చిత్తూరులోని ఐసీపీఎస్ (ఇంటిగ్రేటేడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్)తో సంయుక్తంగా వారిని కళాశాలలో చేర్పిం చేందుకు ఇన్నాళ్లుగా ప్రయత్నించారు. తిరుపతి, అనంతపురంలో ప్రయత్నించగా అప్పటికే ఇంటర్ అడ్మిషన్లు పూర్తయిపోయాయి. ఎట్టకేలకు వీరంతా జిల్లా అధికారులను సంప్రదించి స్పెషల్ కేటగిరి ద్వారా చిత్తూరులోని క్రిష్ణవేణి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శని వారం ఇద్దరినీ చేర్పించారు. అక్కడే ఎస్సీ బాలికల హాస్టల్లో సీటు ఇప్పించారు. ఇన్నాళ్లు అధికారులు పడ్డ శ్రమ ఫలించింది. ఆ ఇద్దరు కవలల ఆశ నెరవేరింది. ఇద్దరూ చదువుల తల్లి ఒడిని చేరారు.