Ramanareddy
-
నా భర్త ఎక్కడ? కన్నీళ్లు పెట్టుకున్నరమణారెడ్డి కుటుంబం
-
మళ్లీ వస్తే ఎవరినీ బతకనివ్వరు
సాక్షి, హైదరాబాద్: నలుగురు సభ్యులున్న కుటుం బం 4 కోట్ల తెలంగాణ ప్రజలను హింసిస్తోందని, ఆ నలుగురి కబంధ హస్తాల్లో పడి ప్రజలు విలవిల్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే లక్ష్యం తో కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ‘వీ టూ’కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. అత్యంత అవినీతి, నియంతృత్వ సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఈ ముదనష్టపు ప్రభుత్వాన్ని బొందపెట్టాలని, లేకపోతే ఎవరినీ బతకనివ్వరన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే డబ్బు, మద్యంతో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. విద్యాసంస్థలపై కుట్రలా..? ప్రైవేటు సంస్థలు భయపడొద్దని, విద్యాసంస్థలను బెదిరిస్తే తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు. సేవ చేయాలని ముందుకొచ్చిన విద్యా సంస్థలకు మేలు చేయకపోగా, మూసివేసేలా అణచివేత చర్య లు చేపట్టారన్నారు. విద్యా సంస్థలు పౌల్ట్రీ షెడ్డుల్లో నడుస్తున్నాయని అసెంబ్లీ సాక్షిగా నిరాధార ఆరోపణలతో సీఎం కేసీఆర్ అవమానించారని గుర్తు చేశారు. సకాలంలో ఫీజులు ఇవ్వకుండా విద్యా సంస్థలను మూసేసేలా చేశారని మండిపడ్డారు. ఆంక్షలు లేకుండా ఫీజులు డిసెంబర్ 12న మహాకూటమి ప్రమాణ స్వీకారం చేస్తుందని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఆంక్షలు లేకుండా 100% ఫీజు ఇస్తామన్నారు. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లోని 5 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బందికి రూ.5 లక్షల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు. సిబ్బందికి వసతిగృహం కోసం హౌజింగ్ స్కీంను ప్రవేశ పెడతామన్నారు. ఎలక్ట్రిసిటీ చార్జీలను కమర్షియల్ నుంచి డొమెస్టిక్‌కు తగ్గిస్తామని చెప్పారు. మున్సిపల్, ఆస్తి పన్నులను కమర్షియల్ నుంచి రెసిడెన్స్ కేటగిరీకి మార్చుతామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదని, అంతా సీఎం కనుసన్నల్లోనే ఉందని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ప్రతి 3 నెలలకోసారి సమావేశం ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలు ఉండబోవని చెప్పారు. 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని ఉద్ఘాటించారు. ఫీజు, మెస్ చార్జీలను పెంచి పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫీజు రూ.1,700 అంటే అది విద్యా వ్యవస్థను అవమానపరచడమేనన్నారు. అందరూ మరో 45 రోజులు కష్టబడి పనిచేస్తే నియంత పాలన అంతమవుతుందన్నారు. రాజకీయాల్లోని అవలక్షణాలన్నీ కేసీఆర్‌లోనే స్వపరిపాలన అంటే కేసీఆర్ కుటుంబ పాలన అయిపోయిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లోని అవలక్షణాలన్నీ ఆయనలోనే ఉన్నాయని విమర్శించారు. ఆయన వల్ల నాలుగేళ్లలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు. కేసీఆర్ తెలంగాణకు చీడ పురుగులా తయారయ్యారని మండిపడ్డారు. అందుకే ఆయనను గద్దె దింపేందుకు మహాకూటమి ఏర్పాటైందని పేర్కొన్నారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో టీఆర్ఎస్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. అలాంటి పార్టీని మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలని కోరారు. తెలంగాణ ప్రజలు చదువుకుంటే ఓట్లు వేయరని టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందుకే ఫీజులపై ఆంక్షలు పెట్టారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. తమ పిల్లలను చదివించుకోవాలని తల్లిదండ్రులు అనుకుం టే.. కేసీఆర్ మాత్రం పిల్లలు బర్లకాడికి, గొర్లకాడికి, పందుల కాడికి, చేపల కాడికి పోవాలన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అలాంటి పాలన మళ్లీ రాకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో వందల సంఖ్యలో డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రభుత్వ విధానాల వల్ల కనుమరుగయ్యాయని జేఏసీ చైర్మన్ జి.రమణారెడ్డి పేర్కొన్నారు. తమ సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అందుకే టీఆర్ఎస్ను ఓడించేందుకు, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన మహా కూటమిని గెలిపించాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ గౌరి సతీశ్, టీపీసీసీ అధికార ప్రతినిధి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చిక్కిన సేవా‘చీట్’ ఫండ్ యజమాని ?
కోదాడ : వందల మంది చిట్టీ సభ్యులను నిండా ముంచి బోర్డు తిప్పేసిన కోదాడలోని సేవా చిట్‌ఫండ్ నిర్వాహకుడు కోటేశ్వరరావును పోలీసులు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అతడి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. సోమవారం కోర్టుకు రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకొని కోదాడ స్టేషన్‌కు తీసుకొచ్చారనే విషయాన్ని తెలుసుకున్న బాధితులు వందల మంది స్టేషన్‌కు తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణారెడ్డి మాట్లాడుతూ చట్ట పరిధిలో అన్ని విషయాలను పరిశీలిస్తున్నామని, బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు. అతని వద్ద ఎంత మంది చిట్టీలు కట్టారు, ఎంత మందికి చెల్లించాలనే విషయాన్ని సేకరిస్తున్నామని, బాధితులు కూడా తమ వద్ద ఉన వివరాలను పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. సభ్యులకు చెల్లించాల్సింది సుమారు రూ.12 కోట్లు సేవాచిట్ ఫండ్ సభ్యులకు చెల్లించాల్సింది సుమారు రూ. 12 కోట్ల వరకు ఉన్నట్లు ఇప్పటి వరకు పోలీసులకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. 524 మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ సంఖ్య మరి కొంత పెరిగే అవకాశం ఉంది. ఇది కాక తెలిసిన వారి నుంచి వడ్డీలకు తెచ్చింది ఇంతకు రెట్టింపు ఉన్నట్లు సమాచారం. ఇది సివిల్ వ్యవహారం కాబట్టి వడ్డీ డబ్బుల విషయంలో పోలీసులు అంతగా దృష్టి సారించడం లేదు. కేవలం చిట్ సభ్యుల డబ్బుల విషయం మీదే ప్రధానంగా దృష్టి సారించనట్లు తెలిసింది. కుటుంబ సభ్యులందరిపై కేసులు? సేవాచిట్ ఫండ్ విషయంలో పోలీసులు ఒక్క నిర్వాహకుడిపై కాకుండా కుటుంబ సభ్యులందరి మీదా కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఇది చూసి మరే ఇతర చిట్టీల నిర్వాహకుడు.. సభ్యులను ఇబ్బంది పెట్టకుండా భయపడే విధంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం. అతని పేరుపై ఉన్న ఆస్తుల వివరాలను రాబడుతున్నట్లు తెలిసింది. చిట్ నిర్వహణలో అతనికి తోడుగా ఉన్న తమ్ముడు రమేష్, సహాయపడిన మరో ఇద్దరితో పాటు కోటేశ్వరరావు భార్య, కుమారుడు, కుమార్తెల మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులందరి పేరు మీద ఉన్న ఆస్తులను కూడా అటాచ్ చేస్తున్నట్లు తెలిసింది పలువురు ఏజెంట్లపై కూడా... సేవా చిట్‌ఫండ్‌లో సభ్యులను చేర్పించిన ఏజెంట్లపై కూడా పోలీసులు కేసులు పెట్టనున్నట్లు తెలిసింది. కోటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం.. 10 మంది ఏజెంట్లు సభ్యులను చేర్పించడంలో తనకు సహకరించారని చెప్పడంతో పోలీసులు వారిని స్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. చిట్ ఫండ్ కంపెనీకి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చూడ కుండా కేవలం కమీషన్ కోసం అమాయకులను చిట్టీలలో చేర్పించడం నేరం కాబట్టీ వీరిపై కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు అంటున్నారు. వీరిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని సమాచారం. కోటేశ్వరరావు పలురకాల వ్యాధులతో బాధపడుతుండడంతో ఆయనను వీలైంత త్వరగా కోర్టుకు రిమాండ్ చేసి ఆ తరువాత కోర్టు అనుమతితో మళ్లీ విచారణ కోసం అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నారు. అన్ని విధాలుగా విచారిస్తున్నాం సేవా చిట్‌ఫండ్ నిందితుల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నామని బాధితులకు న్యాయం చేస్తామని కోదాడ డీఎస్పీ రమణారెడ్డి తెలిపారు. కోటేశ్వరరావుతో పాటు అతని కుటుంబ సభ్యులందరి పైన ఉన్న ఆస్తులను అటాచ్ చేస్తామని చెప్పారు. ప్రజలు కూడా రిజిస్టర్ ఉన్న చిట్‌ఫండ్ కంపెనీలలో మాత్రమే చేరాలని కోరారు. కోదాడలో ఉన్న ఇతర చిట్‌ఫండ్ సంస్థల వివరాలను కూడా సేకరిస్తున్నామని, ఈ కేసు కొలిక్కి వచ్చిన తరువాత వాటిపై దృష్టి సారిస్తామన్నారు. -
రక్తదాత.. సుఖీభవ!
సందర్భం : నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం అమూల్యమైన రక్తం రోగులకు అవసరమైన మేర లభించడం లేదు. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రులకు వచ్చే వారిలో చాలా మంది రక్తం అందక మృత్యుఒడికి చేరిన సందర్భాలున్నాయి. అవసరమైన ప్రతిసారీ రక్తదానం చేసి స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తున్నారు పలువురు. మరికొందరు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ యువతలో చైతన్యం తెస్తున్నారు. సమాజ సేవలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. రక్తదానంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఐక్యరాజ్య సమితి సూచన మేరకు ప్రతి ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. - అనంతపురం మెడికల్ జిల్లాలో గర్భిణులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, రోగులకు, ఇతర ఆపరేషన్ల కోసం ఏటా 45 వేల యూనిట్ల వరకు రక్తం అవసరం. ఇందులో కేవలం 25 వేల యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటోంది. మానవతావాదులు స్పందించి రక్తదానం చేయడానికి ముందుకు వస్తే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. రక్త సేకరణ, నిల్వ ఇలా.. జిల్లాలో రక్త సేకరణకు అనంతపురం సర్వజనాస్పత్రి, కదిరి ఏరియా ఆస్పత్రి, హిందూపురం ప్రభుత్వాస్పత్రి, బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రి, జేఎన్టీయూ వద్ద ఉన్న రెడ్‌క్రాస్, పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రులకు అనుమతులు ఉన్నాయి. జిల్లా అనంతపురంలోని సర్వజనాస్పత్రితో పాటు కళ్యాణదుర్గం, తాడిపత్రి, మడకశిర, ధర్మవరం, గుంతకల్లు, గుత్తిలోని ప్రభుత్వాస్పత్రుల్లో రక్త నిల్వ కేంద్రాలున్నాయి. ఫేస్బుక్, వాట్సప్ వేదికగా ‘రక్తదాతల గ్రూప్’ దేశానికి ఉపయోగపడని శరీరం, ధనం ఎంత పెరిగినా వృథా అన్న స్వామి వివేకానందుడి స్ఫూర్తితో అనంతపురంలోని రాంనగర్‌కు చెందిన నవీన్‌కుమార్ (బీటెక్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు), మూడో రోడ్డుకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి (ఎస్కేయూలో పరిశోధక విద్యార్థి) కలిసి ‘స్వామి వివేకానంద రక్తదాతల సంస్థను ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం వీరిద్దరూ ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లో పాల్గొని ఏడు రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత తామే ఓ సంస్థను ఏర్పాటు చేసి సాయం చేయాలని భావించి ‘రక్తదాతల సంస్థ’కు జీవం పోశారు. ఫేస్బుక్, వాట్సప్ వేదికగా చేసుకుని రక్తదాతలను ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికి ఏ సమయంలో రక్తం అవసరమని సమాచారం అందినా తక్షణం సేవలో నిమగ్నమవుతున్నారు. ఇప్పటి వరకు సుమారు వెయ్యి మందికి రక్తదానం చేయించారు. రక్తదానాన్ని సామాజిక బాధ్యతగా భావించి తమ సంస్థ ఆధ్వర్యంలో కొత్తగా రక్తదాతలను చేర్చుకోవడమే కాక విద్యాసంస్థల్లో అవగాహన శిబిరాలు నిర్వహిస్తూ ఈ తరం యువతకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. 18 ఏళ్లుగా రక్తదానం అనంతపురంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన వాజిద్... చికెన్ సెంటర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇతని బ్లడ్‌గ్రూప్ ‘ఎ’ నెగిటివ్. ఈయన 18 ఏళ్లుగా రక్తదానం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, గర్భిణులు, రక్తహీనతతో బాధపడుతున్న 51 మందికి ఇతను రక్తదానం చేశారు. రక్తదానం చేశాక బాధితుల కళ్లలో సంతోషం చూస్తే ఈ జన్మకు అది చాలన్నట్లు భావిస్తానని ‘వాజిద్’ తెలిపారు. ఆపద సమాయాల్లో రక్త‘దానం’ అనంతపురంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న దానం... తన రక్తాన్ని దానం చేయడానికి సదా ముందుంటారు. ఓ వైపు శాంతిభద్రతల పరిరక్షణలో ఉంటూనే మరోవైపు సామాజిక సేవలో తరిస్తున్నారు. ఇప్పటి వరకు 25 సార్లు రక్తదానం చేశారు. ఈయనది ‘బి’ పాజిటివ్ బ్లడ్‌గ్రూప్. ఒక్కడితో ప్రారంభమై.! ఏదైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుందంటారు. దీన్ని నిజం చేశారు అనంతపురం నగర పాలక సంస్థలో మోటార్ మెకానిక్‌గా పని చేస్తున్న హనుమంతరెడ్డి. 1996 నుంచి ఇప్పటి వరకు 76 సార్లు రక్తదానం చేశారు. కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్ విభాగంలో 309 మంది కార్మికులు పని చేస్తుంటే అందులో 250 మంది రక్తదాతలే ఉన్నారు. వీరంతా హనుమంతరెడ్డి స్ఫూర్తితో రక్తదాతలుగా మారారు. ఈయన సురక్షత రక్తదాతల సంస్థ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 12 వేల మందికి ఉచితంగా రక్తాన్ని అందజేశారు. అపోహలు తొలగించుకోండి రక్తదానంపై ఉన్న అపోహలు అందరూ వీడాలి. పెద్దాస్పత్రికి రోజూ ఎంతో మంది వస్తుంటారు. కొంత మందికి రక్తం అందించలేని పరిస్థితి. కొందరు యువకులకు ఫోన్ చేయగానే వచ్చి ఇస్తున్నారు. యువత రక్తదానం చేసేందుకు ముందుకురావాలి. ఇన్నాళ్లూ విద్యాసంస్థలకు సెలవులు కావడంతో శిబిరాలు ఏర్పాటు చేయలేకపోయారు. ఇక నుంచి శిబిరాలు ఏర్పాటు చేస్తాం. – డాక్టర్ శివకుమార్, బ్లడ్‌బ్యాంక్ ఇన్చార్జ్, సర్వజనాస్పత్రి ఏ సమయంలోనైనా ఫోన్ చేయండి యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకురావాలి. సంజీవిని సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైతే తక్షణం ఫోన్ (9440476651) చేయండి. – రమణారెడ్డి, సంజీవిని స్వచ్ఛంద సంస్థ, అనంతపురం -
ఒంటరితనం భరించలేక ఆత్మహత్య
– ఉరి వేసుకొని ఆత్మహత్య రాయచోటి టౌన్: ఒంటరి తనాన్ని భరించలేక నల్లాబత్తిన రమణారెడ్డి (45) అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయచోటి పట్టణంలో చోటు చేసుకొంది. రాయచోటి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గాలివీడు మండలం గోపనపల్లె పూజారి వాండ్లపల్లెకు చెందిన నల్లాబత్తిన రమణారెడ్డి ఐదేళ్ల క్రితం పల్లె నుంచి పట్టణానికి కాపురం మార్చాడు. అప్పటికే ఆయన భార్య మృతి చెందింది. కుమారుడిని చదివించుకొనేందుకు రాయచోటికి మకాం మార్చాడు. నాలుగు సంవత్సరాల క్రితం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో రేకుల షెడ్ వేసుకొని పండ్లు, ఐస్‌క్రీమ్స్, చైనీ ఫాస్ట్‌పుడ్, పాలు, పెరుగు వంటి వస్తువులు అమ్ముకొని వచ్చే ఆదాయంతో జీవనం సాగించేవాడు. నా అనే వారు ఎవరూ లేకపోవడం, భార్య కూడా లేకపోవడం ఆయనకు తీరని వెలితిని కలిగించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి షాపు మూసిన తరువాత ఆ షాపులోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారు జామున షాపు తెరవడానికి వచ్చిన మరో వ్యక్తి తలుపులు తెరిచి చూడగా అప్పటికే రమణారెడ్డి ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.