Ramappa temple architecture
-
World Heritage Sites : ‘వారసత్వ రేసులో రామప్ప’
సాక్క్షి, వెబ్‌డెస్క్ : ద్భుతాలకు నెలవైన రామప్ప వైభవం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట నుంచి చైనాకు చేరుకుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో కొత్తవాటిని చేర్చేందుకు యూనెస్కో సమావేశాలు చైనాలో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఇండియా తరఫున 2020 నామినీగా రామప్ప ఎంపికైంది. వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు తీసుకువచ్చేందుకు ఐదేళ్లుగా ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఓ సారి చూద్దాం... -
ఇలాంటివి కుతూహలం కలిగిస్తాయి: విజయ్ దేవరకొండ
తక్కువ టైంలో దక్కిన క్రేజ్‌ను నిలబెట్టుకుంటూ ప్యాన్ ఇండియన్ లెవల్‌కు వెళ్లిపోయాడు ‘రౌడీ హీరో’ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరీ డైరెక్షన్లో లైగర్‌తో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా ఓరుగల్లు ఘనత మీద ట్విటర్లో ఒక పోస్ట్ చేశాడు. ‘చరిత్ర గురించి ఎప్పుడూ ఒక కుతూహలం ఉంటుంది. 800 సంవత్సరాల చరిత్ర, కాకతీయ సామ్రాజ్యపు వైభవపు గుర్తు రామప్ప గుడి ప్రపంచ వారసత్వ హోదా రేసులో నిలబడింది’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. అలా సొంత నేల చారిత్రక ఘనతపై తన ఆసక్తిని ప్రదర్శించాడు. Have always been very intrigued by the historic past.. The 800 year old Ramappa Temple built by the Kakatiya dynasty is now in the race for world heritage status! https://t.co/ItwPIoDdXe — Vijay Deverakonda (@TheDeverakonda) July 10, 2021 కాగా, అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలిచింది. కొత్తగా వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించేందుకు యూనెస్కో బృందం జులై 16న సమావేశమవుతోంది. రామప్ప గుడి గనుక ఈ ఘనత సాధిస్తే తెలంగాణలోనే మొట్టమొదటి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరుతుంది. జులై 24-26 మధ్య డబ్ల్యూహెచ్‌సీ కమిటీ వోటింగ్ మీదే మిగతాదంతా ఆధారపడి ఉంటుంది. చదవండి: రామప్ప గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా? -
Ramappa Temple: తుది అంకానికి వారసత్వ హోదా
సాక్షి, హైదరాబాద్: రమణీయమైన శిల్పకళతో అలరారే రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా విషయంలో మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. కోవిడ్ విలయం కారణంగా నిలిచిపోయిన తుది కసరత్తును యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) తిరిగి ప్రారంభించింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జూలై 15 నుంచి 30 మధ్య యునెస్కో హెరిటేజ్ కమిటీ భేటీ కాబోతోంది. ఇందులో సభ్యత్వం ఉన్న 18 దేశాల ప్రతినిధులు నివేదికను కూలంకషంగా పరిశీలించి ఓటు వేయనున్నారు. ఎక్కువ ఓట్లు వస్తే రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి చేరుతుంది. లేదంటే మళ్లీ నిరాశ తప్పదు. అయితే ఇప్పటివరకు జరిగిన కసరత్తులో పూర్తి సానుకూల వాతావరణమే ఏర్పడినందున, ఈ కమిటీ కూడా సాను కూల నిర్ణయమే తీసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం యునెస్కో నుంచి స్థానిక అధికారులకు సమాచారం అందింది. కమిటీ నుంచి సానుకూల నిర్ణయం వస్తే, తెలుగు రాష్ట్రాల్లో తొలి యునెస్కో గుర్తింపు పొందిన కట్టడంగా ఈ కాకతీయుల కళాసృష్టి రికార్డు సృష్టించనుంది. చదవండి: Telangana: జూన్ 15నుంచి రైతుబంధు -
రామప్ప శిల్పకళ అద్భుతం
సాక్షి, హన్మకొండ: చారిత్రక రామప్ప, భద్రకాళి ఆలయాల సందర్శన, మిషన్ కాకతీయ లో భాగంగా చేపట్టిన చెరువు పూడికతీత పనుల పర్యవేక్షణలతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వరంగల్ పర్యటన మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మంగళవారం ఉదయం గవర్నర్ దంపతులు హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా వరంగల్‌కు చేరుకున్నారు. గవర్నర్ దంపతులకు జిల్లా అధికారులు హరిత కాకతీయ హోటల్లో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వరంగల్ నగరంలో ఉన్న భద్రకాళి ఆలయాన్ని గవర్నర్ దంపతులు మొదటగా దర్శించుకున్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం మిషన్‌కాకతీయలో భాగంగా దుగ్గొండి మం డలం ముద్దనూరులోని పెద్దచెరువు, నల్లబెల్లి మండలం శనిగరం గ్రామాల చెరువుల్లో పూడికతీత పనులను పరిశీలించారు. చెరువు మట్టిని తీసుకెళ్తున్న రైతులతో స్వయంగా మాట్లాడారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయ పను ల్లో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనాలని సూచిం చారు. అనంతరం అక్కడి నుంచి రామప్ప ఆలయానికి వెళ్లారు. సాయంత్రం నగరం లోని ఖిల్లాకు చేరుకొని కాకతీయ కీర్తితోర ణాలను పరిశీలించారు. నేటి ఉదయం వేయిస్తంభాల గుడిని సందర్శించుకోవడంతో గవర్నర్ రెండురోజల పర్యటన ముగుస్తుంది. -
నా వెంటే... ఓరుగల్లు నీతి, నిజాయితీ
జస్టిస్ నర్సింహారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం వరంగల్ లీగల్ : వరంగల్ జిల్లా సాహిత్య, సాంసృ్కతిక, కళలకు నిలయమని.. రామప్ప దేవాలయ నిర్మాణ కళకు ప్రపంచంలోనే సరితూగే మరో నిర్మాణం లేదని జస్టిస్ నర్సింహారెడ్డి అన్నారు. ఇక్కడి సామాజిక సంబంధాలు, ప్రతిస్పందన లు, మానవత్వం పునాదిగా ఉంటాయని, బమ్మెర పోతన రచనల నుంచి నేర్చుకున్న నిబ ద్ధత, నిజాయితీ ఎల్లప్పుడూ తన వెంటే ఉం టాయని ఆయన పేర్కొన్నారు. పాట్నా హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్తు న్న నర్సింహారెడ్డిని జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో సోమవా రం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేదమంత్రోచ్ఛరణల నడుమ బార్ అసోసియేషన్ బాధ్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు నర్సింహారెడ్డిని సభా ప్రాంగణం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ అధ్యక్షతన సన్మాన సభ జరిగింది. సేవా కార్యక్రమాలు చేపట్టాలి న్యాయవాదులు, న్యాయమూర్తులు.. సమస్య ల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని నర్సింహారెడ్డి కోరారు. గ్రామీణ జీవన నేపథ్యం ఉన్న వ్యక్తులు సామాజిక సేవ చేయడానికి ఎక్కువగా కృషి చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. సన్మార్గంలో సంపాదించిన సొమ్ముతోనే సంతృప్తి లభిస్తుందని, అక్రమ మార్గంలో ప్రయాణం మొదలుపెడితే పతనం ఖాయమని తెలిపారు. అవసరానికి మించి ఆస్తులు ఉన్న వారు ఆకారపు, కొమురవెళ్లి వంశస్తులను ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచిం చారు. కాగా, తాను ఎక్కడికి వెళ్లినా వరంగల్ జిల్లా ఔన్నత్యాన్ని, గౌరవాన్ని పెంపొందించే లా పనిచేస్తానని, జిల్లా న్యాయవాదులకు తన సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన గుడిమల్ల రవికుమార్, బార్ కౌన్సిల్ సభ్యుడు సహోదర్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్తున్న నర్సింహారెడ్డి త్వరలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావాల ని ఆకాంక్షించారు. సమావేశంలో జిల్లా ప్రధాన జడ్జి మఠం వెంకటరమణ, అదనపు జిల్లా జడ్జిలు నర్సింహులు, కృష్ణయ్య, సాల్మన్‌రాజ్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సూరం నర్సింహస్వామి, ఓరుగంటి కోటేశ్వర్రావు, సందసాని రాజేంద్రప్రసాద్, కొలునూరి సుశీల, సుదర్శన్, ఎం.మంజుల, సురేష్, ఆశీర్వాదం, దామోదర్, వివి.గిరి, వివిధ ప్రాం తాల న్యాయవాదులు పాల్గొన్నారు.