Ramban
-
జమ్మూ కశ్మీర్ అతలాకుతలం.. ప్రకృతి విలయ తాండవం (ఫొటోలు)
-
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. వరద బీభత్సంతో భయానక వాతావరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందగా.. సుమారు 100 మందిని సహాయక బృందాలు కాపాడాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కొండ చరియలు విరిగి పడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బాగ్నా గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో ముగ్గురు మరణించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) రాంబన్ కుల్బీర్ సింగ్ ధృవీకరించారు. మృతులను మొహమ్మద్ అకిబ్ (14), మొహమ్మద్ సాకిబ్ (9), మోహన్ సింగ్ (75) గా గుర్తించారు. వీరందరూ బాగ్నా పంచాయతీ నివాసితులు.#JammuKashmir | Heavy rainfall in several parts of Bhalessa, Doda#Rainfall pic.twitter.com/8rDEyL8X3l— DD News (@DDNewslive) April 20, 2025 #Ramban | Flash floods triggered by heavy rains hit a village near the Chenab River in Dharamkund, J&K.#JammuKashmir #Dharamkund pic.twitter.com/mrcL9RX7Ja— DD News (@DDNewslive) April 20, 2025మరోవైపు.. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. సుమారు 100మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతవరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఐదేళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమై గాలులు వీయడం ఇదే మొదటిసారని పేర్కొంది.#Srinagar #Jammu National Highway is closed for traffic due to landslides & mudslides at multiple locations between Ramban and Banihal.The situation is extremely bad,as several vehicles have been damaged by landslides. Since last evening, #Banihal has received 71 mm of rainfall pic.twitter.com/zPj6hEgAl1— Indian Observer (@ag_Journalist) April 20, 2025ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. రాంబన్‌లో కొండ చరియలు విరిగిపడడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందన్నారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇక, జిల్లా అంతటా రెండు హోటళ్ళు, అనేక దుకాణాలు, నివాస నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రహదారులన్నీ బురదతో నిండిపోయాయి. మహిళలు, పిల్లలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.जम्मू कश्मीर मे बादल फटने से भयंकर तबाहीहजारों लोगों की जान पर आफतजम्मू -श्रीनगर नेशनल हाईवे भारी बारिश और लैंडस्लाइड के कारण बंद करना पड़ा हाईवे पर कीचड़ भरा मालवा आने से इसके नीचे कई गाड़ियां दब गई है#JammuKashmir #jammusrinagarhighway #landslide #rain #ramban pic.twitter.com/wH16tknzWt— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) April 20, 2025Five vehicles half buried under debris in T2 Ramban#LANDSLIDE #CLOUDBURST #ramban pic.twitter.com/ucMCDsXvRf— Gulistan News (@GulistanNewsTV) April 20, 2025Flood like situation on Jammu - Srinagar National Highway. Avoid a journey till 22 April.Most affected areas: Banihal, Panthyal, and adjacent areas. pic.twitter.com/QUpZMzx8fX— Kashmir Weather (@Kashmir_Weather) April 20, 2025 -
పీఓకే ప్రజలారా.. భారత్‌లో కలవండి
జమ్మూ/బనిహాల్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రామ్‌బాన్ నియోజకవర్గంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘‘ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడి యువత పిస్టల్, రివాల్వర్ పట్టుకోవడం వదిలేసి ల్యాప్‌టాప్ పట్టుకుంటున్నారు. కంప్యూటర్లు వినియోగిస్తున్నారు. బీజేపీకి మద్దతు పలికితే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఇక్కడ మరింత అభివృద్ధిని సాకారం చేస్తాం. ఇక్కడి అభివృద్ధిని చూసి పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రజలు సైతం భారత్‌తో కలిసిపోతే బాగుంటుంది అని ఖచ్చితంగా అనుకుంటారు. నాదీ గ్యారెంటీ’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పీఓకే ప్రజలను భారత్‌లో విలీనానికి పిలుపునిచ్చారు. ‘‘ పీఓకే ప్రజలకు నేను చెప్పేదొకటే. పాకిస్తాన్ మిమ్మల్ని విదేశీయుల్లా భావిస్తోంది. పాక్ ప్రభుత్వం స్వయంగా ఈ విషయం ఒప్పుకుందికూడా. ఇటీవల పాక్ అదనపు సొలిసిటర్ జనరల్ ఒక విషయంలో సమర్పించిన అఫిడవిట్లో పీఓకే అనేది ఎప్పటికీ పాక్‌కు విదేశీ భూభాగమే అని స్పష్టంగా పేర్కొన్నారు. మిమ్మల్ని భారత్ తన సొంత మనుషుల్లా చూసుకుంటుంది. అందుకే రండి. మాతో కలవండి’’ అని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఆపేస్తే చర్చలకు సిద్ధంజమ్మూకశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోయడం పూర్తిగా ఆపేస్తే ఆ దేశంతో చర్చలకు భారత్ సిద్ధమని రాజ్‌నాథ్ ప్రకటించారు. ‘‘ ఉగ్రవాదానికి మద్దతు పలకడం అనే చెడ్డపనిని పాక్ ఆపేయాలి. పొరుగు దేశాలతో సత్సంబంధాల మెరుగు కోసం ప్రతి దేశం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మనం మన మిత్రుడిని మార్చుకోగలంగానీ పొరుగు దేశాన్ని కాదుకదా. పాక్‌తో బంధం బలపడాలనే కోరుకుంటున్నాం. ముందుగా పాక్ ఉగ్రవాదాన్ని వీడాలి. ఉగ్రవాదాన్ని కశ్మీర్లో ఆపినప్పుడే చర్చలు పట్టాలెక్కుతాయి. ఇక్కడ ఉగ్రవాదం కోరల్లో చిక్కుకున్న వారిలో 85 శాతం మంది ముస్లింలే ఉన్నారు. ఉగ్రఘటనల్లో ముస్లింలే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఉగ్రవాదం బాటలో పయనించి ప్రాణాలు పోగొట్టుకోకండి’’ అని రాజ్‌నాథ్ హితవు పలికారు. -
సీఆర్పీఎఫ్ కాన్వాయ్ సమీపంలో భారీ పేలుడు
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో రంబన్ జిల్లాలోని బనీహల్‌లో శ్రీనగర్ హైవేపై ఓ కారులో శనివారం ఉదయం భారీ పేలుడు చోటుచేసుకుంది. దీనికి సమీపంలోనే సీఆర్పీఎఫ్కు సంబంధించిన కాన్వాయ్ ఉండటంతో ఉగ్రవాదులపనేనా అన్నకోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే కారులో సిలిండర్ లీక్ వల్లే పేలుడు చోటుచేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులలో అధికారులు ఓ అంచనాకు వచ్చారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, కొద్ది రోజుల కిందటే పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ఓ ఉగ్రవాది స్కార్పియో కారుతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. అత్యాధునిక పేలుడు పదార్థాలున్న(ఐఈడీ) తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
కాలువలో పడిన కారు : 8 మంది మృతి
జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ రామబన్ జిల్లాలో ఓ వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారని పోలీసులు వెల్లడించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మొత్తం 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం నచాలన - షేర్ బిబి ప్రాంతంలోని కాది - మోహీ వద్ద అదుపు తప్పి కాలువలో పడిందని చెప్పారు. కాలువ నుంచి కారును బయటకు తీసుకువచ్చేందు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వివరించారు.