Ramchandra Hansda
-
నేనూ.. ఓటు వేస్తా ప్లీజ్: ఎంపీ
భువనేశ్వర్: ప్రతిష్టాత్మక భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలంటూ మయూర్భంజ్ లోక్‌సభ సభ్యుడు, బిజూ జనతా దళ్ అభ్యర్థి రామచంద్ర హంసదా అభ్యర్థించారు. నవదిగంత్ చిట్‌ఫండ్ సంస్థ మోసాల్లో నిందితుడైన ఆయనకు సీబీఐ దర్యాప్తు బృందం 2014వ సంవత్సరంలో అరెస్టు చేసింది. బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానాలు నిరాకరించడంతో ఆయన స్థానిక ఝరపడా జైలులో ఖైదీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించాలని అభ్యర్థన పత్రాన్ని జైలు అధికారులకు సమర్పించారు. రామచంద్ర హంసదా దాఖలు చేసిన అభ్యర్థన పత్రాన్ని జైలువిభాగం అదనపు డీజీకి సిఫారసు చేసినట్లు జైల్ సూపరింటెండెంట్ రవీంద్రనాథ్ స్వంయి తెలిపారు. లోక్‌సభ స్పీకర్, పార్లమెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు రామచంద్ర హంసదా అభ్యర్థన పట్ల తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉందని జైల్ సూపరింటెండెంట్ తెలిపారు. -
‘శారదా’స్కాంలో బీజేడీ ఎంపీ హన్స్దా అరెస్ట్
భువనేశ్వర్: ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ స్కాంలో బీజేడీ ఎంపీ రామచంద్ర హన్స్దా, అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుబర్న నాయక్‌తో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే హితేష్ కుమార్ బగర్తిలను మంగళవారం సీబీఐ ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది. వీరిపై మోసం, నిధుల మళ్లింపు, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలు మోపింది. ఈ ముగ్గురు ‘నాబాదీగంట క్యాపిటల్ సర్వీసెస్’ అనే పొంజి (మోసపూరిత) కంపెనీకి గతంలో డెరైక్టర్లుగా పని చేసినట్లు సీబీఐ వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ అధికార బీజేడీపై విమర్శలు దిగాయి. నేరస్థులను రక్షించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించాయి. అయితే, ఈ స్కాంలో తమ ప్రభుత్వానికి ప్రమేయం లేదని సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తాజా అరెస్ట్‌ల నేపథ్యంలో ఎంపీ హన్స్దా, ఎమ్మెల్యే సుబర్ననాయక్లను బీజేడీ నుంచి సస్పెండ్ చేస్తూ నవీన్ నిర్ణయం తీసుకున్నారు.