మృత్యువులోనూ వీడని స్నేహబంధం
ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థుల మృతి
ఈ ఇద్దరు స్నేహితులను మృత్యువు ఒకేసారి మింగేసింది. కష్టాలే తోడుగా సాగిన వారి బాల్య ప్రయాణం క్షణాల తేడాలోనే ముగిసింది. ఒకరు తల్లీతండ్రి లేని అనాథ అయితే.. మరొకరిది కడుపేద కుటుంబ నేపథ్యం. ఇద్దరూ ఈతకు వెళ్లి మరిక తిరిగి రాలేదు. మరణంలోనూ వీడని స్నేహ బంధానికి నిర్వచనం చెప్పారు. స్నేహమేరా శాశ్వతం.. అంటూ శాశ్వతంగా దూరమయ్యారు.
వూచవరం : వూచవరంలోని సెయింట్‌ఆన్స్ లయోల ప్రేమ నివాస్ హాస్టల్లో ఉంటున్న రమేష్(13), ఏసుబాబు(11) ఈతకనివెళ్లి మృత్యువు బారినపడ్డారు. వీరిద్దరిదీ వేర్వేరు తరగతులు.. వేర్వేరు గ్రామాలు.. అయితేనేం మంచి స్నేహితులు. కష్టాలే వీరిని స్నేహితులుగా చేశాయని స్థానికులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పిడుగురాళ్ల వుండలం, జూలకల్లుకు చెందిన దానియేలు, ఏసువురియువ్ము కూలిపనులు చే సేవారు. వీరికి రమేష్(13), రాజేష్ అనే ఇద్దరు కుమారులు. అనారోగ్య కారణంగా దానియేలు, ఏసువురియువ్ము నాలుగేళ్ల కిందట వుృతిచెందారు. రమేష్ గ్రావుంలో ఉన్న మేనత్త వద్ద, రాజేష్ బ్రాహ్మణపల్లిలో ఉంటున్న అవువ్ము, తాతయ్యుల వద్ద పెరుగుతున్నారు. 2010లో వూచవరంలోని సెరుుంట్ ఆన్స్ లయోల ప్రేవు నివాస్ హాస్టల్లో రమేష్ చేరాడు. హాస్టల్లో ఉంటూ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుకుంటున్నాడు.
ప్రకాశం జిల్లా, అద్దంకి వుండలం, వేలమూరిపాడు గ్రావూనికి చెందిన గోపనబోరుున సామియేలు, రాహేలు వ్యవసాయు పనులకు వెళ్తూ జీవిస్తున్నారు. వీరికి కువూరులు ఏసుబాబు(11), యోహాన్, వెంకట్, గేషంత్రాజ్. ఆర్థిక ఇబ్బందుల వల్ల పెద్ద కువూరుడు ఏసుబాబు, రెండో కువూరుడు యోహాన్ను వూచవరంలోని సెరుుంట్ఆన్స్ లయోల ప్రేవు నివాస్ హాస్టల్లో 2009లో చేర్చారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏసుబాబు 6వ తరగతి చదువుతున్నాడు.
తరగతులు వేరైనా ఏసుబాబు, రమేష్‌లు వుధ్య స్నేహబంధం ఏర్పడింది. శనివారం ఉదయుం హైస్కూల్‌కు వెళ్లిన వీరు వుధ్యాహ్నం హాస్టల్‌కు వచ్చి భోంచేశారు. ఇద్దరు స్నేహితులు సరదాగా ఈతకని హైస్కూల్ సమీపంలో ఉన్న కూర వెంకటేశ్వర్లుకు చెందిన వ్యవసాయు బావి వద్దకు వెళ్లారు. ఏసుబాబు, రమేష్ ఈతకొట్టేందుకు బావిలోకి దిగడంతో లోతు ఎక్కువగా ఉండి ప్రవూదవశాత్తు వుునిగిపోయూరు. రాత్రరుునా వారు హాస్టల్‌కు రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం పోలీసులు విచారించగా వ్యవసాయు బావి వద్ద దుస్తులు ఉన్నాయుని తెలిసింది.
గజఈతగాళ్లను బావిలోకి దించి విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. నీరుఎక్కువగా ఉండటంతో ఐదు ఆరుుల్ ఇంజిన్ మోటార్లు, అగ్నివూపక సిబ్బంది సాయుంతో నాలుగు గంటలపాటు నీటిని బయుటకు తోడారు. గజఈతగాళ్లు మొదట ఏసుబాబు మృతదేహాన్ని బయుటకు తీశారు. తర్వాత అరగంటపాటు వెతగ్గా రమేష్ వుృతదేహం కూడా లభ్యమైంది. ఈతకెళ్లి ప్రవూదవశాత్తు పడి విద్యార్థులు వుృతిచెందారని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆవుల హరిబాబు తెలిపారు. తోటి విద్యార్థులు, హాస్టల్ సిస్టర్స్ ఘటనా స్థలం వద్దకు చేరుకుని విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.