Ramesh Tilak
-
హక్కుల కోసం పోరాటం
ట్రైబల్స్ హక్కుల కోసం పోరాటం సాగించారు జర్నలిస్ట్ ఉష. మరి..ఈ పోరాటంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఎలా విజయం సాధించారు? అన్న ప్రశ్నలకు థియేటర్లోనే ఆన్సర్స్ దొరుకుతాయి. వరలక్ష్మీ శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో మనోజ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘వెల్వెట్ నగరం’. రమేష్ తిలక్, ఆరై్జ, సింగర్ మాళవిక ముఖ్య పాత్రలు పోషించారు. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో వరలక్ష్మీ జర్నలిస్ట్ ఉష క్యారెక్టర్ చేశారని కోలీవుడ్ సమచారమ్. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌కు డబ్బింగ్ కంప్లీట్ చేశారు వరలక్ష్మీ. త్వరలో రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తూనే హీరోయిన్గా చేసేందుకు కూడా స్క్రిప్ట్స్ వింటున్నారు. -
కాలమే శత్రువు
గెలవాలని ఓ టీమ్ అంతరిక్షంలోకి బయలుదేరింది. ఓడిపోతే దాదాపు 4 కోట్ల మంది ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుంది. ఆ టీమ్ ప్రధాన శత్రువు టైమ్ అంట. మరి.. గెలవడానికీ ఈ టీమ్ లీడర్ ఏం చేశాడు? అంతరిక్షంలో వాళ్లు ఎలాంటి అవరోధాలను అధిగమించాల్సి వచ్చింది? ఇటువంటి ఆసక్తికర అంశాలతో రూపొందిన తమిళ చిత్రం ‘టిక్. టిక్. టిక్’. శక్తి సుందర్ రాజన్ దర్శకత్వంలో ‘జయం’ రవి హీరోగా నటించారు. నివేథా పేతురాజ్, రమేశ్ తిలక్, అరోణ్ అజీజ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 22న విడుదల కానుంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి, చదలవాడ లక్ష్మణ్ ఈ చిత్రాన్ని ‘టిక్. టిక్. టిక్’ పేరుతోనే తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ‘‘సినిమా సెన్సార్ పూర్తయింది. ఆల్రెడీ రిలీజైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. అంతరిక్షం నేపథ్యంలో రూపొందిన ఫస్ట్ ఇండియన్ మూవీ ఇది. ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ‘బిచ్చగాడు, డీ 16’ సినిమాలను తెలుగులో రిలీజ్ చేసినప్పుడు ప్రేక్షకులు ఆదరించారు. వాటిని మించిన విలక్షణమైన చిత్రమిది’’ అన్నారు నిర్మాత చదలవాడ లక్ష్మణ్. -
కథానాయిక ముఖ్యం కాదు
చిత్రంలో నాయిక ముఖ్యం కాదు అన్నారు నటుడు విజయ్ సేతుపతి. పిజ్జా, నడువుల కొంచెం పక్కత్త కానోమ్,సూదుకవ్వుం అలా ఆది నుంచి వైవిధ్య కథా పాత్రలతో తన నటనా ప్రతిభను చాటుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విజయ్‌సేతుపతి. అలాంటి నటుడు మరో సారి 55 ఏళ్ల వృద్ధుడిగా ఆరంజ్ మిఠాయి చిత్రంలో తన నట తృష్ణను వెలిబుచ్చడానికి సిద్ధం అయ్యారు.విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి తనే నిర్మాత కావడం, బిజూ విశ్వనాథ్ చాయాగ్రహణం,దర్శకత్వం భాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో రమేశ్ తిలక్, ఆరుబాల, హర్షిత, వినోద్‌సాగర్ ముఖ్య పాత్రల్ని పొషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిర్మాణాంతర పనులతో మునిగితేలుతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్‌సేతుపతి మాట్లాడుతూ దర్శకుడు ఆరంజ్ మిఠాయ్ చిత్ర కథ చెప్పగానే బాగా నచ్చేసిందన్నారు.నిర్మాత కోసం వేటాడగా ఎవరూ దొరకలేదని, దీంతో తనే నిర్మాతగా బి, గణేశ్‌తో కలిసి నిర్మించడానికి సిద్ధం అయ్యానన్నారు.ఇందులో 55 ఏళ్ల వృద్ధుడిగా నటించానని వెల్లడించారు.ఇలాంటి పాత్రలను ఎంచుకోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నను చాలా మంది అడుగుతున్నారని, ఆ పాత్రల స్వభావం నచ్చడం,నటనకు అవకాశం ఉండడమే ముఖ్యకారణం అన పేర్కొన్నారు. ఆరంజ్ విఠాయ్ అంటూ తీయని పేరుతో ప్రప్రథంగా చిత్ర నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. చిత్రం ఆబాలగోపాలాన్ని అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిత్రంలో కథానాయిక లేదేమిటన్న ప్రశ్నకు చిత్రానికి కథ, కథనాలు ముఖ్యంగాని, కథానాయిక కాదన్నారు. చిత్రాన్ని జూలై 31న విడదల చేయడానికి సన్నాహాలు చేస్తునట్లు విజయ్‌సేతుపతి తెలిపారు.