కథానాయిక ముఖ్యం కాదు
చిత్రంలో నాయిక ముఖ్యం కాదు అన్నారు నటుడు విజయ్ సేతుపతి. పిజ్జా, నడువుల కొంచెం పక్కత్త కానోమ్,సూదుకవ్వుం అలా ఆది నుంచి వైవిధ్య కథా పాత్రలతో తన నటనా ప్రతిభను చాటుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విజయ్‌సేతుపతి. అలాంటి నటుడు మరో సారి 55 ఏళ్ల వృద్ధుడిగా ఆరంజ్ మిఠాయి చిత్రంలో తన నట తృష్ణను వెలిబుచ్చడానికి సిద్ధం అయ్యారు.విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి తనే నిర్మాత కావడం, బిజూ విశ్వనాథ్ చాయాగ్రహణం,దర్శకత్వం భాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో రమేశ్ తిలక్, ఆరుబాల, హర్షిత, వినోద్‌సాగర్ ముఖ్య పాత్రల్ని పొషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిర్మాణాంతర పనులతో మునిగితేలుతోంది.
ఈ సందర్భంగా ఆదివారం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్‌సేతుపతి మాట్లాడుతూ దర్శకుడు ఆరంజ్ మిఠాయ్ చిత్ర కథ చెప్పగానే బాగా నచ్చేసిందన్నారు.నిర్మాత కోసం వేటాడగా ఎవరూ దొరకలేదని, దీంతో తనే నిర్మాతగా బి, గణేశ్‌తో కలిసి నిర్మించడానికి సిద్ధం అయ్యానన్నారు.ఇందులో 55 ఏళ్ల వృద్ధుడిగా నటించానని వెల్లడించారు.ఇలాంటి పాత్రలను ఎంచుకోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నను చాలా మంది అడుగుతున్నారని, ఆ పాత్రల స్వభావం నచ్చడం,నటనకు అవకాశం ఉండడమే ముఖ్యకారణం అన పేర్కొన్నారు. ఆరంజ్ విఠాయ్ అంటూ తీయని పేరుతో ప్రప్రథంగా చిత్ర నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. చిత్రం ఆబాలగోపాలాన్ని అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిత్రంలో కథానాయిక లేదేమిటన్న ప్రశ్నకు చిత్రానికి కథ, కథనాలు ముఖ్యంగాని, కథానాయిక కాదన్నారు. చిత్రాన్ని జూలై 31న విడదల చేయడానికి సన్నాహాలు చేస్తునట్లు విజయ్‌సేతుపతి తెలిపారు.