rameshbabu
-
TS Election 2023: ‘ఆది’ నుంచి అదే పోరు!
రాజన్న: వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబును ‘ఆది’ నుంచి పౌరసత్వం సమస్య వెంటాడుతూనే ఉంది. కోర్టుల్లో పోరాడుతూనే 2009 నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్లు కేటాయించే అంశంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆరసైతం మొట్టమొదటగా రమేశ్‌బాబు పౌరసత్వం అంశాన్ని మాట్లాడుతూ టికెట్టు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. పౌరసత్వం కేసు కోర్టులో ఉన్నందునే వేములవాడలో అభ్యర్థిని మార్చాల్సి వస్తోందని ప్రకటించారు. బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న చల్మెడ లక్ష్మీనరసింహారావు నియోజకవర్గంలో చురుకుగా పర్యటిస్తుండగా.. రమేశ్‌బాబు అనుచరులు మాత్రం ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 జూన్‌లో కేంద్ర హోంశాఖలో ఫిర్యాదు చేశారు. ఏడాది కాలంపాటు దేశంలో లేడని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీని విచారణకు ఆదేశించింది. రమేశ్‌బాబు 96 రోజులు మాత్రమే భారతదేశంలో ఉన్నట్లు నివేదికను సమర్పించారు. 2010 ఉపఎన్నికల తర్వాత రమేశ్‌బాబు ఎన్నికను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆది శ్రీనివాస్ ఆశ్రయించారు. దీంతో 2013 ఆగస్టు 14న రమేశ్‌బాబు పౌరసత్వం రద్దు చేయడమే కాకుండా ఓటర్ జాబితాలో పేరు తొలగించాలని తీర్పినిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ రమేశ్‌బాబు 2013లో సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా.. కోర్టు స్టే ఇచ్చింది. రమేశ్‌బాబుకు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని ఆది శ్రీనివాస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ వాదనలు కొనసాగుతున్న క్రమంలో ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ తేల్చాలని రమేశ్‌బాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో ఈ అంశం కేంద్ర హోంశాఖకు వెళ్లింది. రమేశ్‌బాబు విజ్ఞప్తితో కేంద్రహోంశాఖ త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. త్రీమెన్ కమిటీ సైతం రమేశ్‌బాబు మోసపూరితంగా పౌరసత్వం పొందారని తేల్చి చెబుతూ.. ఆగస్టు 31, 2017న పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశాన్ని రివ్యూ చేయాలని మరోసారి కేంద్రహోంశాఖకు రమేశ్‌బాబు విజ్ఞప్తి చేయగా.. జర్మనీ పౌరసత్వం ఉందంటూ డిసెంబర్ 17, 2017న భారతదేశ పౌరసత్వం రద్దు చేసింది. దీనిపై రమేశ్‌బాబు జనవరి 5, 2018న హైకోర్టును ఆశ్రయించగా.. స్టే లభించింది. స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈక్రమంలో హైకోర్టు జూలై 10, 2019న రమేశ్‌బాబు పౌరసత్వాన్ని కేంద్రహోంశాఖ మూడు నెలల్లో తేల్చాలని ఆదేశించింది. కేంద్రహోంశాఖ రమేశ్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి కేసు కొనసాగుతోంది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో రెండు, మూడు నెలల్లో తీర్పు వస్తుందన్న అంచనాతో బీఆర్ఎస్ పార్టీ అధినేత టికెట్ చల్మెడ లక్ష్మీనరసింహారావుకు కేటాయించినట్లు ప్రకటించారు. నాలుగుసార్లు గెలుపు.. రమేశ్‌బాబు 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2010 ఉపఎన్నికల సందర్బంగా టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరి ఆపార్టీ టికెట్‌పై గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. భావోద్వేగ ప్రకటన.. టిక్కెట్టు రాలేదని తెలిసిన తర్వాత ఎమ్మెల్యే రమేశ్‌బాబు భావోద్వేగ ప్రకటన చేశారు. ‘సవాళ్లు వచ్చినప్పుడే ధీటుగా నిలబడాలి. ఎన్నికల కోసం అభ్యర్ధులు వెనువెంటనే పుట్టరు. ప్రజాసేవ ద్వారా ఈ అర్హతలు సంపాదించుకోవాలి. పౌరసత్వంపై అక్టోబర్‌లో మనకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ సమస్య తీరితే మనకు ఆటంకాలు ఉండవు. ఉత్తమంగా పనిచేశానన్న సీఎం గారి వ్యాఖ్యలే మన దశాబ్దకాలం నిస్వార్థ ప్రజాసేవకు నిదర్శనం.’ అంటూ భావోద్వేగంతో కూడిన పోస్టు చేశారు. -
సూదిబెజ్జంలో గాంధీజీ
గాంధీ జయంతిని పురస్కరించుకుని కాకినాడకు చెందిన ఆరిపాక రమేష్‌బాబు సూది రంధ్రంలో ఇమిడేలా 25 మిల్లీగ్రాములు బరువు, ఎత్తు 1.55 మి.మీ, వెడల్పు 0.8 మి.మీ. ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహంతో పాటు శాంతికి పునాది వేయాలనే నినాదంతో సూక్ష్మ అణుబాంబు, బుల్లెట్‌ను తయారు చేశారు. వీటిని తిలకించినవారు ఆశ్చర్యచకితులవుతున్నారు. – బాలాజీచెరువు (కాకినాడ) -
ఇల్లు అద్దెకు కావాలని పిలిచి దోపిడీ... నిందితుల అరెస్ట్
కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి): ఓ వ్యాపారిని బెదిరించి దోపిడికి పాల్పడిన ఐదుగురిని పేట్ బషీరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుచిత్ర సమీపంలోని గోదావరి హోమ్స్‌లో నివాసముండే రమేష్ బాబుకు స్థానికంగా జేకే నగర్లో మరో ఇల్లు ఇంది. ఇందులో పై పోర్షన్‌ను శర్మ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. కింది పోర్షన్ గోదాం కోసం కావాలని జూలై 16న రమేష్‌బాబును పిలిపించాడు. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులు వ్యాపారి రమేష్‌పై దాడి చేసి 3.5 తులాల బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డు తీసుకున్నారు. దాని ద్వారా రూ.50 వేలు డ్రా చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం సుచిత్ర చౌరస్తా సమీపంలో గుంటూరు జిల్లాకు చెందిన పొట్టసిరి అంకారావు అలియాస్ శర్మ (36), జలగం నాగేంద్రబాబు (24), అద్దంకి రమేష్ (30), వజ్రోజి చంద్రమౌళి (52), పొట్టసిరి చిన్న శంకర్రావు (49)ను క్రైం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తామే దోపిడీకి పాల్పడినట్లు అంగీకరించారు. వీరి నుంచి ఆభరణాలు, నగదును రికవరీ చేశారు. -
జగన్‌తోనే సంక్షేమ రాజ్యం
చల్లపల్లి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఏనాడూ విద్యుత్, గ్యాస్ ధరలు పెంచలేదని ఆయన వారసుడు, ప్రజాసంక్షేమాన్ని కాంక్షించే జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఆనాటి మంచిరోజులు వస్తాయని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు అన్నారు. చల్లపల్లి పంచాయతీ పరిధిలోని నారాయణరావునగర్‌లో మంగళవారం గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని సింహాద్రి చేపట్టారు. ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్రం గ్యాస్ ధరలను పెంచినా రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వాటిని భరించి ప్రజలపై భారం పడకుండా చూసిందన్నారు. తన పాలనలో విద్యుత్‌చార్జీలు పెంచబోనని స్పష్టం చేసిన వైఎస్ మాటతప్పలేదు, మడమ తిప్పలేదని సింహాద్రి గుర్తుచేశారు. ఆయన తనయుడు, ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకుడు జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడతారన్నారు. పార్టీ మండల కన్వీనర్ చండ్ర వెంకటేశ్వరరావు, మహిళా క న్వీనర్ వల్లూరి ఉమ, పట్లణ కన్వీనర్ వెనిగళ్ళ తారకజగదీష్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు షేక్ నజరానా, మద్దాల వీరాస్వామి, గోవాడ రాము, మశీదు కమిటీ అధ్యక్షుడు అబ్ధుల్ గఫార్, ఆరోవార్డు సభ్యుడు తోట నాగేశ్వరరావు, నాయకులు మల్లంపాటి సీతారామయ్య, ఆకుల శ్రీనివాస్, యన్నం చంద్రశేఖర్, మురాల చిన్ని పాల్గొన్నారు. తెలుగురావుపాలెంలో ఘంటసాల : మండలంలోని తెలుగురావుపాలెంలో మంగళవారం సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కిరణ్‌కుమార్ సర్కార్ తుంగలో తొక్కి ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి ఆ పార్టీతో కుమ్మకై ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రజలను వంచించిన ఆ రెండు పార్టీలకు రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పి ప్రజలకోసం పోరాడుతున్న వైఎస్సార్ సీపీని ఆదరించాలని కోరారు. పార్టీ మండల కన్వీనర్ వేమూరి వెంకట్రావ్, బీసీ కన్వీనర్ చింతా రామచంద్రరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కడవకొల్లు నరసింహారావు, స్థానిక నాయకులు తాడికొండ శ్రీను, సింహాద్రి శ్రీను, అట్లూరి శ్రీనివాసరావు, కాట్రగడ్డ శ్రీనివాస్ చక్రవర్తి, అట్లూరి రాము, రావి రాంబాబు, జాస్తి వెంకటేశ్వరరావు, వినిగళ్ళచైతన్య, పర్యతనేని రామకృష్ణ, న్యాయవాది తాడిశెట్టి రాంబాబు, వెనిగళ్ళ శ్రీధర్, మునిపల్లి నాగమల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.