ramjan gifts
-
రంజాన్‌కా తోఫా
స్టేషన్ మహబూబ్‌నగర్ : ఏటా మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిరుపేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేయనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలు అందరిలాగే రంజాన్ పర్వదినం జరుపుకోవాలనే ఉద్దేశంతో దుస్తులు పంపిణీ చేస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం కూడా జిల్లాలో 12వేల మందికి దుస్తులు అందజేయనున్నారు. ఇప్పటికే దుస్తుల ప్యాకెట్లు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. నియోజకవర్గాల వారీగా పంపిణీ రంజాన్‌ను పురస్కరించుకుని నిరుపేద ముస్లింలకు ఇచ్చే ఒక్కో ప్యాకెట్లో కుటుంబ యాజమానికి లాల్చీ, పైజమా, యజమాని భార్యకు చీర, యువతి షర్ట్, సల్వార్ ఉంటుంది. అయితే, ఇవన్నీ కూడా క్లాత్ రూపంలోఉంటాయి. ఇందులో చీర తప్ప మిగతావన్నీ కుట్టించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లాకు 12 వేల ప్యాకెట్లు చేరుకోగా జిల్లా కేంద్రంలోని ప్రీమెట్రిక్ హాస్టల్లో భద్రపరిచారు. ఇక్కడి నుంచి నియోజకవర్గాల వారీగా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు పంపిస్తున్నారు. ఈ దుస్తుల ప్యాకెట్లను మజీద్ కమిటీల ఆధ్వర్యాన ఎంపిక చేసిన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇఫ్తార్ విందులకు రూ.24లక్షలు ప్రభుత్వం తరపున అధికారికంగా ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం జిల్లాకు రూ.24లక్షలు కేటాయించారు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాలకు పంపిస్తున్నాం... దుస్తుల ప్యాకెట్లను జిల్లా కేంద్రం నుంచి నియోజకవర్గాలకు పంపిస్తున్నాం. నిరుపేద ముస్లింల ఎంపిక బాధ్యత ఆయా మసీద్ కమిటీలకు అప్పగించాం. ఇఫ్తార్ విందులకు జిల్లాకు రూ.24లక్షలు మంజూరయ్యాయి. వచ్చేనెల మొదటి లేదా రెండో వారంలో విందు ఏర్పాటు చేయనున్నాం. – వెంకటేశ్వర్లు, జిల్లా మైనార్టీశాఖ అధికారి -
రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలు, రంజాన్ కానుకలు, ఉద్యోగ నోటిఫికేషన్లకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో...మంత్రివర్గం శనివారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన 25 వేల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు, టీఎస్పీఎస్సీ పరీక్షల విధానం, అభ్యర్థుల వయో పరిమితి సడలింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలను చర్చించే అవకాశముంది. ఇక అనాథ బాలల సంరక్షణ, హాస్టల్ విద్యార్థుల సంక్షేమం, పాఠశాలల్లో పిల్లలకు కడుపు నిండా మధ్యాహ్న భోజనం పెట్టే ప్రతిపాదనలపై ఇటీవల నియమించిన మంత్రుల కమిటీ ఇచ్చిన సిఫారసులపై చర్చించి ప్రభుత్వ విధానాన్ని ఖరారు చేయనున్నారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అదనపు చెల్లింపులపై అధ్యయనానికి నియమించిన మంత్రుల సబ్‌కమిటీ ఇచ్చిన నివేదికపైనా చర్చిస్తారు. పుష్కరాలు, ఇఫ్తార్ నిర్వహణ, ముస్లింలకు రంజాన్ కానుకగా వస్త్రాల పంపిణీ అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు రద్దు చేసినందున తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు.