Ramji
-
రాంజీనగర్ ముఠా..దొంగల్లో వీళ్లు ఏ-క్లాస్
-
భీంరావ్ రామ్‌జీ అంబేడ్కర్
లక్నో: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుకు ఆయన తండ్రి ‘రామ్‌జీ’ పేరును చేర్చాలని ఉత్తరప్రదేశ్ సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం అంబేడ్కర్ పేరున్న ప్రతిచోటా (రికార్డుల్లో) రామ్‌జీ పదాన్ని చేర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన కార్యదర్శి (పరిపాలన) జితేంద్ర కుమార్ పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘అంబేడ్కర్ తండ్రి పేరు రామ్‌జీ. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం వ్యక్తి పేరు, ఇంటిపేరుకు మధ్య తండ్రి పేరు ఉంటుంది. అందుకే భీంరావ్ రామ్‌జీ అంబేడ్కర్ అని రికార్డుల్లో మారుస్తున్నాం’ అని సెక్రటేరియట్ ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. కాగా, యోగి సర్కారు నిర్ణయాన్ని ఎస్పీ, బీఎస్పీ తీవ్రంగా విమర్శించాయి. ‘అంబేడ్కర్ పేరు మార్చటం ద్వారా లబ్ధిపొందాలని ప్రభుత్వం నీచమైన నాటకాలు ఆడుతోంది. స్వలాభం కోసం బీజేపీ.. అంబేడ్కర్ పేరును దుర్వినియోగం చేస్తోంది’ అని బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. ‘గాంధీ పేరును మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ అని, ప్రధాని పేరును నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ అని ఎవరైనా పిలుస్తారా? అలాంటప్పుడు అంబేడ్కర్ పేరు మార్చటం ఎందుకు?’ అని మాయావతి ప్రశ్నించారు. అంబేడ్కర్ పేరు మార్చటం కన్నా.. ఆయన చూపిన బాటలో బీజేపీ ప్రభుత్వం నడిస్తే బాగుంటుందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సూచించారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు కూడా ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. -
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కోసం..
►మూడు రోజులుగా యువతి దీక్ష ►రేఖవానిపాలెంలో నిరసన తగరపువలస (భీమిలి): తాను ప్రేమించిన యువకునితో పెళ్లి జరిపించాలని కోరుతూ భీమిలి మండలం రేఖవానిపాలెం పంచాయతీ గ్రామంలో మూడురోజులుగా నిరసన దీక్ష చేస్తున్న రాజ్యలక్ష్మి ఉదంతం గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. నర్సీపట్నం వద్ద పెదబొడ్డేపల్లి గ్రామానికి చెందిన నూకవరపు రాజ్యలక్ష్మికి కాకినాడకు చెందిన రాంజీ అనే యువకునితో ఏడాది క్రితం భీమిలిలో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు సుముఖంగా లేకపోవడంతో రాజ్యలక్ష్మి 20 రోజుల క్రితం గన్నేరు పప్పు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో భీమిలి పోలీసులు ఈ నెల 3వ తేదీన రాంజీపై కేసు నమోదు చేసి 15 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన రాంజీ రేఖవానిపాలెంలో తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. విషయం తెలిసిన రాజ్యలక్ష్మి తనను పెళ్లి చేసుకోవాలని కోరినా ఆ యువకుడు గానీ, అతని బంధువులు గానీ స్పందించలేదు. దీంతో మంగళవారం రాత్రి నుంచి ఆమె గ్రామంలోనే నిరసన చేపట్టింది. గురువారం రాత్రి స్థానికులు ఇచ్చిన సమాచారంతో విలేకరులు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. రాజ్యలక్ష్మికి స్థానికులు ఆశ్రయం కల్పించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.