పదోన్నతులకు డీపీసీ
సాక్షి, హైదరాబాద్: కళాశాల విద్యా శాఖలో ద్వితీయ శ్రేణి గెజిటెడ్ అధికారి పోస్టుల్లో పదోన్నతులు కల్పించేందుకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీని (డీపీసీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్.ఆర్.ఆచార్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ రెండేళ్ల కాలపరిమితితో పని చేస్తుందని పేర్కొన్నారు.
మైనార్టీ శాఖకు రూ.30 కోట్లు మంజూరు
మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్ షిప్ కింద రూ.30 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.