Rashtriya Chemicals and Fertilizers Limited
-
ఎన్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్.. డిజిన్వెస్ట్‌మెంట్
-
ఎన్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్.. డిజిన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ: పీఎస్‌యూలు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్), రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఆర్సీఎఫ్)లో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ చేపట్టనుంది. దీనిలో భాగంగా ఎన్ఎఫ్ఎల్లో 20 శాతం, ఆర్సీఎఫ్లో 10 శాతం చొప్పున వాటాలు విక్రయించనుంది. ఈ సంస్థలలో వాటాల విక్రయ అంశాన్ని చేపట్టేందుకు మర్చంట్ బ్యాంకర్ల నుంచి బిడ్స్‌ను ఆహ్వానించినట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ(దీపమ్) తాజాగా పేర్కొంది. మే 5కల్లా బిడ్స్ దాఖలు చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం ఎన్ఎఫ్ఎల్లో ప్రభుత్వానికి 74.71 శాతం వాటా ఉంది. ఇదేవిధంగా ఆర్సీఎఫ్లో 75 శాతం వాటాను కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2020–21)లో ఎన్ఎఫ్ఎల్ రూ. 198 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2020 సెప్టెంబర్‌కల్లా రూ. 2,117 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉంది. ఇక ఆర్సీఎఫ్ 2019–20లో రూ. 208 కోట్ల నికర లాభం ఆర్జించగా.. 2020 మార్చికల్లా రూ.3,186 కోట్ల నెట్‌వర్త్‌ను సాధిం చింది. కాగా.. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఎన్ఎఫ్ఎల్లో 20% వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 500 కోట్లు లభించే వీలుంది. ఈ బాటలో ఆర్సీఎఫ్లో 10% వాటాకుగాను రూ. 400 కోట్లు సమకూర్చుకునే అవకాశముంది. ఎన్ఎస్ఈలో మంగళవారం ఎన్ఎఫ్ఎల్ షేరు 2.2% పుంజుకుని రూ. 54.35 వద్ద ముగిసింది. ఆర్సీఎఫ్ 3.4% జంప్‌చేసి రూ. 74.20 వద్ద నిలిచింది. -
ఉద్యోగాలు
రాష్ట్రీయ కెమికల్స్ అండ్ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజనీర్స్ బాయిలర్ ప్రొఫిషీయెన్సీ: 5 అర్హతలు: నేషనల్ పవర్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి పవర్ ఇంజనీరింగ్‌లో బీటెక్ లేదా థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్‌లో పీజీ డిప్లొమా ఉండాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం అవసరం. వయసు: 26 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 20 వెబ్సైట్: www.rcfltd.com ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. రీసెర్చ్ అసోసియేట్స్: 2 విభాగాలు: ఎకో-సిస్టమ్ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ అర్హతలు: సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో పీజీ డిగ్రీతో పాటు రీసెర్చ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 1 వెబ్సైట్: www.iifm.ac.in/vacancies