ఎన్‌ఎఫ్‌ఎల్, ఆర్‌సీఎఫ్‌.. డిజిన్వెస్ట్‌మెంట్‌ | Govt to sell 20percent in National Fertilizers,10percent in RCF | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎఫ్‌ఎల్, ఆర్‌సీఎఫ్‌.. డిజిన్వెస్ట్‌మెంట్‌

Published Thu, Apr 15 2021 5:40 AM | Last Updated on Thu, Apr 15 2021 4:33 PM

Govt to sell 20percent in National Fertilizers,10percent in RCF - Sakshi

న్యూఢిల్లీ: పీఎస్‌యూలు నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌), రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌(ఆర్‌సీఎఫ్‌)లో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ చేపట్టనుంది. దీనిలో భాగంగా ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 20 శాతం, ఆర్‌సీఎఫ్‌లో 10 శాతం చొప్పున వాటాలు విక్రయించనుంది. ఈ సంస్థలలో వాటాల విక్రయ అంశాన్ని చేపట్టేందుకు మర్చంట్‌ బ్యాంకర్ల నుంచి బిడ్స్‌ను ఆహ్వానించినట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ(దీపమ్‌) తాజాగా పేర్కొంది. మే 5కల్లా బిడ్స్‌ దాఖలు చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం ఎన్‌ఎఫ్‌ఎల్‌లో ప్రభుత్వానికి 74.71 శాతం వాటా ఉంది.

ఇదేవిధంగా ఆర్‌సీఎఫ్‌లో 75 శాతం వాటాను కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2020–21)లో ఎన్‌ఎఫ్‌ఎల్‌ రూ. 198 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2020 సెప్టెంబర్‌కల్లా రూ. 2,117 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉంది. ఇక ఆర్‌సీఎఫ్‌ 2019–20లో రూ. 208 కోట్ల నికర లాభం ఆర్జించగా.. 2020 మార్చికల్లా రూ.3,186 కోట్ల నెట్‌వర్త్‌ను సాధిం చింది. కాగా.. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 20% వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 500 కోట్లు లభించే వీలుంది. ఈ బాటలో ఆర్‌సీఎఫ్‌లో 10% వాటాకుగాను రూ. 400 కోట్లు సమకూర్చుకునే అవకాశముంది. ఎన్‌ఎస్‌ఈలో మంగళవారం ఎన్‌ఎఫ్‌ఎల్‌ షేరు 2.2% పుంజుకుని రూ. 54.35 వద్ద ముగిసింది. ఆర్‌సీఎఫ్‌ 3.4% జంప్‌చేసి రూ. 74.20 వద్ద నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement