National Fertilizers Limited
-
ఎన్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్.. డిజిన్వెస్ట్‌మెంట్
-
ఎన్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్.. డిజిన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ: పీఎస్‌యూలు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్), రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఆర్సీఎఫ్)లో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ చేపట్టనుంది. దీనిలో భాగంగా ఎన్ఎఫ్ఎల్లో 20 శాతం, ఆర్సీఎఫ్లో 10 శాతం చొప్పున వాటాలు విక్రయించనుంది. ఈ సంస్థలలో వాటాల విక్రయ అంశాన్ని చేపట్టేందుకు మర్చంట్ బ్యాంకర్ల నుంచి బిడ్స్‌ను ఆహ్వానించినట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ(దీపమ్) తాజాగా పేర్కొంది. మే 5కల్లా బిడ్స్ దాఖలు చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం ఎన్ఎఫ్ఎల్లో ప్రభుత్వానికి 74.71 శాతం వాటా ఉంది. ఇదేవిధంగా ఆర్సీఎఫ్లో 75 శాతం వాటాను కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2020–21)లో ఎన్ఎఫ్ఎల్ రూ. 198 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2020 సెప్టెంబర్‌కల్లా రూ. 2,117 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉంది. ఇక ఆర్సీఎఫ్ 2019–20లో రూ. 208 కోట్ల నికర లాభం ఆర్జించగా.. 2020 మార్చికల్లా రూ.3,186 కోట్ల నెట్‌వర్త్‌ను సాధిం చింది. కాగా.. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఎన్ఎఫ్ఎల్లో 20% వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 500 కోట్లు లభించే వీలుంది. ఈ బాటలో ఆర్సీఎఫ్లో 10% వాటాకుగాను రూ. 400 కోట్లు సమకూర్చుకునే అవకాశముంది. ఎన్ఎస్ఈలో మంగళవారం ఎన్ఎఫ్ఎల్ షేరు 2.2% పుంజుకుని రూ. 54.35 వద్ద ముగిసింది. ఆర్సీఎఫ్ 3.4% జంప్‌చేసి రూ. 74.20 వద్ద నిలిచింది. -
ఉద్యోగాలు
ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా లిమిటెడ్ (ఏఐఎల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్యూటీ మేనేజర్: 8 విభాగం: మెడికల్ అర్హతలు: ఎంబీబీఎస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం అవసరం. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 19 వెబ్సైట్: www.airindia.in నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ హర్యానాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ - 2): 10 అర్హతలు: బీఎస్సీ (ఎంపీసీ) లేదా కెమికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. స్టోర్ అసిస్టెంట్ (గ్రేడ్-2): 1 అర్హతలు: సైన్స్/ కామర్స్/ ఆర్ట్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. స్టోర్స్ అసిస్టెంట్ (గ్రేడ్ -5): 1 అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 25 వెబ్సైట్: www.nationalfertilizers.com -
ఉద్యోగాలు
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్: 10 అర్హతలు:బీఎస్సీ (ఎంపీసీ) లేదా కెమికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి. స్టోర్ అసిస్టెంట్ (గ్రేడ్ - 2): 1 అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం. వయసు:30 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 25 వెబ్సైట్:www.nationalfertilizers.com సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: ఎలక్ట్రికల్-2, ఎలక్ట్రానిక్స్-1, కంప్యూటర్ సైన్స్-1, జియాలజీ-1, ఇన్స్ట్రుమెంటేషన్-2, సివిల్ ఇంజనీరింగ్-3, కెమిస్ట్రీ-5. అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: అర్హత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 25 వెబ్సైట్: http://cbri.res.in/ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్. అర్హత: కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సివిల్ ఇంజనీరింగ్‌లో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: జనవరి 15- ఫిబ్రవరి 27 వెబ్సైట్: www.powergridindia.com