Dijinvestment
-
ఎన్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్.. డిజిన్వెస్ట్‌మెంట్
-
ఎన్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్.. డిజిన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ: పీఎస్‌యూలు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్), రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఆర్సీఎఫ్)లో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ చేపట్టనుంది. దీనిలో భాగంగా ఎన్ఎఫ్ఎల్లో 20 శాతం, ఆర్సీఎఫ్లో 10 శాతం చొప్పున వాటాలు విక్రయించనుంది. ఈ సంస్థలలో వాటాల విక్రయ అంశాన్ని చేపట్టేందుకు మర్చంట్ బ్యాంకర్ల నుంచి బిడ్స్‌ను ఆహ్వానించినట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ(దీపమ్) తాజాగా పేర్కొంది. మే 5కల్లా బిడ్స్ దాఖలు చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం ఎన్ఎఫ్ఎల్లో ప్రభుత్వానికి 74.71 శాతం వాటా ఉంది. ఇదేవిధంగా ఆర్సీఎఫ్లో 75 శాతం వాటాను కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2020–21)లో ఎన్ఎఫ్ఎల్ రూ. 198 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2020 సెప్టెంబర్‌కల్లా రూ. 2,117 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉంది. ఇక ఆర్సీఎఫ్ 2019–20లో రూ. 208 కోట్ల నికర లాభం ఆర్జించగా.. 2020 మార్చికల్లా రూ.3,186 కోట్ల నెట్‌వర్త్‌ను సాధిం చింది. కాగా.. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఎన్ఎఫ్ఎల్లో 20% వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 500 కోట్లు లభించే వీలుంది. ఈ బాటలో ఆర్సీఎఫ్లో 10% వాటాకుగాను రూ. 400 కోట్లు సమకూర్చుకునే అవకాశముంది. ఎన్ఎస్ఈలో మంగళవారం ఎన్ఎఫ్ఎల్ షేరు 2.2% పుంజుకుని రూ. 54.35 వద్ద ముగిసింది. ఆర్సీఎఫ్ 3.4% జంప్‌చేసి రూ. 74.20 వద్ద నిలిచింది. -
4 పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్‌మెంట్ కు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన నాలుగు సంస్థల్లో (పీఎస్‌యూ) వాటాల విక్రయ (డిజిన్వెస్ట్‌మెంట్) ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా శుక్రవారం లోక్‌సభకు తెలిపారు. వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 22,574 కోట్లు రాగలవని అంచనా వేస్తున్నట్లు వివరించారు. డిజిన్వెస్ట్‌మెంట్ జాబితాలో ఓఎన్జీసీ, ఎన్ఎండీసీ, నాల్కో, బీహెచ్ఈఎల్ సంస్థలు ఉన్నాయి. ఓఎన్జీసీలో 5 శాతం వాటాల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 13,217 కోట్లు, ఎన్ఎండీసీ, నాల్కోల్లో చెరి పది శాతం వాటాల విక్రయంతో మొత్తం రూ. 6,228 కోట్లు, బీహెచ్ఈఎల్లో 5 శాతం వాటాల విక్రయంతో రూ. 3,129 కోట్లు, రాగలవని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు.