ఆర్ఐఎంసీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్(ఆర్ఐఎంసీ)లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. విద్యా శాఖ ఆధ్వర్యంలో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హామీ ఇచ్చారని పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని కోరుతూ శనివారం సచివాలయంలో పీఆర్టీయూ-తెలంగాణ నేతలు సీఎస్‌ను కలిశారు.