rates high
-
వాహనాల ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా..?
పుణే, బిజినెస్ బ్యూరో: కాలుష్యాన్ని కట్టడి చేసే పేరిట అతి నియంత్రణలు, అధిక స్థాయి జీఎస్టీలను అమలు చేయడం వల్లే వాహనాల రేట్లకు రెక్కలు వచ్చాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. బ్రెజిల్ వంటి దేశాల్లో మోటార్‌సైకిళ్లపై పన్నులు 8–14 శాతం శ్రేణిలో ఉండగా దేశీయంగా మాత్రం అత్యధికంగా 28 శాతం జీఎస్టీ ఉంటోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనాల ధరలను తగ్గించే పరిస్థితి ఉండటం లేదని, దీంతో నిర్వహణ వ్యయాలైనా తగ్గే విధంగా వాహనాలను రూపొందించడం ద్వారా కొనుగోలుదారులకు కొంతైనా ఊరటనిచ్చే ప్రయత్నం జరుగుతోందని బజాజ్ చెప్పారు. 125 సీసీ పైగా సామర్ధ్యం ఉండే స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్ల విభాగంలో తమకు ముప్ఫై రెండు శాతం మేర వాటా ఉందని, దీన్ని మరింతగా పెంచుకునే దిశగా డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం తరహాలో డబుల్ ఇంజిన్ కారోబార్ (కార్యకలాపాలు) వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజీవ్ చెప్పారు.బజాజ్ పల్సర్ 400 ధర రూ. 1,85,000బజాజ్ ఆటో తాజాగా పల్సర్ ఎన్ఎస్ 400జీ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 1,85,000గా (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. డెలివరీలు జూన్ మొదటివారం నుంచి ప్రారంభమవుతాయని సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. స్పోర్ట్స్ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పల్సర్ బైకులు 1.80 కోట్ల పైచిలుకు అమ్ముడైనట్లు బజాజ్ వివరించారు. పరిమిత కాలం పాటు వర్తించే ఆఫర్ కింద కొత్త పల్సర్‌ను రూ. 5,000కే బుక్ చేసుకోవచ్చు. నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది. శక్తివంతమైన 373 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, ఎల్రక్టానిక్ థ్రోటిల్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. సీఎన్జీ మోటార్‌సైకిల్‌ను జూన్ 18న ఆవిష్కరించనున్నామని రాజీవ్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ అన్నారు. -
Afghanistan Crisis: భారీగా పెరిగిన డ్రైఫ్రూట్స్ ధరలు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. చాలామంది పౌష్టికాహారంగా డ్రైఫ్రూట్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటికి గిరాకీ పెరిగింది. డ్రైఫ్రూట్స్‌లో బాదం, అంజీర, మనక్క, పిస్తా, ఆలూబుకార, ఖుర్బానీ..వంటివి అఫ్గానిస్తాన్ దేశం నుంచే మనకు దిగుమతి అవుతాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. అక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా వీటి రవాణా నిలిచిందని తద్వారా ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. రూ.50 నుంచి రూ.200 వరకు... అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల రాకతో అక్కడి వారి మాటేమో గానీ, అక్కడి నుంచి మన దేశానికి దిగుమతి అయ్యే డ్రైఫ్రూట్స్ ధరలపై మాత్రం ప్రభావం పడిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మనకు పెద్దమొత్తంలో డ్రైఫ్రూట్స్ అక్కడి నుంచే దిగుమతి అవుతాయి. ముందుగా ఢిల్లీ, ముంబయి, తదితర ప్రాంతాలకు వస్తాయి. అక్కడి నుంచి హైదరాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్‌కు దిగుమతి అవుతుంటాయి. అక్కడి నుంచి జిల్లాకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకువస్తుంటారు. అఫ్గాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా రవాణా నిలిచిపోయింది. ఫలితంగా ఇక్కడ ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం డ్రై ఫ్రూట్స్ ధరలు పక్షం రోజుల క్రితంతో పోల్చితే కిలోకు రూ.50 నుంచి రూ.200 వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: చక్కెర ఎగుమతులపై తాలిబన్ ఎఫెక్ట్ ? -
టైర్ల పరుగు.. మొదలైందిప్పుడు!!
డిమాండ్– సప్లై గురించి మనకు తెలియనిదేమీ కాదు. డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలంటే సరఫరా పెరగాలి. సరఫరా పెరగాలంటే తయారీ సామర్థ్యం పెంచుకోవాలి. ఇప్పుడు టైర్ల కంపెనీలూ అదే దార్లో పడ్డాయి. ఆటోమొబైల్ సంస్థలు, రిప్లేస్మెంట్ మార్కెట్ నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టైర్ల కంపెనీలు వాటి తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కార్యకలాపాలను విస్తరించడానికి టైర్ల కంపెనీలు వచ్చే 7–10 ఏళ్ల కాలంలో మొత్తంగా రూ.13,600 కోట్లు వెచ్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఎక్కువ భాగం కొత్త యూనిట్ల ఏర్పాటుకే ఖర్చు చేయనున్నాయి. ఉత్పత్తిని 40 శాతం పెంచుకుంటాం: సియట్ ఆర్పీజీ గ్రూప్‌నకు చెందిన సియట్ టైర్స్ తన తయారీని మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ‘ప్రస్తుత ఉత్పత్తిని 35– 40 శాతం మేర పెంచుకోవాలని భావిస్తున్నాం. గుజరాత్‌లోని హలోల్ ప్లాంటులో బస్సు, ట్రక్ రేడియల్స్ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నాం. అలాగే ప్యాసింజర్ కార్ రేడియల్స్ కోసం ఒక గ్రీన్‌ఫీల్డ్ యూనిట్(కొత్త ప్లాంట్) ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ అని సియట్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా తెలిపారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం తగ్గిపోయిందని, అందువల్ల రిప్లేస్మెంట్ విభాగం, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఓఈఎం) నుంచి డిమాండ్ అధికంగా ఉందని పేర్కొన్నారు. అందుకే సామర్థ్యం పెంపునకు రూ.1,200–రూ.1,300 కోట్ల ఇన్వెస్ట్మెంట్లను కేటాయించామన్నారు. వాహన విక్రయాలతో జోరు.. క్రూడ్ ధరలతో బేజారు.. భారత్‌లో ఇటీవల కాలంలో వాహన విక్రయాలు జోరుగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా టూవీలర్లు, ట్రక్ విక్రయాల్లో మంచి వృద్ధి నమోదవుతోంది. సియామ్ గణాంకాల ప్రకారం.. 2018 ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ పరిశ్రమ మొత్తంగా 2.9 కోట్ల యూనిట్ల వాహనాలను తయారు చేసింది. 2017 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 15% వృద్ధి నమోదయింది. అలాగే ఎగుమతులు సహా దేశీ మార్కెట్ల నుంచి ఆర్డర్ బుక్ బలంగా ఉండటం, రబ్బరు ధరలు స్థిరంగా ఉండటం, యాంటీ డంపింగ్ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి వంటివి టైర్ల కంపెనీలకు కలిసొస్తున్నాయి. అయితే ఇక్కడ క్రూడ్ ధరలు పెరుగుతుండటం ప్రతికూల అంశం. ముడిచమురు ధరల పెరుగుదల వల్ల ప్రస్తుత త్రైమాసికం నుంచే చాలా టైర్ల కంపెనీల లాభదాయకతపై ఒత్తిడి పెరిగే అవకాశముంది. క్రూడ్ ఆధారిత ముడిపదార్థమైన కార్బన్బ్లాక్.. టైర్ల తయారీ కంపెనీల వ్యయాల్లో దాదాపు 45 శాతం వాటాను ఆక్రమించింది. ముడి చమురు ధరలు సగటున 62 డాలర్ల నుంచి 75 డాలర్లకు పెరగటం తెలిసిందే. విస్తరణ బాటలో ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్ సియట్ ప్రత్యర్థులైన ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్ కూడా విస్తరణపై దృష్టి కేంద్రీకరించాయి. బస్సు/ ట్రక్ రేడియల్స్, టూవీలర్ టైర్స్ విభాగంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఎంఆర్ఎఫ్.. వచ్చే దశాబ్ద కాలంలో గుజరాత్లో రూ.4,500 కోట్లమేర ఇన్వెస్ట్ చేయనుంది. తమిళనాడు వెలుపల కంపెనీకి ఇదే అతిపెద్ద విస్తరణ. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఏర్పాటవుతున్న కొత్త ప్లాంటులో రూ.1,800 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని అపోలో టైర్స్ జనవరిలోనే ప్రకటించింది. వచ్చే రెండేళ్ల కాలంలో ఈ ప్లాంటు సేవలు అందుబాటులోకి రానున్నవి. ఏడాదికి 55 లక్షల టైర్ల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంటు నిర్మితమౌతోంది. 2017–18, 2018–19 కాలంలో రూ.4,500 కోట్లు ఇన్వెస్ట్ చేయాలనుకున్నామని, అందులో భాగమే ఏపీ ప్లాంటులోని ఇన్వెస్ట్మెంట్లని కంపెనీ తెలిపింది. ‘చెన్నైలో విస్తరణ దాదాపు పూర్తయింది. ఇప్పుడు చెన్నై యూనిట్లో 12,000 రేడియల్స్ను తయారు చేయగలం’ అని అపోలో టైర్స్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. టైర్ల కంపెనీలు వాటి తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని ఆటోమోటివ్ టైర్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బుధ్రాజా తెలిపారు. 5–6 ఏళ్లనాటి పాత ఫెసిలిటీలు పూర్తి సామర్థ్యంతో నడుస్తుండటం ఒక కారణమైతే.. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వల్ల గత రెండేళ్లుగా రిప్లేస్మెంట్ మార్కెట్, వాహన కంపెనీల నుంచి డిమాండ్ పెరగడం రెండోదని పేర్కొన్నారు. టైర్ల ధరలు పెరగొచ్చు!! భవిష్యత్‌లో టైర్ల ధరలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్ని విభాగాల నుంచి ఉన్న బలమైన డిమాండ్ నేపథ్యంలో టైర్ల కంపెనీలు ఉత్పత్తి వ్యయాలను ధరల పెంపు ద్వారా బదిలీ చేసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు. ‘వచ్చే రెండు త్రైమాసికాల కాలంలో ముడిపదార్థాల ధరలు 3–4 శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. క్రూడ్ ధరల పెరగుదల దీనికి కారణం. దీనివల్ల టైర్ల ధరలు 2–2.5 శాతంమేర పెరగొచ్చు’ అని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ అనలిస్ట్‌లు నిశిత్ జలాన్, హితేశ్ గోయెల్ వివరించారు. కంపెనీ ఇన్వెస్ట్మెంట్లు (రూ.కోట్లు) ఉద్దేశం ఎంఆర్ఎఫ్ 4,500 గుజరాత్లో గ్రీన్‌ఫీల్డ్ ఫెసిలిటీ ఏర్పాటు అపోలో 4,500 ఏపీలో గ్రీన్‌ఫీల్డ్ ఫెసిలిటీ ఏర్పాటు, యూనిట్ల విస్తరణ జేకే టైర్స్ 500 ప్రస్తుత యూనిట్ల విస్తరణ సియట్ టైర్స్ 1,300 గ్రీన్‌ఫీల్డ్ ఫెసిలిటీ ఏర్పాటు, ప్రస్తుత యూనిట్ల విస్తరణ మాక్సిస్ 2,640 గుజరాత్లో గ్రీన్‌ఫీల్డ్ యూనిట్ ఏర్పాటు - (సాక్షి, బిజినెస్ విభాగం) -
మామిడి ధరలు పుల్లన..!
విజయనగరం ఫోర్ట్ : మామిడి పండ్ల ధరలు పుల్లగా మారాయి. ఈ ఏడాది మామిడి పంటకు వాతావరణం అనుకూలించ లేదు. తెగుళ్లు దాడిచేయడం, పూత ఆలస్యం కావడంతో దిగుబడి అమాం తం తగ్గింది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది కంటే 8 నుంచి 10 రెట్లు పెరిగాయి. పండ్లవైపు చూసేందుకు సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. హెక్టారుకు గత ఏడాది 10 నుంచి 12 టన్నులు దిగుబడి వస్తే ఈ ఏడాది 4 టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 46 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. కొన్ని చెట్లకు పూతే రాలేదు. చెట్లకు అరకొరగా ఉన్న కాయలు ఇటీవల ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షాలకు నేలపాలయ్యాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు చేరుతున్న పంటకు ధర బాగుండడంతో రైతులు సంతోషపడుతున్నారు. పది రెట్లు పెరిగాయ్.. గత ఏడాది పణుకులు టన్ను ధర రూ.6 వేలు ఉంటే ఈ ఏడాది రూ.60 వేలు పలుకుతోంది. సువర్ణరేఖ రకం గతేడాది రూ.20 వేలు ఉంటే ఈ ఏడాది రూ.80 వేలు, బంగినిబిల్లి రకం రూ.30 వేలు ఉంటే ఈ ఏడాది రూ.90 వేలు, పరియాలు రూ.2 వేలు నుంచి రూ.40 వేలకు, రసాలు గత ఏడాది రూ.30 వేలు ఉంటే ఈ ఏడాది రూ.80 వేలకు చేరింది. పండ్ల ధరలతో పాటు మామిడి తాండ్ర ధరలు సైతం అమాం తం పెరగనున్నాయి. గత ఏడాది కేజీ తాండ్ర రూ.100 నుంచి రూ.120 ఉంది. ఇప్పుడు కేజీ తాండ్ర ధర రూ.600 నుంచి 800 వరకు అయ్యే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. బాగా పెరిగాయి... గత ఏడాది కంటే ఈ ఏడాది మామిడి ధరలు బాగా పెరిగాయి. దిగుబడి తగ్గడంతోనే ఈ పరిస్థితి. ఇది రైతులకు కాస్త ఊరటగా ఉంది. తెగుళ్లు, పురుగులు, వాతావరణ మార్పుల వల్లే దిగుబడులు తగ్గాయి. – పీఎన్వీ లక్ష్మీనారాయణ, డీడీ, ఉద్యానశాఖ -
ధరల మంట
పటాన్చెరు టౌన్: నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. రోజురోజుకూ మార్కెట్లో పెరుగుతున్న రేట్లను చూసి సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతి పండుగకు పిల్లలకు పిండివంటలు చేసి పెడదామని ఆశపడ్డ తల్లులు పెరిగిన ధరలకు చూసి బెంబేలెత్తిపోతున్నారు. నిన్న మొన్నటివరకు కిలో రూ.70 ఉన్న నూనె ధర ప్రస్తుతం రూ.85కి పెరిగింది. బియ్యం కిలో రూ.38 ఉండగా రూ.45 చేరింది. నువ్వులు కిలో రూ.100 ఉండగా ప్రస్తు తం రూ.120పైనే పలుకుతోంది. బెల్లం కిలో రూ.40 ఉండగా రూ.50పైగా విక్రయిస్తున్నారు. సం క్రాంతి పం డగకు వినియోగించే నూనెలు, నువ్వులు, పెసరపప్పు ధరలు అమాంతం పెరిగాయి. పిండివంట లు ప్రియం కావడంతో అవి లేకుండా పండుగ చేసుకో వాల్సి వస్తోందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాలు జరుపుకొనే పండుగ.. ఖరీఫ్ పంటలు చేతికి వచ్చిన తర్వాత వచ్చే పండగ సంక్రాంతి. రైతులు ఈ పండగను అనందోత్సహాల మధ్య జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. విద్యాసంస్థలకు వారం రోజుల పాటు సెలువులు ఇవ్వనుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులు, విద్యార్థులు, ఆడబిడ్డల రాకతో ప్రతి ఇంట్లో సందడి కనిపిస్తుంది. పండగకు ఇంటింటా పిండివంటల ఘమఘమలు వెదజల్లుతుంటాయి. ఈ ఏడాది ఆశించిన పంట దిగుబడుల రాకపోవడంతో రైతులు నష్టాల పాలయ్యారు. పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేకపోతున్నారు. మరోవైపు నిత్యావసరాల ధరలు భగ్గుమంటుండడంతో పండుగ ఎలా జరుపుకునేదని గ్రామీణ ప్రజలు వాపోతున్నారు. పిండివంటలో పండుగ ఘనంగా చేసుకోవాలంటే అప్పు చేయక తప్పదని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ ఎలా చేసేది? నిన్న మున్నటి వరకు పెరసపప్పు కిలో రూ.60 ఉంటే ఇప్పుడు కిలో రూ.75కు చేరింది. నూనె ధర అమాంతం పెరిగింది. పిండివంటలు చేసుకుందామంటే పామాయిల్ ధరలు కూడా అందిరావడం లేదు. అన్ని ధరలు ఇలా పెరిగితే పండుగ ఎలా చేసుకునేది. పండుగకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులను ప్రభుత్వం తక్కువ ధరలకు అందజేయాలి. – కొత్తకోట రాజేశ్వరి, గృహిణి రూ. వేలల్లో ఖర్చు చేయాలి రోజురోజుకూ ధరలు పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో భయమేస్తోంది. పిండివంటలతో పండుగా వైభవంగా జరుపుకోవాలంటే వందల్లో వేలల్లో ఖర్చు చేయాల్సి వచ్చేలా ఉంది. కొత్త పంటలు చేతికి వచ్చే సమయంలో పండుగకు ధరలు దిగుతాయనుకుంటే పెరిగాయి. – సుధారాణి గృహిణి ధరలు ఇలా.. సరుకు రెండు నెలల క్రితం ప్రస్తుతం నువ్వులు 100 120 బియ్యం బీపీటీ 35 40 బియ్యం హెచ్ఎంటీ 44 48 సన్‌ఫ్లవర్ నూనె 75 85 పామాయిల్ 60 70 కందిపప్పు 65 70 పెసరపప్పు 68 75 మినుపపప్పు 70 75 -
రాజన్న లడ్డూ భోగం ధరలు మరింత ప్రియం
వేములవాడ: ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి(రాజన్న) లడ్డూ భోగం ప్రసాదాలు మరింత ప్రియం అయ్యాయి. వీటి ధరలను దేవాదాయ శాఖ భారీగా పెంచేసింది. లడ్డూ భోగం (40 లడ్డూలు) రూ.400లు ఉండగా దానిని రూ.700లకు పెంచింది. సిరా భోగం రూ.౩౦౦ నుంచి రూ.600 లకు, దధ్యోజనం రూ.150 నుంచి రూ.300 లకు పెంచింది. పెరిగిన ధరలు ఈ నెల 13వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఇ.ఒ. దూస రాజేశ్వర్ తెలిపారు. -
పట్టు అధరహో..
– రికార్డు స్థాయిలో పట్టుగూళ్ల ధరలు – హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సంప్రదాయ వేరుశనగతోపాటు ఇతర పంటలు కూడా చేతికందడం లేదు. భూగర్భజలాలు అడుగంటిపోయాయి. మరోవైపు అరకొర దిగుబడి వచ్చినా వాటికి సరైన ధరలు లేవు. ప్రత్యామ్నాయంగా చేపట్టిన మల్బరీసాగు అంతరించి పోతున్న తరుణంలో పట్టు గూళ్లకు రికార్డు స్థాయిలో ధరలు లభిస్తున్నాయి. మడకశిర, హిందూపురం, కళ్యాణదుర్గం, పెనుకొండ, కదిరి ప్రాంతాలలో మల్బరీ పంట సాగవుతోంది. రికార్డుస్థాయి ధరలు చూసి మరికొంతమంది రైతులు మల్బరీ సాగుపై మొగ్గుచూపుతున్నారు. ధరలు ఆశాజనకం.. జిల్లాలో 30వేల ఎకరాల్లో మల్బరీ సాగవుతోంది. ధర్మవరం పట్టుగూళ్ల మార్కెట్లో బైవోల్టిన్ రకం గూళ్లకు కిలో రూ.450 నుంచి 466 వరకు ధర పలుకుతోంది. వీటితో పాటు కిలోకు రూ.50 అదనంగా ప్రభుత్వం రైతులకు బోనస్‌గా ఇస్తోంది. సీబీ రకం పట్టుగూళ్లకు రూ.10 బోనస్‌గా ఇస్తోంది. ఏ ప్రాంతాల నుంచి వస్తున్నాయంటే... ఇటీవల కాలంలో పట్టుగూళ్లకు మంచి ధరలు ఉండడంతో కర్ణాటక ప్రాంతానికి వెళ్లే రైతులు చాలా మంది ధర్మవరం పట్టుగూళ్ల మార్కెట్‌కు గూళ్లను తీసుకువస్తున్నారు. కర్నూలు, కళ్యాణదుర్గం, పెనుకొండ తదితర ప్రాంతాల నుంచి సరాసరి రోజుకు 1500 కేజీల నుంచి 2000 కేజీల వరకు పట్టుగూళ్లు వస్తున్నాయి. రీలర్లు ఎంత మంది ఉన్నారంటే.. నాలుగేళ్ల క్రితం 60 నుంచి 70 మంది దాకా రీలర్లు ధర్మవరం పట్టుగూళ్ల మార్కెట్‌కు వచ్చి వేలం పాటలో పాల్గొనే వారు. అయితే పట్టుగూళ్లు అటు ఇటుగా వస్తుండడంతో ప్రస్తుతం 18 నుంచి 20 మంది రీలర్లు మాత్రమే వస్తున్నారు.